RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
aswadhama songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
aswadhama songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, అక్టోబర్ 2023, మంగళవారం

శ్రీ గౌరి శ్రీ గౌరియే | Sri Gowri Sri Gowriye | Song Lyrics | Vichitra Dampatyam (1971)

శ్రీ గౌరి శ్రీ గౌరియే



చిత్రం :  విచిత్ర దాంపత్యం (1971)

సంగీతం :  అశ్వద్ధామ 

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  పి సుశీల 


పల్లవి :

శ్రీ గౌరి శ్రీ గౌరియే

శివుని శిరమందు

ఏ గంగ చిందులు వేసినా 


శ్రీ గౌరి శ్రీ గౌరియే

శివుని శిరమందు

ఏ గంగ చిందులు వేసినా

శ్రీ గౌరి శ్రీ గౌరియే


చరణం 1 :

సతిగా తనమేను చాలించి

పార్వతిగా మరుజన్మ ధరియించి

సతిగా తనమేను చాలించి

పార్వతిగా మరుజన్మ ధరియించి


పరమేశునికై తపియించి


పరమేశునికై తపియించి

ఆ హరు మేను సగమై పరవశించిన


శ్రీ గౌరి శ్రీ గౌరియే 


చరణం 2:

నగకన్యగా తాను జనియించినా

జగదంబయైనది హైమవతి

నగకన్యగా తాను జనియించినా

జగదంబయైనది హైమవతి



సురలోకమున తాను ప్రభవించినా

తరళాత్మయైనది మందాకిని


ఒదిగి ఒదిగి పతి పదములందు

నివసించి యుండు గౌరి

ఎగిరి ఎగిరి పతి సిగను దూకి

నటియించుచుండు గంగ

లలితరాగ కలితాంతరంగ గౌరి

చలిత జీవన తరంగ రంగ గంగ

ధవళాంశు కీర్తి గౌరి

నవఫేనమూర్తి గంగ

కల్పాంతమైన

భువనాంతమైన

క్షతి యెరుగని

మృతి యెరుగని నిజమిది

   

శ్రీ గౌరి శ్రీ గౌరియే 

 శివుని శిరమందు

ఏ గంగ చిందులు వేసినా

శ్రీ గౌరి శ్రీ గౌరియే


పాటల ధనుస్సు 

26, ఏప్రిల్ 2023, బుధవారం

తెల్లారేదాకా నువ్వు | Tellaredaka Nuvvu | Song Lyrics | Prema Pakshulu (1973)

 తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే




చిత్రం : ప్రేమపక్షులు (1973)
రచన : ఉషఃశ్రీ
సంగీతం : అశ్వత్థామ
గానం : కె.జె.ఏసుదాస్



పల్లవి :

తెల్లారేదాకా నువ్వు 
తలుపు మూసి తొంగుంటే
తెల్లారేదాకా నువ్వు 
తలుపు మూసి తొంగుంటే
తగువెట్టా తీరేదీ 
తలుపు తీయవే భామా
తెల్లారేదాకా నువ్వు...

చరణం : 1

రేయంతా సల్లో ఒణికి 
రెప్పేయకుండా గడిపి
రేయంతా సల్లో ఒణికి 
రెప్పేయకుండా గడిపి
ఒళ్లంతా బరువైనాది 
కళ్లేమో ఎరుపైనాయి 
ఒళ్లంతా బరువైనాది 
కళ్లేమో ఎరుపైనాయి 

చరణం : 2

సంగతంతా తెలిసిందంటే
సుట్టుపక్కలా నవ్వుతారు 
సంగతంతా తెలిసిందంటే
సుట్టుపక్కలా నవ్వుతారు 
సంకురేతిరి సల్లో కూడ 
బింకమేటని అంటారు
బింకమేటని అంటారు


చరణం : 3

ఒద్దికగా నా ఒళ్లో ఒదిగి
ముద్దుముద్దుగా నను మురిపిస్తే
నీతోటే ఉంటాను నీ మాటే ఇంటాను 
నీతోటే ఉంటాను నీ మాటే ఇంటాను 

పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు