RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
coolie no 1 movie లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
coolie no 1 movie లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, అక్టోబర్ 2023, ఆదివారం

అటెంషన్ ఎవెరిబడీ | Attention Everybody | Song Lyrics | Coolie No 1 (1991)

అటెంషన్ ఎవెరిబడీ 



చిత్రం: కూలీ No.1(1991)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి 

నేపధ్య గానం: బాలు


ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ 

నేనే మహారాజు

నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి 

నాదే ప్రతి రోజు

అదృష్టం బాడీగార్డు అన్నింటా నేనే ఫస్ట్

కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు


ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ 

నేనే మహారాజుహ హ

నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి 

నాదే ప్రతి రోజు


హోలీడేకి జోలిగా హాలీవుడ్డేళ్లానంటే

హాల్లో బాసు హౌ డు యు డు అంటూ

డైలీ ఎంతో మంది హీరో రోల్ ఇస్తామంటూ 

ప్రాణం తింటూ ఉంటారు

సారి రా డైరీ కాళిలేదంటే వింటారా హ హ హ


ఐ యామ్ ఏ బాటసారి మేఘాల రహదారి

ఉండుండి నేల జారి హాల్టేస్తా ఒక్కసారి

ఫోలెండ్లో పొద్దున్నుండి హాలెండులోన ఆఫ్టర్ నూన్

సిడ్నీ లో సాయంకాలం వాషింగ్టన్లో నైటుంటాను

ఎపుడు నివాసం ఏరో ప్లైన్ ఎక్కడా స్టడిగా కూర్చోలేను

సూరీడల్లే భూగోళాన్ని చుట్టేస్తూనే ఉంటా ఎవ్రిడే


ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ 

నేనే మహారాజు హ హ

నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి 

నాదే ప్రతి రోజు

అదృష్టం బాడీగార్డు అన్నింటా నేనే ఫస్ట్

కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు 

హ హ హహ


ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ 

నేనే మహారాజు

నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి 

నాదే ప్రతి రోజు


నేనేడుంటే ఆడే చుట్టూ ఆడోళ్లంతా అల్లేస్తారు

హాల్లో డార్లింగ్ అంటూ నాతో డేటింగ్ ఔటింగ్

మీటింగ్ మేటింగ్ ఏదైనా ఓకే అంటారు

పెళ్ళాడందే పోదీమేళం ఇల్లా అయితే పోదా శీలం


ఐ యామ్ ఎ బ్రహ్మచారి పట్టాను పెళ్లిదారి

కావాలి తగనారి నువ్వేనా ఆ చిన్నారి

నచ్చాలి కన్ను ముక్కు నిక్కు టెక్కు ఉన్న బాడీ

నచ్చాలి నాలో ఉన్న వాడి వేడి కన్నెలేడి

మగువా మగాడ అనిపించాలి పొగరు 

వగైరా కనిపించాలి

ఓకే అయితే చేపడతాను చూపెడతాను 

జతలో హనీమూను


ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ 

నేనే మహారాజు

నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి 

నాదే ప్రతి రోజు

అదృష్టం బాడీగార్డు అన్నింటా నేనే ఫస్ట్

కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు


ఆటెన్షన్ ఎవ్రిబడి నేనొస్తున్నా బీ రెడీ 

నేనే మహారాజు

నా చుట్టు క్యూ కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి 

నాదే ప్రతి రోజు


పాటల ధనుస్సు 


6, అక్టోబర్ 2023, శుక్రవారం

కిల కిలమని కళావరు రాణి | Kilakila mani kalavaru Rani | Song Lyrics | Coolie No 1 (1991)

కిల కిలమని కళావరు రాణి



చిత్రం: కూలీ No.1(1991)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, చిత్ర


పల్లవి:


కిల కిల మని కళావరు రాణి

ఘల్లు ఘల్లు మని కథాకళి కాని

కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని


ఛల్ మోహనాంగా సుఖాలకు బోణి

చలి గిలి అన్ని పొలోమని పోని

సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని


మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్ని

మగ జత పాడే బాణి మగువకు రేవై రాణి


కిల కిల మని కళావరు రాణి

ఘల్లు ఘల్లు మని కథాకళి కాని

కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని


చరణం 1:


బరువుగా.. విరివిగా.. 

ఆపె చూపు కథ ఏపుగా.. గోపిక

చొరవగా.. కరువుగా.. 

కాపు వేసె కథ కైపుగా.. కోరిక

వాలే పరువాలే తగువేలే గనుకా

కాలే తమకాలే గమకాలే పలుకా


కాంక్షలో శ్రుతీ గతి పెంచీ

కాల్చదా చుట్టు కట్టే కంచే.. ఈ మైకం

ఈడులో అతి గతి లేని

వేడికో దిక్కు మొక్కు పంచి.. ఈ రాగం

ఆదమరిచిన ఈడులో ఈతలాడని


ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి

చలి గిలి అన్ని పొలోమని పోని

సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని


చరణం 2:


ఒడుపుగా.. ఒలుచుకో.. 

ఓపలేను కదా ఒంటిలో.. అవసరం

చిలిపిగా.. దులుపుకో.. 

మోయలేవు కదా నడుములో.. కలవరం


తాపం తెరతీసి తరిమేసే తరుణం

తాళం తలుపేసి విరబూసే సమయం

వీలుగా గుట్టు మట్టు మీటి విలుగా 

ఇట్టె పుట్టే వేడి ఏడెడో

ఒంటిగ ఉంటే ఒట్టే అంటు వెంటనే 

జట్టే కట్టెయాలి ఏనీడో

జోడు బిగిసిన వేడిలో వేగిపోని


కిల కిల మని కళావరు రాణి

ఘల్లు ఘల్లు మని కథాకళి కాని

కళ్ళెం లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అని


ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి

చలి గిలి అన్ని పొలోమని పోని

సిగ్గేలేని సింగారాని చిందించని చలో హని


మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్ని

మగ జత పాడే బాణి మగువకు రేవై రాణి


కిల కిల మని కళావరు రాణి

ఛల్ మొహనాంగా సుఖాలకు బోణి

కళ్ళెం లేని కళ్ళల్లోని కవ్వింతల్ని హలో అని


పాటల ధనుస్సు 


5, అక్టోబర్ 2023, గురువారం

కలయా నిజమా | Kalaya Nijama | Song Lyrics | Coolie No 1 (1991)

కలయా నిజమా



చిత్రం: కూలీ NO. 1 (1991)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: సుశీల, ఇళయరాజా


పల్లవి:


కలయా... నిజమా... 

తొలిరేయి హాయి మహిమా ..ఆ..ఆ

కలయా... నిజమా... 

తొలిరేయి హాయి మహిమా..ఆ..ఆ

అలవాటు లేని సుఖమా... 

ఇక నిన్ను ఆప తరమా

అణిగున్న ఆడతనమా.. 

ఇకనైన మేలుకొనుమా


కలయా... నిజమా... 

తొలిరేయి హాయి మహిమా..ఆ..ఆ

కలయా... నిజమా...


చరణం 1:


లేనిపోని ఏ కూనిరాగమో 

లేచిరా అంటున్నదీ.. అహా...

ఊరుకోని ఏ వెర్రి కోరికో 

తీర్చవా అంటున్నదీ..ఈ...

కోక ముళ్ళ కూపీ తీసే 

కైపు చూపు కొరుకుతున్నది...

కుర్ర కళ్ళు చీర గళ్ళలో... 

దారే లేక తిరుగుతున్నవి...

ముంచే మైకమో... 

మురిపించే మోహమో....


కలయా... నిజమా... 

తొలిరేయి హాయి మహిమా...ఆ..

కలయా... నిజమా...


చరణం 2:


చేయి వేయనా ..సేవ చేయనా.. 

ఓయ్ అనే వయ్యారమా.. హహ హ..

పాల ముంచినా ..నీట ముంచినా.. 

నీ దయే శృంగారమా... అహా...

ఆగలేని ఆకలేవిటో.. 

పైకి పైకి దూకుతున్నది

కాలు నేల నిలవకున్నది.. 

ఆకాశాన తేలుతున్నది..

హా అంతా మాయగా.. 

అనిపించే కాలమూ...


కలయా... నిజమా... 

తొలిరేయి హాయి మహిమా...

కలయా... నిజమా... 

తొలిరేయి హాయి మహిమా..ఆ..ఆ

అలవాటు లేని సుఖమా... 

ఇక నిన్ను ఆప తరమా

అణిగున్న ఆడతనమా.. 

ఇకనైన మేలుకొనుమా


కలయా...అహ.. నిజమా...అహ.. 

తొలిరేయి హాయి మహిమా..ఆ..ఆ

ఉహు..ఉహు..ఉహు...


పాటల ధనుస్సు 


26, సెప్టెంబర్ 2023, మంగళవారం

కొత్తకొత్తగా ఉన్నది | Kotha Kothaga Vunnadi | Song Lyrics | Coolie No 1 (1991)

కొత్తకొత్తగా ఉన్నది



చిత్రం: కూలి నెం. 1  (1991)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, చిత్ర 


పల్లవి :


కొత్తకొత్తగా ఉన్నది 

స్వర్గమిక్కడే అన్నది

కోటి తారలే పూల ఏరులై

కోటి తారలే 

పూల ఏరులై నేల చేరగానె


కొత్తకొత్తగా ఉన్నది 

స్వర్గమిక్కడే అన్నది...



చరణం 1 :


నా కన్ను ముద్దాడితే 

కన్నె కులుకాయె కనకాంబరం

నా చింత సంపెంగలో 

కెంపు రంగాయె తొలి సంబరం


ఎన్ని పొంగులో కుమారి కొంగులో

ఎన్ని రంగులో సుమాల వాగులో

ఎన్ని పొంగులో కుమారి కొంగులో

ఎన్ని రంగులో సుమాల వాగులో


ఉద్యోగమిప్పించవా 

సోకు ఉద్యాన వనమాలిగా

జీతమీయగా లేత 

వన్నెలే చెల్లించుకోనా


కొత్తకొత్తగా ఉన్నది 

స్వర్గమిక్కడే అన్నది

కోటి తారలే పూల ఏరులై

కోటి తారలే 

పూల ఏరులై నేల చేరగానె

కొత్తకొత్తగా ఉన్నది 

స్వర్గమిక్కడే అన్నది...


చరణం 2 :


నీ నవ్వు ముద్దాడితే 

మల్లెపువ్వాయె నా యవ్వనం

నాజూకు మందారమే 

ముళ్ళ రోజాగ మారే క్షణం


మొగలి పరిమళం మగాడి కౌగిళి

మగువ పరవశం సుఖాల లోగిలి

మొగలి పరిమళం మగాడి కౌగిళి

మగువ పరవశం సుఖాల లోగిలి


కండల్లొ వైశాఖమా 

కైపు ఎండల్లొ కరిగించుమా

తీగమల్లికీ నరాల 

పందిరీ అందించుకోనా


కొత్తకొత్తగా ఉన్నది 

స్వర్గమిక్కడే అన్నది

కోటి తారలే పూల ఏరులై

కోటి తారలే 

పూల ఏరులై నేల చేరగానె


కొత్తకొత్తగా ఉన్నది 

స్వర్గమిక్కడే అన్నది...


పాటల ధనుస్సు 

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా | Dandalayya Undralayya | Song Lyrics | Coolie No 1 (1991)

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా



చిత్రం: కూలీ No.1(1991)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు


పల్లవి:


జై జై జై జై గణేశ జై జై జై జై

జై జై జై జై వినాయక జై జై జై జై

జై జై జై జై గణేశ జై జై జై జై

జై జై జై జై వినాయక జై జై జై జై



దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ

పిండి వంటలారగించి 

తొండమెత్తి దీవించయ్యా

తండ్రి వలే ఆదరించి 

తోడు నీడ అందించయ్యా ఓ..


దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ...


చరణం 1:


చిన్నారి ఈ చిట్టెలుకెలా 

భరించెరా లంబోదరా

పాపం కొండంత నీ పెనుభారం

ముచ్చెమటలు కక్కిందిరా 

ముజ్జగములు తిప్పిందిరా

ఓ.. హో హో జన్మ ధన్యం


చిన్నారి ఈ చిట్టెలుకెలా 

భరించెరా లంబోదరా

పాపం కొండంత నీ పెనుభారం

ముచ్చెమటలు కక్కిందిరా 

ముజ్జగములు తిప్పిందిరా

ఓ.. హో హో జన్మ ధన్యం


అంబారిగా ఉండగల ఇంతటి వరం.. 

అయ్యోర అయ్య

అంబాసుతా ఎందరికి లబించురా.. 

అయ్యోర అయ్య

ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా


దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ


చరణం 2:


శివుని శిరసు సింహాసనం పొందిన 

చంద్రుని గోరోజనం

నిన్నే చేసింది వేళాకోళం

ఎక్కిన మదం దిగిందిగా 

తగిన ఫలం దక్కిందిగా

ఏమైపోయింది గర్వం


అరె శివుని శిరసు సింహాసనం 

పొందిన చంద్రుని గోరోజనం

నిన్నే చేసింది వేళాకోళం

ఎక్కిన మదం దిగిందిగా 

తగిన ఫలం దక్కిందిగా

ఏమైపోయింది గర్వం


త్రిమూర్తులే నిను గని తలొంచరా.. 

అయ్యోర అయ్య

నిరంతరం మహిమను కీర్తించరా.. 

అయ్యోర అయ్యా

నువ్వెంత అనే అహం 

నువ్వే దండించరా


దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ

అరె రె రె.. పిండి వంటలారగించి 

తొండమెత్తి దీవించయ్యా

తండ్రి వలే ఆదరించి తోడు నీడ 

అందించయ్యా ఓ..


హే దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా 

దయుంచయ్యా దేవా

నీ అండాదండా ఉండాలయ్యా 

చూపించయ్యా త్రోవ


పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు