RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

14, ఫిబ్రవరి 2026, శనివారం

సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ | Sada Shiva Sanyasi | Song Lyrics | Khaleja (2011)

సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ


చిత్రం: ఖలేజా (2011)

సంగీతం: మణిశర్మ

గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి

నేపధ్య గానం: కారుణ్య, రమేష్  


సాకి :


ఓం నమో శివ రుద్రాయ

ఓం నమో శితి కంఠాయ

ఓం నమో హర నాగాభరణాయ 

ప్రణవాయ

ఢమ ఢమ ఢమరుక నాదానందాయ

ఓం నమో నిటాలాక్షయా

ఓం నమో భస్మాఙ్గాయ

ఓం నమో హిమశైలావరణాయ 

ప్రమాదాయ

ధిమి ధిమి తాండవకేళి లోలాయ


పల్లవి :


సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ

నీ పాదముద్రలు మోసీ

పొంగిపోయినాదే పల్లె కాసీ


చరణం 1 :


హే సూపుల సుక్క నీ దారిగా

సుక్కల తివాసీ నీదిగా

సుడాసక్కని సామి దిగినాడు రా

ఎసెయ్యిరా ఊరూవాడా దండోరా


హే రంగుల హంగుల పొడ లేదు రా

ఈడు జంగమ శంకర శివుడేనురా

నిప్పు గొంతున నీలపు మచ్చ సాక్షిగా

నీ తాపం శాపం తీర్చే వాడే రా


పై పైకలా భైరాగిలా

ఉంటాది రా ఆ లీలా

లోకాల నెలే టోడు నీకు

సాయం కాక పోడూ

హే నీలోనే కొలువున్నోడు

నిన్ను దాటి పోనే పోడూ


ఓం నమఃశివా జై జై జై

ఓం నమఃశివా జై జై జై

ఓం నమఃశివా గో టూ ది ట్రాన్స్

అండ్ సే జై జై జై

సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ

శంభో అల్ ది వే

ఓం నమఃశివా జై జై జై

హీల్ ది వరల్డ్ ఇస్ అల్ వీ ప్రే

సేవ్ ఔర్ లీవ్స్ అండ్ టేక్

ఔర్ పెయిన్ అవే జై జై జై

సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ

శంభో అల్ ది వే


సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ

నీ పాదముద్రలు మోసీ

పొంగిపోయినాదే పల్లె కాసీ


చరణం 2 :


హే ఎక్కడ వీడుంటే నిండుగా

అక్కడ నెలంతా పండగా

చుట్టూ పక్కల చీకటి పెల్లగించగా

అడుగేసాడంటా కాచే దొరలాగా

మంచుని మంటని ఒక తీరుగా

లెక్క సేయ్యనే సేయ్యని 

శంకరయ్యగా

ఉక్కు కంచెగా ఊపిరి నిలిపాడురా

మనకండా దండా వీడే నికరంగా


సామికి అంటే హామీ తానై

ఉంటాడురా చివరంటా

లోకాలనేలే తోడూ నీకు

సాయం కాక పోడూ

హే నీలోనే కొలువున్నోడు

నిన్ను దాటి పోనే పోడూ


ఓం నమఃశివా జై జై జై

ఓం నమఃశివా జై జై జై

ఓం నమఃశివా గో టూ ది ట్రాన్స్

అండ్ సే జై జై జై

సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ

శంభో అల్ ది వే

ఓం నమఃశివా జై జై జై

హీల్ ది వరల్డ్ ఇస్ అల్ వీ ప్రే

సేవ్ ఔర్ లీవ్స్ అండ్ టేక్

ఔర్ పెయిన్ అవే జై జై జై

సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ

శంభో అల్ ది వే


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నమో నమః శివాయ | Namo Namah Shivaya | Song Lyrics | Tandel (2025)

నమో నమః శివాయ   చిత్రం : తండేల్ (2025 ) రచన :  జొన్నవిత్తుల  సంగీతం : దేవి శ్రీ ప్రసాద్   గానం :  అనురాగ్ కులకర్ణి, హరిప్రియ  పల్లవి :  నమో ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు