RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
vinayaka chavithi songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
vinayaka chavithi songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

తిరు తిరు గణనాధ | Tiru Tiru Gananadha | Song Lyrics | 100% Love (2011)

తిరు తిరు గణనాధ  


చిత్రం: 100% లవ్ (2011)

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

గానం: హరిణి


పల్లవి:


తిరు తిరు గణనాధ ది ది ది తై

తిరు తిరు గణనాధ ది ది ది తై

ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై

తిరు తిరు గణనాద ది ది ది తై

నీ వెలుగు పంచు మా తెలివి లోన కొలువై...

తిరు తిరు గణనాధ ది ది ది తై

తిరు తిరు గణనాధ ది ది ది తై


ససని సగస సగమ

మమగ మపమ మపని

పప మపనిస సని సగస 

నిసని పనిస మపమ గమగస

ససని సగస సగమ

మమగ మపమ మపని

పప మపనిస సని ఆ ఆ ఆ 


చరణం: 1


చెవులారా వింటూనే 

ఎంత పాటమైనా

ఈజీగ తలకెక్కే ఐక్యూ నివ్వు

కనులారా చదివింది 

ఒకసారే అయినా

కళ్ళోను మరిచిపోని 

మెమరీనివ్వు

చదివిన ప్రశ్నలనే 

పరీక్షలో రానివ్వు

చదవనిదేదైనా 

చాయిస్ లో పోనివ్వు

ఒక్కొక్క దండానికి 

ఒక్కొ మార్కు పడనివ్వు

ఏ టెంషన్ దరికి రాని 

ఏకాగ్రత నాకివ్వు

ఆన్సర్ షీట్ పైన 

ఆగిపోని పెన్నివ్వు


తిరు తిరు గణనాధ ది ది ది తై

ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై

తిరు తిరు గణనాధ ది ది ది తై

తిరు తిరు గణనాధ ది ది ది తై 


చరణం: 2


తల స్నానం చెయ్యకుండ 

పూజించానంటూ

నా వైపు కోపంగా చూస్తే ఒట్టు

షాంపుతో పాటే చదివింది 

తుర్రు మంటూ

వాష్ అయిపోతుందని 

నా సెంటిమెంటు

తలలే మార్చిన తండ్రి గారి 

కొడుకు మీరు

మీరు తలుచుకుంటే 

మా తలరాతలు తారు మారు

భారతం రాసిన చేతితో 

బతుకును దిద్దేయి బంగారు

పేపర్లో ఫోటోలు 

ర్యాంకులెవ్వరడిగారు

పాసు మార్కులిచ్చి 

నిలబెట్టుకో నీ పేరు


తిరు తిరు గణనాధ ది ది ది తై

ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై

తిరు తిరు గణనాధ ది ది ది తై

తిరు తిరు తిరు తిరు 

తిరు తిరు గణనాధ ది ది ది తై...


- పాటల ధనుస్సు


26, నవంబర్ 2024, మంగళవారం

జయ జయ వినాయకా | Jaya Jaya Vinayaka | Song Lyrics | Omkaram | RKSS Creations

జయ జయ వినాయకా



రచన : రామకృష్ణ దువ్వు  


సాకి:


అనింద్య వాహనా అపర్ణ తనయా

కుడుములు గైకొని వరముల నొసగే

ఆనంద రూపా కైలాస నిలయా

ఆటంకాలను ఆవిరి చేసే గణపతి దేవా


పల్లవి:


జయ జయ వినాయకా

జయ గణ నాయకా..

విజయాలను మాకు చేరువ చేసే

మంగళ మూర్తి వినాయకా…

జయ జయ వినాయకా

 

చరణం 1:


కైలాసమీడి ప్రతి ఏడాదీ

ఆకాశ వీధిని మాకోసమొచ్చేవు

ఊరూరనిలచి మా పూజలు

గైకొని వరముల నిచ్చేవు

కుడుములతోనే సంతసించి

ఎనలేని మా కోర్కెలు తీర్చేవు

నువు నీట మునిగి నీతోనే

మా కష్టాలు నీట ముంచేవు

నీరాక కోసం మరు ఏడాది

మేము ఎదురు చూచేము


జయ జయ వినాయకా

జయ గణ నాయకా..

విజయాలను మాకు చేరువ చేసే

మంగళ మూర్తి వినాయకా…

జయ జయ వినాయకా


చరణం 2:


శ్రీ లక్ష్మీ గణపతిగ పూజలందుకొని

ప్రతినింటా సిరుల సంపదలిచ్చేవు

విద్యా గణపతివై వాడల వీధుల

మము బ్రోచి మాకెంతో జ్ఞానమిచ్చేవు

మూషిక వాహనుడై ఊరేగు వేళ

వాహన భాగ్యము అనుగ్రహించేవు

మహా గణపతిగా తోడుగ నిలచి

ఇంటింటి పెద్దవై జయములు కూర్చేవు


జయ జయ వినాయకా

జయ గణ నాయకా..

విజయాలను మాకు చేరువ చేసే

మంగళ మూర్తి వినాయకా…

జయ జయ వినాయకా 


- RKSS Creations...




12, సెప్టెంబర్ 2023, మంగళవారం

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా | Dandalayya Undralayya | Song Lyrics | Coolie No 1 (1991)

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా



చిత్రం: కూలీ No.1(1991)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రీ 

నేపధ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం 


పల్లవి:


జై జై జై జై గణేశ జై జై జై జై

జై జై జై జై వినాయక జై జై జై జై

జై జై జై జై గణేశ జై జై జై జై

జై జై జై జై వినాయక జై జై జై జై



దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ

పిండి వంటలారగించి 

తొండమెత్తి దీవించయ్యా

తండ్రి వలే ఆదరించి 

తోడు నీడ అందించయ్యా ఓ..


దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ...


చరణం 1:


చిన్నారి ఈ చిట్టెలుకెలా 

భరించెరా లంబోదరా

పాపం కొండంత నీ పెనుభారం

ముచ్చెమటలు కక్కిందిరా 

ముజ్జగములు తిప్పిందిరా

ఓ.. హో హో జన్మ ధన్యం


చిన్నారి ఈ చిట్టెలుకెలా 

భరించెరా లంబోదరా

పాపం కొండంత నీ పెనుభారం

ముచ్చెమటలు కక్కిందిరా 

ముజ్జగములు తిప్పిందిరా

ఓ.. హో హో జన్మ ధన్యం


అంబారిగా ఉండగల ఇంతటి వరం.. 

అయ్యోర అయ్య

అంబాసుతా ఎందరికి లబించురా.. 

అయ్యోర అయ్య

ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా


దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ


చరణం 2:


శివుని శిరసు సింహాసనం పొందిన 

చంద్రుని గోరోజనం

నిన్నే చేసింది వేళాకోళం

ఎక్కిన మదం దిగిందిగా 

తగిన ఫలం దక్కిందిగా

ఏమైపోయింది గర్వం


అరె శివుని శిరసు సింహాసనం 

పొందిన చంద్రుని గోరోజనం

నిన్నే చేసింది వేళాకోళం

ఎక్కిన మదం దిగిందిగా 

తగిన ఫలం దక్కిందిగా

ఏమైపోయింది గర్వం


త్రిమూర్తులే నిను గని తలొంచరా.. 

అయ్యోర అయ్య

నిరంతరం మహిమను కీర్తించరా.. 

అయ్యోర అయ్యా

నువ్వెంత అనే అహం 

నువ్వే దండించరా


దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ

అరె రె రె.. పిండి వంటలారగించి 

తొండమెత్తి దీవించయ్యా

తండ్రి వలే ఆదరించి తోడు నీడ 

అందించయ్యా ఓ..


హే దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ


పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు