జింజింతరారే జింజింతారారే
చిత్రం : అనుబంధం (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, బాలు
పల్లవి :
జింజింతరారే... జింజింతారారే
చలిగాలీ సాయంత్రం...
చెలరేగే సంగీతం
పొద్దువాలె వేళాయే...
ముద్దుగుమ్మ రావే
ఇద్దరున్న కౌగిట్లో...
ముద్దు తీర్చిపోవే
నీలో చూశా సిగ్గుపడ్డ పరువాలు
నాలో చూడూ దగ్గరైన ప్రాణాలు
జింజింతరారే... జింజింతారారే
చలిగాలీ చలగాటం...
చెలరేగే ఉబలాటం
సందెపొద్దు వేళాయే...
చందమామ రావే
చీకటైన పొదరింట్లో...
దీపమెట్టిపోవే
నన్నే తాకే అగ్గిపూలబాణాలు
నాకే సోకే కొంటేచూపు కోణాలూ
చరణం 1 :
పూల వానల్లో నవ్వుల నావల్లే
నావంక వస్తుంటే...
నాజూకు చూస్తుంటే
వెచ్చని వెలుగుల్లో...
నచ్చిన వయసల్లే
వాటేసుకొంటుంటే...
వైనాలు చూస్తుంటే
సూరీడేమో కొండలు దాటే...
నా యీడేమో పొంగులు దాటే
నీ ముద్దు తాంబూలమిచ్చుకో...
ఎర్రంగ వలపే పండించుకో
తూనీగల్లే తూలిపోయే నడుమివ్వు...
నిన్నేచేరే నిన్నలేని నడకివ్వు
జింజింతరారే...జింజింతారారే
చరణం 2 :
కొండ కోనల్లో... ఎండ వానల్లో
మురిపాల పందిట్లో...
ముద్దాడుకొంటుంటే
వేసవి చూపుల్తో...
రాసిన జాబుల్తో
అందాల పందిట్లో...
నిన్నల్లుకొంటుంటే
అల్లరికళ్ళు ఆరాతీసే...
దూరాలన్ని చేరువ చేసే
ఒడి చేరి పరువాలు పంచుకో...
బిడియాల గడపింక దాటుకో
నింగి నేలా తోంగి చూసే సాక్షాలూ
నీకూ నాకూ పెళ్ళిచేసే చుట్టాలు
జింజింతరారే... జింజింతారారే
చలిగాలీ చలగాటం...
చెలరేగే ఉబలాటం
పొద్దువాలె వేళాయే...
ముద్దుగుమ్మ రావే
సందెపొద్దువేళాయే...
చందమామ రావే
నీలో చూశా సిగ్గుపడ్డ పరువాలు
నన్నే తాకే అగ్గిపుల్లబాణాలు
జింజింతరారే...జింజింతారారే
- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి