కలలుకనే కమ్మని చిన్నారీ
చిత్రం: టక్కరి దొంగ చక్కని చుక్క (1969)
సంగీతం: సత్యం
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
ఓ...ఓ...ఓ...
కలలుకనే కమ్మని చిన్నారీ
నీ సొగసులన్ని నావే వయ్యారీ
ఆ వయసుపొంగులు.. ఆ వింత హంగులు
నన్ను ఏదొ ఏదొ ఏదొ చేసెనే...
ఓ...ఓ....ఓ...ఓ...
కొంటె చూపు చూసే చెలికాడా
నా వయసు సొగసు దోచే మొనగాడా
లేత లేత బుగ్గలు.. దాచుకున్న సిగ్గులు
నేడు నిన్నే నిన్నే నిన్నే కోరెను
హ...హ...హ...హ...ఆ..ఆ...ఆ
హ....హ...హ...హ...ఆ...ఆ...ఆ...
చరణం 1:
నీ చెంత వింత అందమున్నదీ
ల...ల...ల...ల...
అది విందు చేయ వేచి ఉన్నదీ
ఓ...ఓ...ఓ...ఓ..
నీ చెంత వింత అందమున్నదీ
అది విందు చేయ వేచి ఉన్నదీ
ఆ విందు చేయు సమయమున్నదీ..ఆ ఆ...
నీ కింత తొందరెందుకన్నదీ..
పొంగులు కలిసే పండుగ వేళ..
విందులు నీకే చేసేను
ఆహ...ఆహ...ఆహ...
ఓహో...ఓహో...ఓహో...
కలలు కనే కమ్మని చిన్నారీ
హ...హ...హ...హ...
నీ సొగసులన్నీ నావే వయ్యారీ
ఓ....ఓ...ఓ...ఓ...
చరణం 2:
నీ పెదవులేవో దాచుకున్నవీ
ల...ల...ల...ల...
అవి నన్ను చేర వేచి ఉన్నవీ
ఓ...ఓ...ఓ...ఓ..
నీ పెదవులేవో దాచుకున్నవీ
అవి నన్ను చేర వేచి ఉన్నవీ
నా పెదవులందు ముద్దులున్నవీ.. ఆ ఆ ...
అవి పాపకొరకు దాచుకున్నవీ
అందని వన్నీ అందాలంటే
పందిట బాజ మోగాలి
ఆహ...ఆహ...ఆహ...
ఓహో...ఓహో..ఓహో..
ఓ..ఓ...ఓ...ఓ..
కలలుకనే కమ్మని చిన్నారీ
నీ సొగసులన్ని నావే వయ్యారీ
లేత లేత బుగ్గలు.. దాచుకున్న సిగ్గులు..
నేడు నిన్నే నిన్నే కోరెను
ఆహ...ఆహ...ఆహహహా...
ఓహో...ఓహో...ఓహిహిహో...
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి