RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

2, ఫిబ్రవరి 2026, సోమవారం

పాపాయి నవ్వాలి పండగే రావాలి | Papayi Navvali Pandage Ravali | Song Lyrics | Manushulu Marali (1969)

పాపాయి నవ్వాలి పండగే రావాలి 



చిత్రం : మనుషులు మారాలి (1969)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి:


పాపాయి నవ్వాలి... పండగే రావాలి... 

మా ఇంట కురవాలి... పన్నీరు

పాపాయి నవ్వాలి..పండగే రావాలి... 

మా ఇంట కురవాలి... పన్నీరు...


పాపాయి నవ్వినా... 

పండగే వచ్చినా... 

పేదల కన్నుల కన్నీరే..

పాపాయి నవ్వినా... 

పండగే వచ్చినా... 

పేదల కన్నుల కన్నీరే

నిరు పేదల కన్నుల కన్నీరే ..


పాపాయి నవ్వాలి... 

పండగే రావాలి... 

మా ఇంట కురవాలి... పన్నీరు


చరణం 1:


కార్తీకమాసాన... ఆకాశ మార్గాన... 

కనువిందు చేసేను జాబిల్లి

కార్తీకమాసాన... ఆకాశ మార్గాన... 

కనువిందు చేసేను జాబిల్లి


ఆషాఢమాసాన... మేఘాల చెరలోన 

అల్లాడిపోయెను జాబిల్లి

ఆషాఢమాసాన... మేఘాల చెరలోన 

అల్లాడిపోయెను జాబిల్లి

అల్లాడి పోయెను జాబిల్లి


నిద్దురపో... నిద్దురపో 

ముద్దుల పాపా నిద్దురపో...

నిద్దురపో...  నిద్దురపో 

ముద్దుల పాపా నిద్దురపో...


పాపాయి నవ్వాలి... 

పండగే రావాలి... 

మా ఇంట కురవాలి... పన్నీరు


చరణం 2:


వైశాఖమాసాన... భూదేవి సిగలోన... 

మరుమల్లెచెండౌను జాబిల్లి

శ్రావణమాసాన... జడివాన ఒడిలోన... 

కన్నీటి కడవౌను జాబిల్లి

కన్నీటి కడవౌను జాబిల్లి


నిద్దురపో... నిద్దురపో 

ముద్దుల పాపా నిద్దురపో...

నిద్దురపో... నిద్దురపో 

ముద్దుల పాపా నిద్దురపో...


పాపాయి నవ్వాలి ... పండగే రావాలి... 

మా ఇంట కురవాలి... పన్నీరు..

పాపాయి నవ్వాలి ... పండగే రావాలి... 

మా ఇంట కురవాలి... పన్నీరు...


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు | Ennallakennallaku | Song Lyrics | Adavi Ramudu (1977)

ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు  చిత్రం: అడవిరాముడు (1977) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం:  ఎస్ పి బాలు, పి. సుశీల, ఎస్. జానకి ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు