తగునా ఇది మామా
చిత్రం : రాముడు-భీముడు (1964)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : కొసరాజు
నేపథ్య గానం : ఘంటసాల, మాధవపెద్ది
పల్లవి :
తగునా ఇది మామా...
తమరే ఇటు బల్క నగున
తగునా ఇది మామా...
నిగమ మార్గములు తెలిసిన
నీవే ఇటులనదగునా...
తగునా ఇది మామా
అల్లుడనగనెవడు...
మీ అమ్మాయికి మగడూ
అల్లుడనగనెవడు...
మీ అమ్మాయికి మగడూ
నీవు కాళ్ళు కడిగి
కన్యాదానము చేసిన ఘనుడు
ఆ ఘనుని మీద అలుక బూన
ఏటికి చీటికి మాటికి
తగునా ఇది మామా...
తమరే ఇటు బల్క నగున
తగునా ఇది మామా
చరణం 1 :
ఫో.. ఫో... ర... ఫొమ్మికన్....
ఫోఫోర ఫొమ్మికన్...
నా గృహమ్మునకు భోజనమ్మునకు
ఇక రా వలదు... రా తగదు...
ఛీ పో ఫో.. ఫో.. ర.. ఫొమ్మికన్
అరెరే ఎంతటి మోసగాడవుర...
నాకే టోపీ వేసినావుర
అరెరే ఎంతటి మోసగాడవుర...
నాకే టోపీ వేసినావుర
నీ సాహసము పరీహాసము...
నీ సాహసము పరీహాసము
నిర్భాగ్యుల తోటి సహవాసము
సహించను క్షమించను...
యోచించను నీ మాటన్
వచ్చిన బాటన్ పట్టుము...
వేగన్ ఫో.. ఫో... ర ఫొమ్మికన్
ఫోఫోర ఫొమ్మికన్
నా గృహమ్మునకు భోజనమ్మునకు
ఇక రా వలదు రా తగదు ఛీ ఫో ఫో
చరణం 2 :
కొడుకులు లేనందుకు
తల కొరివి బెట్టువాడనే...
నీకు కొరివి బెట్టువాడనే
డైరెక్టుగ స్వర్గానికి
చీటి నిచ్చువాడనే
తల్లి లేని పిల్ల ఉసురు
తగలదె ఒంటిగ ఉంచగ
తగునా ఇది మామా...
తమరే ఇటు బల్క నగున
తగునా ఇది మామా...
చరణం 3 :
అరె... ఊరికెల్ల మొనగాడినే
అరె... ఊరికెల్ల మొనగాడినే...
పెద్ద మిల్లు కెల్ల యజమానినే...
నీ డాబూసరి బలే బిత్తరి
నీ డాబూసరి బలే బిత్తరి...
నిజమేనని నమ్మితి పోకిరి
దురాత్ముడా... దుష్టాత్ముడా...
గర్వాత్ముడా... నీచుడా
ఇపుడె తెలిసెన్ నీ కథ ఎల్లన్...
ఫో...ఫో... ర ఫొమ్మికన్
ఫోఫోర ఫొమ్మికన్
నా గృహమ్మునకు భోజనమ్మునకు
ఇక రా వలదు రా తగదు చీ ఫో ఫో
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి