RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, జులై 2026, మంగళవారం

ప్రతి రాత్రి వసంత రాత్రి | Pratiratri Vasantha Ratri | Song Lyrics | Ekaveera (1969)

ప్రతి రాత్రి వసంత రాత్రి 


చిత్రం: ఏకవీర (1969)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: దేవులపల్లి

నేపథ్య గానం: ఘంటసాల, ఎస్ పి బాలు


పల్లవి :


ప్రతి రాత్రి వసంత రాత్రి 

ప్రతి గాలి పైరగాలి

ప్రతి రాత్రి వసంత రాత్రి 

ప్రతి గాలి పైరగాలి

బ్రతుకంతా ప్రతినిమిషం 

పాట లాగ సాగాలీ

ప్రతి నిమిషం ప్రియా ప్రియా 

పాట లాగ సాగాలీ

ప్రతి రాత్రి వసంత రాత్రి 

ప్రతి గాలి పైరగాలి


చరణం 1:


నీలో నా పాట కదలి 

నాలో నీ అందె మెదలి

నీలో నా పాట కదలి 

నాలో నీ అందె మెదలి

లోలోన మల్లెపొదలా 

పూలెన్నో విరిసి విరిసి

లోలోన మల్లెపొదలా 

పూలెన్నో విరిసి విరిసి

మనకోసం ప్రతినిమిషం 

మధుమాసం కావాలీ

మనకోసం ప్రియా ప్రియా 

మధుమాసం కావాలీ

ప్రతి రాత్రి వసంత రాత్రి 

ప్రతి గాలి పైరగాలి


చరణం 2:


ఒరిగింది చంద్రవంక 

వయ్యారి తారవంక

ఒరిగింది చంద్రవంకా 

వయ్యారి తారవంక

విరజాజి తీగసుంత 

జరిగింది మావిచెంత

విరజాజి తీగసుంత 

జరిగింది మావిచెంత

నను జూచీ నిను జూచీ 

వనమంతా వలచిందీ

నను జూచీ ప్రియా ప్రియా 

వనమంతా వలచిందీ

ప్రతి రాత్రి వసంత రాత్రి 

ప్రతి గాలి పైరగాలి


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు