హాయమ్మ హాయమ్మా హాయమ్మ
చిత్రం: పల్నాటి సింహం (1985)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి :
హాయమ్మ.. హాయమ్మా.. హాయమ్మ..
హా... హాయ్
ఒళ్ళంత కేరింత ఏదందమ్మా..
హా... హాయ్
మాట.. ఒక్క మాట
నేను చెప్పాలి నీ కౌగిట
అలలా మంచి కలలా
సాగిపోవాలి ఈ ముచ్చట... హాయ్
కలలకు పలుకులు రావాలట...
కన్నుల పండుగ చెయ్యాలట
హాయమ్మ.. హాయమ్మా.. హాయమ్మ..
హా... హాయ్
ఒళ్ళంత కేరింత ఏదందమ్మా..
హా... హాయ్
చరణం 1 :
సూరీడు రేగేడు చూడు...
సెలయేరు ఈ నాడు తోడు
చెలిమబ్బు మెరిసేను నేడు... నీలా
చిగురాకు ఆడెను చూడు..
చిరుగాలి పాడెను చూడు
చిలకమ్మ కులికేను నేడు... నీలా
చెంత నేను లేనా... చెలిమి పంచుకోనా
ఆ మాట చాలంట.. ఈ జంట నాదంట
హాయమ్మ.. హాయమ్మా.. హాయమ్మ..
హా... హాయ్
ఒళ్ళంత కేరింత ఏదందమ్మా..
హా... హాయ్
మాట.. ఒక్క మాట
నేను చెప్పాలి నీ కౌగిట
అలలా మంచి కలలా
సాగిపోవాలి ఈ ముచ్చట... హాయ్
కలలకు పలుకులు రావాలట...
కన్నుల పండుగ చెయ్యాలట
చరణం 2 :
అద్దాల చెక్కిల పైన..
ముద్దర్లు వేశాను నిన్న
వద్దన్న విన్నావు కాదు కలలో
సరదాగ నా పక్క చేరి...
గురి చూసి గుండెల్లో దూరి
నా పేరు రాశావు నీవు మదిలో
ఒకరికొకరు ప్రాణం... ఒకరు ఒకరి లోకం
ఉండాలి నీ వెంట... పండాలి నా పంట
హాయమ్మ.. హాయమ్మా.. హాయమ్మ..
హాయ్
ఒళ్ళంత కేరింత ఏదందమ్మా..
హాయ్
మాట.. ఒక్క మాట
నేను చెప్పాలి నీ కౌగిట.. హోయ్
అలలా మంచి కలలా
సాగిపోవాలి ఈ ముచ్చట.. హా
కలలకు పలుకులు రావాలట...
కన్నుల పండుగ చెయ్యాలట
హాయమ్మ.. హాయమ్మా.. హాయమ్మ..
హాయ్
ఒళ్ళంత కేరింత ఏదందమ్మా..
హాయ్
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి