RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

వానొచ్చే వరదొచ్చే | Vanoche Varadoche | Song Lyrics | Rangoon Rowdy (1979)

వానొచ్చే వరదొచ్చే



చిత్రం :  రంగూన్ రౌడి (1979)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు,  సుశీల



పల్లవి :


వానొచ్చే వరదొచ్చే..  ఉరకలేక సావొచ్చే

మెరకలెక్క సాలొచ్చె.. సరుకుతోట సాటొచ్చే

అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి

వయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

వయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే


వానొచ్చే వరదొచ్చే..  ఉరకలేక సావొచ్చే

మెరకలెక్క సాలొచ్చె.. సరుకుతోట సాటొచ్చే

అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి

వయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

వయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే



చరణం 1 :


చినుకు మీద చినుకు పడ్దదీ..

చిన్నదాని సొగసు మీద మనసు పడ్డది

వణుకుతున్న వయసు చెడ్దదీ..

చిన్నవాడి వలపు నన్ను కలుపుతున్నది


ఈ పులకరింత చూడబోతే చిటికెంత..

ఆ జలదరింత చూడబోతె జన్మంతా

నాకు నువ్వెంతో.. నీకు నేనంతా..

నీకు వయసెంతో.. నాకు మనసంతా


వరస కలసి జంటలాయనే

ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే

అహ వరస కలసి జంటలాయనే

ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే


వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే

మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే

అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి

వయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

ఆఁవయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే


చరణం 2 :


చినుకు ముల్లు గుచ్చుకున్నదీ...

చిన్నదాని వలపు ఒళ్ళు విరుచుకున్నది

వానజల్లు వెచ్చకున్నదీ...

చిన్నవాడి వయసు తేనె వెల్లువైనది


కురిసి వెలసిన వాన వరదంటా...

మనసు కలసిన జంట వలపంటా

నీకు మెరుపెంతో.. నాకు ఉరుమంతా

వయసు వయసంతా.. వలపు గిలిసెంతా


వరస కలసి జంటలాయెనే

ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే

వరస కలసి జంటలాయెనే

ఓలమ్మమ్మో మనసు తెలిసి మంటరేగెనే


వానొచ్చే వరదొచ్చే ఉరకలేక సావొచ్చే

మెరకలెక్క సాలొచ్చె సరుకుతోట సాటొచ్చే

అటు తిరిగి ఇటు తిరిగి చలి పెరిగి మెలి తిరిగి

వయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే

అర్రెరెర్రె వయసు తడిసి మోపెడాయనే

ఓలమ్మమ్మో వణుకు పుట్టి వాటెడాయనే


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు