అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
చిత్రం : ప్రతిజ్ఞ పాలన (1965)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల, బృందం
పల్లవి:
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది.... నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది.... నేడే వివాహమౌతుంది
ఓ..ఓ..అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది.... నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది.... నేడే వివాహమౌతుంది
చరణం : 1
నుదుట బాసికము నూతల కాంతుల మెరిసే..ఏ..ఏ..
మదిలో కోరిక మంగళగీతం పాడే
వేచిన కనులే వేయి వలపులై పూచే.....ఏ..ఏ..
పూచిన వలపుల పులకరింతునే మేను
ఓయమ్మో .. ఓయమ్మా… హోయ్.. ఏమంటావ్
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది.... నేడే వివాహమౌతుంది
చరణం : 2
బుగ్గను పెట్టిన నల్లచుక్క తానవ్వే …ఏ..ఏ..
సిగ్గుబరువుతో కన్నెవలపు తలవంచే …
జడలో కుట్టిన మొగలిపువ్వు వీవించే...…ఏ..ఏ..
జన్మజన్మకు అతడే నా మగడమ్మా
ఓయమ్మో .. ఓయమ్మా… హోయ్.. ఏమంటావ్
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది... నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది... నేడే వివాహమౌతుంది
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది... నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది... నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది... నేడే వివాహమౌతుంది
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి