RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

21, ఫిబ్రవరి 2026, శనివారం

ఊరు మారినా ఉనికి మారునా | Ooru Marina Uniki Maruna | Song Lyrics | Mooga Nomu (1969)

ఊరు మారినా ఉనికి మారునా


చిత్రం :  మూగనోము (1969)

సంగీతం :  ఆర్. గోవర్ధన్

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


ఊరు మారినా...  ఉనికి మారునా

మనిషి దాగినా...  మమత దాగునా

ఊరు మారినా...  ఉనికి మారునా

మనిషి దాగినా...  మమత దాగునా


మరలిరాని పయనంలో...  

మజిలీ లేదు

ఆడదాని కన్నీటికి అంతేలేదు 


ఊరు మారినా...  ఉనికి మారునా

మనిషి దాగినా...  మమత దాగునా


చరణం 1 :


అనురాగ దీపం...  అసమాన త్యాగం

స్త్రీజాతి కొరకే సృజియించె 

దైవంచిరునవ్వులన్నీ...  

పెరవారికొసగిచీకటులలోనే 

జీవించు యువతి


తలపులే వీడవు...  

వీడేది మనిషేవలపులే వాడవు...  

వాడేది తనువే


ఊరు మారినా...  ఉనికి మారునా

మనిషి దాగినా...  మమత దాగునా


చరణం 2 : 


మగవానికేమో... ఒకనాటి సుఖమూ

కులకాంతకదియే...  కలకాల ధనమూ

తనవాడు వీడా ... అపవాదు తోడా

పదినెలలమోతా...  చురకత్తి కోతా


సతులకే ఎందుకు ఈ ఘోరశిక్ష

సహనమే స్త్రీలకూ...  శ్రీరామరక్ష


ఊరు మారినా...  ఉనికి మారునా

మనిషి దాగినా...  మమత దాగునా

ఊరు మారినా...  ఉనికి మారునా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఒకటే కోరిక నిన్ను చేరాలనీ | Okate Korika Ninnu | Song Lyrics | Dongalaku Donga 91977)

ఒకటే కోరిక నిన్ను చేరాలనీ చిత్రం: దొంగలకు దొంగ (1977)  సంగీతం: సత్యం  గీతరచయిత: మైలవరపు గోపి  నేపధ్య గానం: బాలు, సుశీల  పల్లవి:  ఒకటే కోరిక ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు