ఏ ఊరు నీ పయనం చక్కని మగరాయా
సంగీతం : S P కోదండపాణి
గానం : ఘంటసాల, P సుశీల
రచన : ఆరుద్ర
చిత్రం : భలే మొనగాడు (1968)
పల్లవి:
ఏ ఊరు నీ పయనం ...చక్కని మగరాయా
ఏ భామ నోచినదో ...మక్కువలోని తియ్యదనం
నీ మక్కువలోని తియ్యదనం...
మీ ఊరే నా పయనం ...చక్కని జవరాలా
నీ మనసే దోచినది...మక్కువలోని తియ్యదనం
నీ మక్కువలోని తియ్యదనం
చరణం 1:
వెళ్ళేవు కాని వేరెవరి కంటా...పడనియ్యకయ్యా నీ అందం
ఏ ఇంతులైనా నీ ఇంపు చూసి..దోచుకొనేరు నీ హృదయం
నిను చూసి నా కనులు...
నిను చూసి నా కనులు...రతి అందమైనా కోరవు
ఏ ఊరు నీ పయనం ...చక్కని మగరాయా
ఏ భామ నోచినదో ...మక్కువలోని తియ్యదనం
నీ మక్కువలోని తియ్యదనం...
చరణం 2:
తెమ్మన్నవన్నీ తెస్తాను కాని...కమ్మని వలపులు ఇవ్వాలి
నేతిరిగి వచ్చే తరుణమ్ముదాకా...నాలో నెలకోని నవ్వాలి
కలలోనా కనిపించి...
కలలోనా కనిపించి...వలపుల దాహం తీర్చేదా
మీ ఊరే నా పయనం ...చక్కని జవరాలా
నీ మనసే దోచినది...మక్కువలోని తియ్యదనం
నీ మక్కువలోని తియ్యదనం...
చరణం 3:
అందాల పెళ్ళి పందిళ్ళు వేస్తా...రయమని తిరిగి రావాలి
సందిట్లోనిన్ను బంధించగానే...కౌగిలి వీడక కరగాలి
ఆనందం... అనురాగం...
ఆనందం... అనురాగం...మనలో మదిలో పండాలి
ఏ ఊరు నీ పయనం ...చక్కని మగరాయా
ఏ భామ నోచినదో ...మక్కువలోని తియ్యదనం
నీ మక్కువలోని తియ్యదనం...
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి