దేవీ క్షేమమా
చిత్రం : శాంతి నిలయం (1972)
సంగీతం : ఎస్. పి. కోదండపాణి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : వసంత, బాలు
పల్లవి :
దేవీ క్షేమమా.. దేవరవారూ క్షేమమా
దేవీ క్షేమమా.. దేవరవారూ క్షేమమా
తమ కడగంటి చూపే కరువైనాదీ..
తమ కరుణా కటాక్షమే అరుదైనాదీ..
దేవీ క్షేమమా..
చరణం 1 :
నులి సిగ్గుల లేబుగ్గలు ఎలాగున్నవీ?
నులి వెచ్చని తొలి ముద్దులు పంపమన్నవీ
అల్లరల్లరీ కళ్ళు చల్లగా వున్నవా?
అల్లరల్లరీ కళ్ళు చల్లగా వున్నవా?
తెల్లవార్లు నిదుర రాక ఎర్రబారుతున్నవీ..
దేవీ క్షేమమా..
చరణం 2 :
జడలోన మల్లెపూలు ఇమడకున్నవి
జత లేక పట్టుపరుపు కుదరకున్నది
తలగడతో చెప్పుకునే కబురులే మిగిలినవి
తలగడతో చెప్పుకునే కబురులే మిగిలినవి
అవి కూడ నలిగిపోయి జాలివేస్తున్నది..
దేవీ క్షేమమా..
చరణం 3 :
నీ బడిలో చదవాలి క్రొత్త క్రొత్త చదువులూ
నేనపుడు అడగాలి చిలిపి చిలిపి ప్రశ్నలూ
నీ పెదవులపై వ్రాయాలి నీవుమెచ్చు జవాబులూ
పెదవులపై వ్రాయాలి నీవుమెచ్చు జవాబులూ
నీ మగసిరి గెలవాలి అసలైన పరీక్షలూ
దేవీ క్షేమమా . . దేవరవారూ క్షేమమా . .
దేవీ క్షేమమా . .
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి