ఆ నాటి ఆ స్నేహమానందగీతం
చిత్రం : అనుబంధం (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు
పల్లవి :
ఆ నాటి ఆ స్నేహమానందగీతం
ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
ఆ రోజులు మున్ముందిక రావేమిరా
హహ లేదురా... ఆ సుఖం
రాదురా ఆ గతం...
ఏమిటో జీవితం
ఒరెయ్ ఫూల్! గుర్తుందిరా
గోడలు దూకిన రోజులు...
మోకాలికి తగిలిన దెబ్బలు
చీకట్లో పిల్లనుకుని...
ఒరెయ్ ఒరెయ్ ఒరెయ్
పక్కనే పెళ్ళికావల్సిన
పిల్లలున్నార్రా
నేర్చుకుంటార్రా హహహ
చరణం 1 :
నేనూ మారలేదు...
నువ్వూ మారలేదు
కాలం మారిపోతే...
నేరం మనదేమికాదు
ఈ నేల ఆ నింగి ఆలాగే ఉన్నా
ఈ గాలిమోస్తుంది మనగాథలెన్నో
నెమరేసుకుందాము...
ఆ రోజులు
భ్రమలాగ ఉంటాయి...
ఆ లీలలు
ఆ మనసులు ఆ మమతలు
ఏమాయెరా
ఒరెయ్ రాస్కెల్! జ్ఞాపకముందిరా
కాలేజిలో... క్లాసురూములో
ఓ పాపమీద..
నువ్వు పేపరుబాల్ కొడితే
ఆ పాప ఎడమకాలి చెప్పుతో..
ఒరెయ్ ఒరెయ్ ..
ఒరెయ్ స్క్రౌండ్రర్
ఊరుకోరా పిల్లలు వింటారు
వింటే వింటార్రా...
పిల్లల పిల్లలకు పిట్టకథగా
చెప్పుకుంటారు అంతే
హహహహ..
ఆ నాటి ఆ స్నేహమానందగీతం
ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం
ఆ రోజులు మున్ముందిక రావేమిరా
చరణం 2 :
మనసే ఇచ్చినాను...
మరణం తెచ్చినాను
చితిలో చూసినాను...
చిచ్చైమండినాను
నా గుండె మంటింక...
ఆరేదికాదు
నేనుండి తనువెళ్ళి...
బ్రతుకింకలేదు
తన శాపమే నాకు...
తగిలిందిరా రేయ్
పసిపాపలే లేని...
ఇల్లాయెరా
ఈ కన్నుల కన్నీటికి...
తుదియేదిరా
ఒరెయ్ ఒరెయ్ ఏమిట్రా
పసిపిల్లాడిలా
ఛి ఛీ.. ఊర్కో
ఈ కన్నీళ్ళకు తుదియెక్కడరా
కర్చీఫ్‌తో తుడిచెయ్యడమేరా
హహ హహాహ..
ఆ నాటి ఆ స్నేహమానందగీతం
ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం
హహ రియల్లీ దోజ్ డేస్
ఆర్ మార్వలస్
కరెక్ట్ రా హహహాహహ
లాలాలలాలా లాలాలలాలా
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి