RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

26, ఫిబ్రవరి 2022, శనివారం

ఒకే తోటలోనా ఒకే గూటిలోన | Oke Thotalona oke Gutilona | Song Lyrics | Ramude Devudu (1973)

ఒకే తోటలోన.. ఒక గూటిలోన



చిత్రం :  రాముడే దేవుడు (1973)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


ఒకే తోటలోన.. ఒక గూటిలోన..  

చేరాయి రెండు గువ్వలూ

ఒకే తోటలోన.. ఒక గూటిలోన..  

చేరాయి రెండు గువ్వలూ


అవి జతగానే బతకాలని 

లగంటు ఉన్నాయి

ఒకే తోటలోన.. ఒక గూటిలోన.. 

చేరాయి రెండు గువ్వలూ 



చరణం 1 :


చూపులేనిదానికొకటి  కాపు ఉన్నదీ.. 

తోడులేని దాని కొకటి జోడైనదీ

జంట గువ్వ వెంటవుంటే పొంగిపోతదీ.. 

ఒక్క క్షణం దూరమైతే కుంగిపోతదీ

అది ఏనాటి బంధమో అరెంటిని కలిపిందీ     


ఒకే తోటలోన.. ఒక గూటిలోన.. 

చేరాయి రెండు గువ్వలూ... 

చేరాయి రెండు గువ్వలూ



చరణం 2 :

తనువులేమొ వేరైనా మనసు ఒక్కటే.. 

గుండెలేమొ రెండైన ప్రాణమొక్కటే

ఎక్కడ అవి పుట్టాయో తెలియదెవరికి.. 

ఒక్కటిగా బతకడమే తెలుసువాటికీ

తమ చిన్నారి ఆగూడే కోవెలగా తలచాయి 


ఒకే తోటలోన.. ఒక గూటిలోన.. 

చేరాయి రెండు గువ్వలూ... 

చేరాయి రెండు గువ్వలూ



చరణం 3 :


పూలమాలలో దారం దాగివుంటదీ.. 

వలపుజంటలో చెలిమి దాగనంటదీ

కలిసి మెలిసి కథలెన్నో  అల్లుకున్నవీ.. 

అంతులేని ఆశలెన్నో పెంచుకున్నవీ

తన చెలికాడే దేవుడని మనసార తలచిందీ 


ఒకే తోటలోన.. ఒక గూటిలోన.. 

చేరాయి రెండు గువ్వలూ... 

చేరాయి రెండు గువ్వలూ


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే | Brahmamokkate Parabrahmamokkate | Annamacharya Keerthana | Annamayya (1997)

 బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య సంకీర్తనలు  గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు