RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
devi songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
devi songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జూన్ 2026, సోమవారం

కొబ్బరి నీళ్ళ జలకాలాడి | Kobbarineella Jalakaladi | Song Lyrics | Rendujella Seetha (1983)

కొబ్బరి నీళ్ళ జలకాలాడి 


చిత్రం : రెండు జెళ్ళ సీత (1983)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్ పి బాలు, ఎస్ జానకి 


పల్లవి :


కొబ్బరి నీళ్ళ జలకాలాడి.. 

ఊఁహూఁ..ఊఁహూఁ..ఊఁహూఁ..

కోనసీమ కోక గట్టి.. ఆహా..ఆహా..ఆహా..

పొద్దుటెండ తిలకాలెట్టి.. 

ముద్ద పసుపు సందెల కొస్తావా

ముద్దు తీర్చే సందిటి కొస్తావా..ఆ.. 

ముద్దు తీర్చే సందిటి కొస్తావా


కొబ్బరి నీళ్ళ జలకాలాడి.. 

ఊఁహూఁ..ఊఁహూఁ..ఊఁహూఁ..

కోనసీమ కోక గట్టి.. 

ఊఁహూఁ..ఊఁహూఁ..ఊఁహూఁ..

పొద్దుటెండ తిలకాలెట్టి.. 

ముద్ద పసుపు సందెల కొస్తాలే

ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే..ఏ.. 

ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే 


చరణం 1 :


ఆకాశ వీణల్లో నేను..ఊ.. 

అనురాగమే పాడుకుంటా

గొంగూర పచ్చట్లో నేను.. 

ఉల్లిపాయే నంజుకుంటా.. స్స్.. 

నీరుల్లిపాయే నంజుకుంటా


ఆకాశ వీణల్లో నేను... 

అనురాగమే పాడు కుంటా

శృంగార వీధుల్లో నేను.. 

రసనాట్యమే ఆడుకుంటా.. 

ప్రేమ రసనాట్యమే ఆడుకుంటా


మాటివ్వు నాకు మనసిచ్చుకుంటా..

వదిలేస్తే వంకాయ వండించుకుంటా..


Ah.. I am sorry..


వంకాయ వంటి కూరయు 

పంకజముఖి సీత వంటి భార్యామణి

అన్నారు కదండి.. 

అందుకే అలా పాడాననమాట..


కొబ్బరి నీళ్ళ జలకాలాడి.. 

ఊఁహూఁ..ఊఁహూఁ..ఊఁహూఁ..

కోనసీమ కోక గట్టి.. 

ఊఁహూఁ..ఊఁహూఁ..ఊఁహూఁ..

పొద్దుటెండ తిలకాలెట్టి.. 

ముద్ద పసుపు సందెల కొస్తావా

ముద్దు తీర్చే సందిటి కొస్తావా..ఆ..

ముద్దు తీర్చే సందిలి ఇస్తాలే..ఏ..ఏ.. 


చరణం 2 : 


అమ్మవారి ఎదుట నేనూ..ఊ.. 

నీ కుంకుమే దిద్దుకుంటా.. 

నీ కోసమే కాచుకుంటా


అమ్మతో చెప్పి నేనూ..ఊ.. 

అప్పచ్చులే తెచ్చుకుంటా..


అమ్మవారి ఎదుట నేనూ..ఊ.. 

నీ కుంకుమే దిద్దుకుంటా.. 

నీ కోసమే కాచుకుంటా


అసుర సంధ్యవేళ నేనూ..ఊ.. 

ఆలయంలో వేచి వుంటా.. 

నీ హారతే అందుకుంటా


మాగాయలోన పెరుగేసుకుంటా..

వదిలెస్తే నా దారి నే చూసుకుంటా..

హ్మ్.. చూడండి..


మాగాయ మహాపచ్చడి.. 

పెరుగేస్తే మహత్తరి.. 

అది వేస్తే అడ్డ విస్తరి

మానిన్యా మహాసుందరి.. 

అన్నారు కదండి.. 

అందుకే అలా పాడాననమాట..

హహహ..


- పాటల ధనుస్సు 


4, ఆగస్టు 2025, సోమవారం

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి | శ్రీ మహాలక్ష్మి స్తుతి గీతం | Sakala Shubadayani | Song Lyrics | RKSS Creations

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి 



శ్రీ మహాలక్ష్మి స్తుతి గీతం


రచన : రామకృష్ణ దువ్వు

 

పల్లవి:

 

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి

పద్మాసని చిద్విలాసిని కల్పవల్లి మాత

మా ఇంట వెలసిన సౌభాగ్య ప్రదాయిని

నిత్య పూజలంది ప్రీతినొంది కొలువుదీరి

కోరకయేకూర్చు అష్ట ఐశ్వర్యాలు తల్లీ …

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …

 

చరణం 1:

 

అమ్మల గన్న యమ్మ మాయమ్మ శ్రీ లక్ష్మీ

భక్తుల పాలిటి కల్పతరువు నీవమ్మ

ధనధాన్య వృద్ధి సిరిసంపదల తల్లి

మహా విష్ణు వక్ష స్థలిని విడువలేకున్న

అయ్యతోనే మాయింట కొలువుతీరమ్మా

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …

 

చరణం 2:

 

క్షీరసాగర పుత్రి గజవాహిని ఇందిరా

కమలనేత్రి చంద్ర సహోదరి వైష్ణవీ

పశుపు కుంకుమల సౌభాగ్య ప్రదాయనీ

కొనచూపుతోనే కనకంబు కురిపించు

వైకుంఠ వాసిని కారుణ్య స్వరూపిణి

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …


- RKSS Creations...

22, సెప్టెంబర్ 2024, ఆదివారం

జననీ శివకామిని | Janani Shiva Kamini | Song Lyrics | Narthanasala (1963)

జననీ శివకామిని



చిత్రం: నర్తనశాల (1963) 

సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి 

గీతరచయిత: సముద్రాల (జూనియర్) 

నేపథ్య గానం: సుశీల 


పల్లవి: 


అమ్మా... అమ్మా.. 

జననీ శివకామిని... 

జయ శుభకారిని విజయ రూపిని 

జననీ శివకామిని 

జయ శుభకారిని విజయ రూపిని 

జననీ శివకామిని... 


చరణం 1: 


అమ్మవు నీవే అఖిల జగాలకు... 

అమ్మల గన్నా అమ్మవు నీవే 

అమ్మవు నీవే అఖిల జగాలకు... 

అమ్మల గన్నా అమ్మవు నీవే 


నీ చరణములే నమ్మితినమ్మ... 

నీ చరణములే నమ్మితినమ్మ... 

శరణము కోరితి అమ్మ భవాని..ఈ..ఈ


జననీ శివకామిని 

జయ శుభకారిని విజయ రూపిని 

జననీ శివకామిని... 


చరణం 2: 


నీదరినున్న తొలగు భయాలు... 

నీ దయలున్న కలుగు జయాలు 

నీదరినున్న తొలగు భయాలు... 

నీ దయలున్న కలుగు జయాలు 


నిరతము మాకు నీడగ నిలచీ... 

నిరతము మాకు నీడగ నిలచీ 

జయమునీయవే అమ్మా... 

జయమునీయవే అమ్మ భవాని..ఈ..ఈ...


జననీ శివకామిని 

జయ శుభకారిని విజయ రూపిని 

జననీ శివకామిని...


- పాటల ధనుస్సు 

3, అక్టోబర్ 2023, మంగళవారం

శ్రీ గౌరి శ్రీ గౌరియే | Sri Gowri Sri Gowriye | Song Lyrics | Vichitra Dampatyam (1971)

శ్రీ గౌరి శ్రీ గౌరియే



చిత్రం :  విచిత్ర దాంపత్యం (1971)

సంగీతం :  అశ్వద్ధామ 

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  పి సుశీల 


పల్లవి :

శ్రీ గౌరి శ్రీ గౌరియే

శివుని శిరమందు

ఏ గంగ చిందులు వేసినా 


శ్రీ గౌరి శ్రీ గౌరియే

శివుని శిరమందు

ఏ గంగ చిందులు వేసినా

శ్రీ గౌరి శ్రీ గౌరియే


చరణం 1 :

సతిగా తనమేను చాలించి

పార్వతిగా మరుజన్మ ధరియించి

సతిగా తనమేను చాలించి

పార్వతిగా మరుజన్మ ధరియించి


పరమేశునికై తపియించి


పరమేశునికై తపియించి

ఆ హరు మేను సగమై పరవశించిన


శ్రీ గౌరి శ్రీ గౌరియే 


చరణం 2:

నగకన్యగా తాను జనియించినా

జగదంబయైనది హైమవతి

నగకన్యగా తాను జనియించినా

జగదంబయైనది హైమవతి



సురలోకమున తాను ప్రభవించినా

తరళాత్మయైనది మందాకిని


ఒదిగి ఒదిగి పతి పదములందు

నివసించి యుండు గౌరి

ఎగిరి ఎగిరి పతి సిగను దూకి

నటియించుచుండు గంగ

లలితరాగ కలితాంతరంగ గౌరి

చలిత జీవన తరంగ రంగ గంగ

ధవళాంశు కీర్తి గౌరి

నవఫేనమూర్తి గంగ

కల్పాంతమైన

భువనాంతమైన

క్షతి యెరుగని

మృతి యెరుగని నిజమిది

   

శ్రీ గౌరి శ్రీ గౌరియే 

 శివుని శిరమందు

ఏ గంగ చిందులు వేసినా

శ్రీ గౌరి శ్రీ గౌరియే


పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు