RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

6, ఫిబ్రవరి 2022, ఆదివారం

నిదురపోరా తమ్ముడా | Nidura pora Tammuda | Song Lyrics | Santanam (1955)

నిదురపోరా.. తమ్ముడా



చిత్రం :  సంతానం (1955)

సంగీతం :  సుసర్ల దక్షిణామూర్తి

గీతరచయిత :  అనిశెట్టి

నేపధ్య గానం :  లతా మంగేష్కర్   



పల్లవి :



ఊఁ.....ఊఁ....నిదురపో..నిదురపో..

నిదురపో...నిదురపో...నిదురపో..నిదురపో...

నిదురపోరా.. తమ్ముడా.. నిదురపోరా.. తమ్ముడా..


నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా

నిదురలోన గతమునంతా నిముసమైనా మరచిపోరా

కరుణలేని ఈ జగాన కలతనిదురే మేలురా.. 


నిదురపోరా.. తమ్ముడా.. ఆ..ఆ...



చరణం 1 :


 కలలు పండే కాలమంతా కనులముందే కదలిపోయే ఆ..ఆ....

కలలుపండే కాలమంతా.. కనులముందే కదిలిపోయె

లేతమనసున.. చిగురుటాశ.. పూతలోనే.. రాలిపోయే..  


నిదురపోరా.. తమ్ముడా.. ఆ..ఆ... 



చరణం 2 :



ఆఁ....ఆఁ....ఆఁ....ఆఁ

జాలితలచి.. కన్నీరు తుడిచే.. దాతలే కనరారే..

ఏ..ఏ.. జాలితలచి కన్నీరు తుడిచే దాతలే..కనరారే..


చితికిపోయినా జీవితమంతా చింతలో చితి ఆయే

నీడ చూపే నెలవు మనకూ నిదురయేరా తమ్ముడా 


నిదురపోరా.. తమ్ముడా.. ఆ..ఆ...నిదురపోరా.. తమ్ముడా...


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు