RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

16, జూన్ 2026, మంగళవారం

నీతికి నిలబడి నిజాయితీగా | Neetiki Nilabadi Nijayitheega | Song Lyrics | Poola Rangadu (1967)

నీతికి నిలబడి నిజాయితీగా 


చిత్రం : పూల రంగడు (1967)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : కొసరాజు

నేపధ్య గానం : ఘంటసాల 


పల్లవి :


నీతికి నిలబడి నిజాయితీగా 

పదరా ముందుకు పదరా

పదరా ముందుకు పదరా


నీతికి నిలబడి నిజాయితీగా 

పదరా ముందుకు పదరా

చల్ రే బేటా చల్ రే


చరణం 1 :


తాతల తండ్రుల అర్జన తింటూ 

జల్సాగా నువ్వు తిరగకురా

తాతల తండ్రుల అర్జన తింటూ 

జల్సాగా నువ్వు తిరగకురా

కండలు కరగగ కష్టం చేసి 

తలవంచక జీవించుమురా

పూలరంగడిగ వెలుగుమురా


హోయ్.. 

నీతికి నిలబడి నిజాయితీగా 

పదరా ముందుకు పదరా


చరణం 2 :


పెంచిన కుక్కకు రొట్టె మేపుతూ 

హుషారుగా ఒకడున్నాడు

బల్ ఖుషీ ఖుషీగా ఉన్నాడు ….

కన్నబిడ్డకు గంజిదొరకక 

ఉసూరుమని ఒకడున్నాడు


హోయ్.. 

నీతికి నిలబడి నిజాయితీగా 

పదరా ముందుకు పదరా


చరణం 3 :


ఉన్నవాడికి అరగని జబ్బు.. 

లేనివాడికి ఆకలిజబ్బు

ఉన్నవాడికి అరగని జబ్బు.. 

లేనివాడికి ఆకలిజబ్బు

ఉండీలేని మధ్యరకానికి 

చాలీచాలని జబ్బురా

ఒకటే అప్పుల జబ్బురా


హోయ్.. 

నీతికి నిలబడి నిజాయితీగా 

పదరా ముందుకు పదరా


చరణం 4 :


కష్టాలెన్నో ముంచుకువచ్చిన 

కన్నీరును ఒలికించకురా

కష్టజీవుల కలలు ఫలించే 

కమ్మని రోజులు వచ్చునురా

చివరకు నీదే విజయమురా  


నీతికి నిలబడి నిజాయితీగా 

పదరా ముందుకు పదరా

పదరా ముందుకు పదరా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీవు రావు నిదురరాదు | Neevu Ravu Niduraradu | Song Lyrics | Poola Rangadu (1967)

నీవు రావు నిదురరాదు చిత్రం : పూల రంగడు (1967) సంగీతం : ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : దాశరథి నేపధ్య గానం : పి.సుశీల  పల్లవి: నీవు రావు నిదురరా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు