RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

7, జూన్ 2026, ఆదివారం

వెన్నెల విరబూస్తున్న వేళ | కృష్ణం కలయసఖి సుందరం | Vennela Viraboostunna Vela | Song Lyrics | RKSS Creations

వెన్నెల విరబూస్తున్న వేళ 


కృష్ణం సఖి సుందరం

మూల కీర్తన రచన : శ్రీ నారాయణ తీర్థ

రచన :  రామకృష్ణ దువ్వు  

Album: RKSS Creations...


పల్లవి :


కృష్ణం కలయ సఖి సుందరం

బాల కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కలయ సఖి సుందరం

సుందరం సుందరం సుందరం 


చరణం 1 :


వెన్నెల విరబూస్తున్న వేళ

వెదురు బొంగు పిలిచిన వేళ

గోపిక గుండెకు దగ్గరగా

నీలమేఘ శ్యాముడు నడిచెనే


పసుపు చీరలు పరచిన ముంగిట

పూలమాలలు గుభాలిస్తున్న క్షణం 

చిన్ని పాదాల తాకిడిలో 

అవని మైమరచి నిలచెనే 


కళ్లలో కాంతి అంతులేని ప్రీతి

మాటలందు మధురిమ, 

పాటలందు పలికిన రాగం 

హృదయమందు సుధను కురిసే 


కృష్ణం కలయ సఖి సుందరం

బాల కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కలయ సఖి సుందరం

సుందరం సుందరం సుందరం 


చరణం 2 :


ముంగిట ముత్యాల ముగ్గుల మధ్య

మధుర మురళి వినిపించెను

వెన్నదోచె చిలిపి దొంగ 

పట్టబోతే అట్టా దూకి నవ్వేనే 

 

చిన్న చేతిలో వెన్న ముద్ద

చూడగానే కలిగే ముద్దు 

తల్లి చెంతకు పరుగులెత్తే 

గోపబాలుడు ప్రేమకురిసే 

 

పాదం పడితే పూవే నవ్వును

పిలుపులకే  ప్రకృతి పాడును

ఆ మోహన రూపం కనిపిస్తే

మనసున సంకెళ్లు తెగెనే

 

కృష్ణం కలయ సఖి సుందరం

బాల కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కలయ సఖి సుందరం

సుందరం సుందరం సుందరం 

 

చరణం 3:


యశోద ఇంటిలోన నవ్వుల జల్లు

యమునా తీరంలో వెన్నెల విందు 

ఎండలోనైనా చల్లనిది ఇలలోని

కన్నయ్య చూపుల కరుణ గాదె 


కృష్ణం కలయ సఖి సుందరం

బాల కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కలయ సఖి సుందరం

సుందరం సుందరం సుందరం


కృష్ణం కలయ సఖి సుందరం

బాల కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కలయ సఖి సుందరం

సుందరం సుందరం సుందరం


రచన : రామకృష్ణ దువ్వు 

RKSS Creations...





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

చుక్కల్లారా చూపుల్లారా | Chukkallara Chupullara | Song Lyrics | Apadbhandavudu (1992)

చుక్కల్లారా చూపుల్లారా   చిత్రం: ఆపద్బాంధవుడు (1992) సంగీతం:  ఎ మ్.  ఎ మ్. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్ పి బాలు, చిత్ర,  పల్లవి :...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు