చిలిపికనుల తీయని చెలికాడా
చిత్రం: కులగోత్రాలు (1962)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: సి.నారాయణరెడ్డి
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ఓ . . ఆ ఆ ఆ . . ఓ . .
చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా..
నిలుపుకొందురా వెల్గులమేడ
నీలికురుల వన్నెల జవరాలా
నీ కౌగిట నిలుపుకొందునే
పూల ఉయ్యాల
చరణం 1:
కనులముందు అలలు
పొంగెనూ .. ఓ . . .
మనసులోన కలలు
పండెనూ . .
కనులముందు అలలు
పొంగెనూ .. ఓ . . .
మనసులోన కలలు
పండెనూ . .
అలలే కలలై ..
కలలే అలలై
అలలే కలలై ..
కలలే అలలై
గిలిగింతలు
సలుపసాగెనూ ఊ ఊ ఊ . . .
చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా
వెల్గులమేడ
చరణం 2:
కొండలు కోయని
పిలిచినవీ ..ఆ ఆ ఆ . . .
గుండెలు హోయని
పలికినవీ ..ఆ ఆ ఆ . . .
కొండలు కోయని
పిలిచినవీ ..ఆ ఆ ఆ . . .
గుండెలు హోయని
పలికినవీ ..ఆ ఆ ఆ . . .
కోరికలన్నీ బారులుతీరీ
కోరికలన్నీ బారులుతీరీ
గువ్వలుగా ఎగురుతున్నవీ
ఈ ఈ ఈ. . .
నీలికురుల వన్నెల జవరాలా
నీ కౌగిట నిలుపుకొందునే
పూల ఉయ్యాల
చరణం 3:
జగము మరచి
ఆడుకొందమా.. ఆ ఆ ఆ . . .
ప్రణయగీతి
పాడుకొందమా ఆ ఆ ఆ . . .
జగము మరచి
ఆడుకొందమా.. ఆ ఆ ఆ . . .
ప్రణయగీతి
పాడుకొందమా ఆ ఆ ఆ . . .
నింగీ నేలా కలిసిన చోటా
నింగీ నేలా కలిసిన చోటా
నీవు నేను చేరుకొందమా
ఆ ఆ ఆ . . .
చిలిపికనుల తీయని చెలికాడా
నీ నీడను నిలుపుకొందురా
వెల్గులమేడ
ఓ ఓ ఓ . . .
ఓ ఓ ఓ . . .
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి