ఎన్నెలెంత ఏరాయె
చిత్రం : మహాలక్ష్మి (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి:
ఎన్నెలెంత ఏరాయె.. నిద్దరంత నీరాయె
చలి తలపులు సెగలైపోయె...
ఎన్నెలెంత ఏరాయె.. నిద్దరంత నీరాయె
చలి తలపులు సెగలైపోయె...
ఈ రేయి కళ్ళలోనా నీ రూపు నిగ నిగలాయె
ఎన్నెలెంత ఏరాయె.. నిద్దరంత నీరాయె
చలి తలపులు సెగలైపోయె...
చరణం 1 :
చెవిలోనా తారలు గుసగుసలాడె...
చెలి మాట ఏమని చిలిపిగ నవ్వే
చెవిలోనా తారలు గుసగుసలాడె...
చెలి మాట ఏమని చిలిపిగ నవ్వే
పరుపున పడుకున్న.. వాకిట నిలుచున్న
పరుపున పడుకున్న.. వాకిట నిలుచున్న
మదిలోన పదునైన కదలింతలాయె...
ఎన్నెలెంత ఏరాయె.. నిద్దరంత నీరాయె
చలి తలపులు సెగలైపోయె...
చరణం 2 :
గడుసైన గాలికి అలజడి పెరిగే..
ఒదిగున్న పైటకు ఓపిక తరిగే
గడుసైన గాలికి అలజడి పెరిగే..
ఒదిగున్న పైటకు ఓపిక తరిగే
పొంగిన ఎన్నెల్లో... పొదవిన ఊహల్లో
పొంగిన ఎన్నెల్లో... పొదవిన ఊహల్లో
నిలువెల్లా తొలిరేయి పులకింతలాయే...
ఎన్నెలెంత ఏరాయె.. నిద్దరంత నీరాయె
చలి తలపులు సెగలైపోయె...
ఈ రేయి కళ్ళలోనా నీ రూపు నిగ నిగలాయె
ఎన్నెలెంత ... ఏరాయె.. నిద్దరంత... నీరాయె
చలి తలపులు సెగలైపోయె...
చలి తలపులు సెగలైపోయె...
చలి తలపులు సెగలైపోయె...
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి