శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాట
స్వర కల్పన : ఎస్ వేణు మాధవ్ ,
గానం : టి కృష్ణారావు ,
రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం
పల్లవి:
శ్రీధర భయహర కేసరిముఖ శ్రీ లక్ష్మీ నరసింహా
ఈ కొండల నడుమ కోనల నందున అంబుజ నాభా
ధరణీ తలమున దానవు త్రుంచగ
స్థంబము నుండి ప్రకటితమైన
భీకర రూపా రౌద్ర నరసింహా
ఉగ్ర నరసింహా.. మహోగ్ర నరసింహా
1 చరణం:
నింగికి నేలకు నడుమన నీవు విశ్వంభరాయ
పగటికి రేయికి సంధిగ నీవు దర్శనమిచ్చావు
రుధిరము కారే కేశములు
ఖలుని ప్రేవులే కంఠ హారములు
భీకర రూపా నరసింహా
కొలిచే వారికి ఇలపై దైవము
ఆర్తితో చేరిన అభయమొసగే
కరుణామూర్తి వైకుంఠ నిలయా
శ్రీ లక్ష్మీ నరసింహా.. శ్రీ లక్ష్మీ నరసింహా
2. చరణం:
అంబుధి జొచ్చి సోమకు ద్రుంచిన వేదరక్షకా
వరాహ రూపమున ధరణిని గాచిన గరుడ వాహనా
అనలము చిమ్మే నేత్రద్వయము
ప్రభంజనమల్లే సింహ నాదము
బ్రహ్మాండ రూపా నరసింహా
కలియుగమందు ఇడుములు తీర్చగ
తిరుమల గిరిపై కొలువున్న
ప్రహ్లాదవరదా నరసింహా
శ్రీనివాసా .. శ్రీయోగ నరసింహా..
- రామకృష్ణ
దువ్వు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి