RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

తీగకు పువ్వే అందం | Teegaku Puvve Andam | Song Lyrics | Vintha Dampatulu (1972)

తీగకు పువ్వే అందం గూటికి గువ్వే అందం



చిత్రం : వింత దంపతులు (1972)
సంగీతం : SP కోదండపాణి,
రచన : సి నారాయణ రెడ్డి,
గాయని : పి సుశీల


పల్లవి :

తీగకు పువ్వే అందం గూటికి గువ్వే అందం

ఈ ఇంటికి ఎవరందం నా కంటికి ఎవరందం 

ఓ బాబు నీవెరా నా బాబు నీవెరా 


చరణం 1 


కారు చీకటి ముసిరేవేళ వేగు చుక్కే వెలుగు

మండు టెండలు ముసిరే వేళా వాన చుక్కే వరము


ఇన్నాళ్లు మూగ బోయే నీ తల్లి జీవితాన 

అందాల నీ చిరునవ్వే ఆశా కిరణం 


చరణం 2 


అమ్మ పాట వింటూ ఉంటే అన్ని మరచి చూసేవు 

నాన్న పిలుపే విన్నావంటే నన్ను కూడా మరచేవు  


ఓ నాన్న నీకొరకైనా మీ నాన్న రావాలి 

ఇద్దరినీ చూస్తూ నా ముద్దులన్నీ తీరాలి 


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు