RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
rangoon rowdy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
rangoon rowdy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఏప్రిల్ 2023, శనివారం

అదరహో ఓ అదరహా | Adaraho Adaraha | Song Lyrics | Rangoon Rowdy (1979)

అదరహో..ఓ..అదరహా  



చిత్రం :  రంగూన్ రౌడి (1979)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు,  సుశీల


పల్లవి :


అదరహో..ఓ..అదరహా..అదరహో..ఓ..అదరహా

నీ అందం చూస్తే అదరహా..

నా మురపెం చూస్తే ముదరహా

నా వయసు నీ సొగసు.

.నా వయసు నీ సొగసు కలుసుకుంటే.

యమహా.. యమహా.. యమహా.. యమహా


అదరహో..ఓ..అదరహా..

అదరహో..ఓ..అదరహా

నీ వాటం చూస్తే అదరహా.. 

నా వైనం చూస్తే ముదరహా

నా మనసూ...  నీ వయసూ..

నా మనసూ నీ వయసూ కలుపుకొంటే..ఏ... ఏ

యమహా.. యమహా.. యమహా.. యమహా


అదరహో..ఓ... ఓ..అదరహా

అదరహో..ఓ... ఓ..అదరహా



చరణం 1 :


నీకు తక్కువేమున్నది.. బక్కనడుము ఒక్కటిమినహా

ఆ నడుము లేని నడకలు చూస్తే.. 

పడుచు వాడి మనసు తహ తహ

నీ వయ్యారం దిద్దుకుంది..శృంగారపు ఓ నమ:

వయ్యారం దిద్దుకుంది..శృంగారపు ఓ నమ:

గుట్టు రట్టు చేయమాకు..గురూ నీకు నమో నమః


అదరహా.. ముదరహా..

అదరహా.. ముదరహా..

హయమ్మ హయమ్మ హయమ్మ హాయమ్మ..ఆహా


అదరహో..ఓ... ఓ..అదరహా

అదరహో..ఓ... ఓ..అదరహా

నీ అందం చూస్తే అదరహా..

నా మురపెం చూస్తేముదరహా

నా మనసూ...  నీ వయసూ..

నా మనసూ నీ వయసూ కలుపుకొంటే..ఏఏఏఏ

యమహా.. యమహా.. యమహా.. యమహా


అదరహో..ఓ.. ఓ..అదరహా

అదరహో..ఓ.. ఓ..అదరహా


చరణం 2 :


పిల్ల గాలి తగిలిందంటే..ఏ ..పిల్లగాడి పిచ్చి ముదరహ

పిచ్చికాస్త ముదిరిందంటే..ఏ..పిల్లతో పెళ్ళి కుదరహ

కోరుతున్న కోడెగాడు.. కోహినూరు వరహా

కోరుతున్న కోడెగాడు.. కోహినూరు వరహా

ఒకే జంటగా బతకాలని..సందమామ సలహా


అదరహా..ముదరహా..

అదరహా..ముదరహా..

హయమ్మ హయమ్మ హయమ్మ హాయమ్మ..ఆహా


అదరహో..ఓఓఓఓఓ..అదరహా

అదరహో..ఓఓఓఓఓ..అదరహా

నీ వాటం చూస్తే అదరహా.. 

నా వైనం చూస్తే ముదరహా

నా వయసు...  నీ సొగసు..

నా వయసు నీ సొగసు కలుసుకుంటే..ఏ.. ఏ

యమహా..యమహా..యమహా..యమహా


అదరహో..ఓ.. ఓ..అదరహా

అదరహో..ఓ.. ఓ..అదరహా


పాటల ధనుస్సు  


30, మార్చి 2023, గురువారం

ఓ జాబిలీ వెన్నెల ఆకాశం | O Jabilee Vennela Akasam | Duet Song Lyrics | Rangoon Rowdy (1979)

ఓ జాబిలీ... వెన్నెల ఆకాశం



చిత్రం : రంగూన్ రౌడి (1979)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


ఓ జాబిలీ... వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం

ఎదురు చూసింది నిదుర కాచింది కలువ నీకోసమే

వెలుగువై రావోయి వెలుతురే తేవోయి


ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం

జుమ్  జుమ్ జుమ్.. జుమ్  జుమ్ జుమ్.. 


చరణం 1 :


కదలిపోయే కాలమంతా నిన్ను నన్ను 

నిలిచి చూసే

కలలు కన్న కౌగిలింత వలపు తీపి వలలు వేసే

భ్రమర నాదాలు ఉ ఉ ఉ

భ్రమర నాదాలు.. ప్రేమ గీతాలై పరిమళించేనోయి

పున్నమై రావోయి.. నా పున్నెమే నీవోయి


ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం

జుమ్  జుమ్ జుమ్.. జుమ్  జుమ్ జుమ్.. 

జుమ్  జుమ్ జుమ్



చరణం 2:


నవ్వులన్ని పువ్వులైన నా వసంతం 

నీకు సొంతం

పెదవి దాటి ఎదను మీటే.. 

ప్రేమ బంధం నాకు సొంతం

ఇన్ని రాగాలు.. ఉ ఉ ఉ

ఇన్ని రాగాలు నీకు అందించే రాగమే నేనోయి

అనురాగమే నీవోయి.. అనురాగమే నీవోయి


ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం


పాటల ధనుస్సు  

28, మార్చి 2023, మంగళవారం

ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం | O Jabilee Vennela Akasam | Song Lyrics | Rangoon Rowdy (1979)

ఓ జాబిలీ వెన్నెలా ఆకాశం



చిత్రం : రంగూన్ రౌడి (1979)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :   సుశీల



పల్లవి :


ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం

ఎదురు చూసింది నిదుర కాసింది..  

కలువ నీ కోసమే..


వెలుగువై రావోయి... వెలుతురే తేవోయి

ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం 


ఝుమ్ ఝుమ్ ఝుమ్... ఝుమ్ ఝుమ్ ఝుమ్... 

ఝుమ్ ఝుమ్ ఝుమ్



చరణం 1 :


నువ్వు లేక...  నవ్వ లేక... ఎందరున్నా ఎవరు లేక

జంట గాని...  తోడు లేక...  ఒంటిగా నేనుండలేను ..


స్నేహ దీపాలు...

స్నేహ దీపాలు.... వెలగనీ చాలు

చీకటే లేదోయి

వెలుతురే కావోయి... వెలుతురే తేవోయి..


ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం 

ఝుమ్ ఝుమ్ ఝుమ్... ఝుమ్ ఝుమ్ ఝుమ్... 

ఝుమ్ ఝుమ్ ఝుమ్


చరణం 2 :


గువ్వ లాగా నువ్వు రాగా... గూడు నవ్వే గుండె నవ్వే

వేకువల్లె నీవు రాగా... చీకటంతా చెదిరిపోయే


తుడిచి కన్నీళ్లు....

తుడిచి కన్నీళ్లు... కలసి నూరేళ్ళు

జతగా ఉందామోయి

వెలుగువే నీవోయి .... వెలుతురే కావోయి


ఓ ..జాబిలీ ..వెన్నెలా ఆకాశం ఉన్నదే నీ కోసం 

ఝుమ్ ఝుమ్ ఝుమ్... ఝుమ్ ఝుమ్ ఝుమ్... 

ఝుమ్ ఝుమ్ ఝుమ్


పాటల ధనుస్సు  


4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

వానొచ్చే వరదొచ్చే | Vanoche Varadoche | Song Lyrics | Rangoon Rowdy (1979)

వానొచ్చే వరదొచ్చే



చిత్రం :  రంగూన్ రౌడి (1979)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు,  సుశీల



పల్లవి :


వానొచ్చే వరదొచ్చే..  ఉరకలేక సావొచ్చే

మెరకలెక్క సాలొచ్చె.. సరుకుతోట సాటొచ్చే

అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి

వయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

వయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే


వానొచ్చే వరదొచ్చే..  ఉరకలేక సావొచ్చే

మెరకలెక్క సాలొచ్చె.. సరుకుతోట సాటొచ్చే

అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి

వయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

వయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే



చరణం 1 :


చినుకు మీద చినుకు పడ్దదీ..

చిన్నదాని సొగసు మీద మనసు పడ్డది

వణుకుతున్న వయసు చెడ్దదీ..

చిన్నవాడి వలపు నన్ను కలుపుతున్నది


ఈ పులకరింత చూడబోతే చిటికెంత..

ఆ జలదరింత చూడబోతె జన్మంతా

నాకు నువ్వెంతో.. నీకు నేనంతా..

నీకు వయసెంతో.. నాకు మనసంతా


వరస కలసి జంటలాయనే

ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే

అహ వరస కలసి జంటలాయనే

ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే


వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే

మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే

అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి

వయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

ఆఁవయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే


చరణం 2 :


చినుకు ముల్లు గుచ్చుకున్నదీ...

చిన్నదాని వలపు ఒళ్ళు విరుచుకున్నది

వానజల్లు వెచ్చకున్నదీ...

చిన్నవాడి వయసు తేనె వెల్లువైనది


కురిసి వెలసిన వాన వరదంటా...

మనసు కలసిన జంట వలపంటా

నీకు మెరుపెంతో.. నాకు ఉరుమంతా

వయసు వయసంతా.. వలపు గిలిసెంతా


వరస కలసి జంటలాయెనే

ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే

వరస కలసి జంటలాయెనే

ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే


వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే

మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే

అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి

వయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

అర్రెరెర్రె వయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే


- పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు