రచన : రామకృష్ణ దువ్వు
20, నవంబర్ 2024, బుధవారం
ఇనకుల తిలకుని పాదాలు కడుగంగ | Inakula Tilakuni Paadalu | Song Lyrics | Omkaram | RKSS Creations
రచన : రామకృష్ణ దువ్వు
1, మార్చి 2023, బుధవారం
మేలుకో మేలుకో సాయినాధా | Meluko Meluko Sainadha | Song Lyrics | RKSS Creations
సాయినాధుని మేలుకొలుపు:
- RKSS Creations
26, ఫిబ్రవరి 2023, ఆదివారం
కన్నెల మనసులు దోచుకు పోయిన కన్నయ్య ఏడమ్మా | Brindavanam Song | RKSS Creations
కన్నెల మనసులు దోచుకు పోయిన కన్నయ్య ఏడమ్మా
గీత రచన : రామకృష్ణ దువ్వు
స్వరకల్పన : కోట కృష్ణవేణి,
గానం : మూల శ్రీలత, టి కృష్ణారావు
రికార్డింగ్ : శ్రీమాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం
ప్రొడక్షన్ : RKSS Creations
పల్లవి:
(గోపికలు):
కన్నెల మనసులు దోచుకు పోయిన
కన్నయ్య ఏడమ్మా
పున్నమి జాబిలి చిన్నబోయిన
వన్నెల కాడమ్మా
మురళీ గానము మధురిమలో మేము
కన్నులు మూయంగా
అల్లరి కృష్ణుడు అందాల కృష్ణుడు
చెంగున మరుగాయె
చరణం:
కృష్ణయ్య లేని తనువులు మేము
మోయంగ లేమమ్మా
ఆతని వేణువు మాధుర్యమే మా
ఊపిరి నిలుపమ్మా
ఆ కాలి మువ్వల సవ్వడులే మాకు
చేతన మిచ్చేది
ఆతడు లేని అరక్షణమైన
జీవించ లేమమ్మా
చరణం:
ఓ భూమాతా నీ వైన మా స్వామి జాడ
పరికించి తెలుపమ్మా
ఓ పున్నాగ, కదంబ, మారేడు, మామిడి
మీరైనా చెప్పండి
ఓ మల్లీ జాజీ సంపెంగ పూలారా
వనమంతా వెదకండి
ఓ వన మయూరమా శిఖిపింఛ మౌళిని
వెదకి తేవమ్మా
చరణం: (కృష్ణుడు...)
ప్రతి తరవు నందు నిలిచింది నేనేగా నేనేగా…
ప్రతి పులుగు నందు చేతనము నేనేగా.. నేనేగా..
ప్రతి పూవు నందు పరిమళము నేనేగా… నేనేగా…
భువిలోన దివిలోన ప్రతి అణువులోన నేనేగా… నేనేగా…
ఓ చెలులారా మీ హృదయాలలో
నేనెపుడూ బందీగా వుంటాను
కన్నెల మనసున నిలచి పోయిన
కన్నయ్య వీడమ్మా
పున్నమి జాబిలకీ కన్నెల సొగసుల
చందము ఏదమ్మా
- రామకృష్ణ దువ్వు
24, అక్టోబర్ 2022, సోమవారం
పొన్నచెట్టు నీడలో పెంచుకున్న ఆశలు | Ponnachettu needalo | Song Lyrics | Brindavanam | RKSS Creations
గోపికల విరహ వేధన:
పొన్నచెట్టు నీడలో పెంచుకున్న ఆశలు
రచన : రామకృష్ణ దువ్వు
స్వరకల్పన : దుర్గారావు పిచ్చిక,
గానం : మూల శ్రీలత,
ఆల్బం : బృందావనం
రికార్డింగ్ : శ్రీ మాత రికార్డింగ్, విశాఖపట్నం
నిర్మాతలు : RKSS క్రియేషన్స్
పల్లవి:
పొన్నచెట్టు నీడలో పెంచుకున్న ఆశలు
కన్నయ్యా తెంచేసి వెళ్ళి పోయావా…
పున్నమి రాతిరిలో వెన్నెల వెలుతురు లో
వెన్నదొంగ పిల్లనగ్రోవి ఊదకున్నావే…
చరణం 1:
ఆలమందల గిట్టల సవ్వడి మా చెవిలో పడగానే
తనువంతా పులకించి నీ కోసం ఎదురొస్తే
ఆలమందల గిట్టల సవ్వడి మా చెవిలో పడగానే
తనువంతా పులకించి నీ కోసం ఎదురొస్తే
నువు లేక మా కళ్ళ జారాయి కన్నీళ్ళు..
రేగిన గోధూళికి కళ్ళాపి జల్లాయి…
నువు లేక మా కళ్ళ జారాయి కన్నీళ్ళు..
రేగిన గోధూళికి కళ్ళాపి జల్లాయి…
చరణం 2:
చల్లను చిలికి వెన్నను తీసి వెన్నునికై
చూడగా
మన్నుతిన్న నోటికి చేరలేక కరిగిపోతే…
చల్లను చిలికి వెన్నను తీసి వెన్నునికై
చూడగా
మన్నుతిన్న నోటికి చేరలేక కరిగిపోతే…
కనుపాపలందు దాగిన నీరూపమే
జలపాతమై ఉరికె మా కన్నీరుగా…
కనుపాపలందు దాగిన నీరూపమే
జలపాతమై ఉరికె మా కన్నీరుగా…
చరణం 3:
వెదురగడను మురళిగా మలచేవు నీవు
కమ్మనైన రాగాలు ఇంపుగా తీసేవు..
వెదురగడను మురళిగా మలచేవు నీవు
కమ్మనైన రాగాలు ఇంపుగా తీసేవు..
మనసు ఇచ్చిన ఈ మగువల విడిచేవు
ప్రాణమే లేనట్టి శిలలు గా చేసావు…
మనసు ఇచ్చిన ఈ మగువల విడిచేవు
ప్రాణమే లేనట్టి శిలలు గా చేసావు…
పొన్నచెట్టు నీడలో పెంచుకున్న ఆశలు
కన్నయ్యా తెంచేసి వెళ్ళి పోయావా…
- రామకృష్ణ దువ్వు -
16, ఏప్రిల్ 2022, శనివారం
రాసలీల నృత్యము | Rasaleela Song | Brindavanam | RKSS Creations
రాసలీల నృత్యము
గీత రచన : రామకృష్ణ దువ్వు
స్వర కల్పన : S వేణుమాధవ్,
ఆల్బం : బృందావనం
రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం
పల్లవి:
శారద చంద్రికలు మరులను కురిపించే
గువ్వలన్ని గూడుచేరి రాసలీలకై వేచే
విరహంలో వేగిపోయి వేంచేసిన చెలులారా
గోవిందుని పదములకు తనువులూగిపోగా
రాసలీల నాట్యమాడ రస జగమే ఓలలాడు
చరణం:
నిశ్శబ్ధ నిశీధిలో జగమే సోలినది
శ్రమియించి ధరియిత్రి నిద్రలో వాలినది
పున్నమి జాబిలికై కలువ కన్నెలు
వన్నెలెన్నో విరబూసి నాట్యమే ఆడాయి
తరుణుల సోయగాలు పిల్లనగ్రోవి చేసి
మురళీధరుని వేలికొసలు మీటగా
మధురమైన గానము కంఠాన పలికింది
చరణం:
తమకపు తనువులు బరువుగ మారెను
ఆతని కౌగిలిలో ఎదలే పొంగెను
ఫాలము మొదలుకొని చరణాల వరకు
అణువు అణువు నల్లనయ్య స్పర్శ కోసం
పరితపించి పోయాయి.. పరవశించాయి
శ్రీకృష్ణ భావనలో తనువులు మనసులు
అర్పించే భాగ్యమే రాసలీల నృత్యము
- RKSS Creations...
5, మార్చి 2022, శనివారం
అందాల కృష్ణయ్య వేణుగాన మధురిమలు | Andala krishnayya | Lord Krishna Devotional Songs | Lyrics | Brindavanam | RKSS Creations
అందాల కృష్ణయ్య వేణుగాన మధురిమలు
సాకి: శ్రీ కృష్ణా యదుకుల మణిదీపమా
శ్యామసుందరుని కాలి అందెల | Shyama Sundaruni | Lord Krishna divotional Songs | Lyrics | RKSS Creations.
శ్యామసుందరుని కాలి అందెల సవ్వడి
పల్లవి: శ్యామసుందరుని కాలి అందెల
26, ఫిబ్రవరి 2022, శనివారం
గరుడ గమన తవ చరణకమల మిహ | Garuda gamana tava | Lyrics in Telugu | Sri Bharti Teerthulu
గరుడ గమన తవ చరణకమల మిహ
గరుడ గమన తవ చరణకమల మిహ
మనసిల సతుమమ నిత్యం
మనసిల సతుమమ నిత్యం
మమ తాపమపా కురుదేవ
మమ పాపమపా కురుదేవ !!
జలజనయన విధి నముచిహరణ
ముఖ విబుధ వినుత పదపద్మ
మమ తాపమపా కురుదేవ
మమ పాపమపా కురుదేవ !!
భుజగశయన భవ మదనజనక
మమ జనన మరణ భయహారీ
మమ తాపమపా కురుదేవ
మమ పాపమపా కురుదేవ !!
శంఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక శరణ
మమ తాపమపా కురుదేవ
మమ పాపమపా కురుదేవ !!
అగణిత గుణగణ అశరణ శరణద
విదళిత సురరిపుజాల
మమ తాపమపా కురుదేవ
మమ పాపమపా కురుదేవ !!
భక్తవర్యమిహ భూరి కరుణయా
పాహి భారతీ తీర్థం
మమ తాపమపా కురుదేవ
మమ పాపమపా కురుదేవ !!
గరుడ గమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యం
మనసి లసతు మమ నిత్యం
మమ తాపమపా కురుదేవ
మమ పాపమపా కురుదేవ !!
- శ్రీ భారతీ తీర్థులు
9, ఫిబ్రవరి 2022, బుధవారం
శ్రీధర భయహర కేసరిముఖ శ్రీ లక్ష్మీ నరసింహా | శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాట | Song Lyrics | RKSS Creations
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాట
స్వర కల్పన : ఎస్ వేణు మాధవ్ ,
గానం : టి కృష్ణారావు ,
రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం
పల్లవి:
శ్రీధర భయహర కేసరిముఖ శ్రీ లక్ష్మీ నరసింహా
ఈ కొండల నడుమ కోనల నందున అంబుజ నాభా
ధరణీ తలమున దానవు త్రుంచగ
స్థంబము నుండి ప్రకటితమైన
భీకర రూపా రౌద్ర నరసింహా
ఉగ్ర నరసింహా.. మహోగ్ర నరసింహా
1 చరణం:
నింగికి నేలకు నడుమన నీవు విశ్వంభరాయ
పగటికి రేయికి సంధిగ నీవు దర్శనమిచ్చావు
రుధిరము కారే కేశములు
ఖలుని ప్రేవులే కంఠ హారములు
భీకర రూపా నరసింహా
కొలిచే వారికి ఇలపై దైవము
ఆర్తితో చేరిన అభయమొసగే
కరుణామూర్తి వైకుంఠ నిలయా
శ్రీ లక్ష్మీ నరసింహా.. శ్రీ లక్ష్మీ నరసింహా
2. చరణం:
అంబుధి జొచ్చి సోమకు ద్రుంచిన వేదరక్షకా
వరాహ రూపమున ధరణిని గాచిన గరుడ వాహనా
అనలము చిమ్మే నేత్రద్వయము
ప్రభంజనమల్లే సింహ నాదము
బ్రహ్మాండ రూపా నరసింహా
కలియుగమందు ఇడుములు తీర్చగ
తిరుమల గిరిపై కొలువున్న
ప్రహ్లాదవరదా నరసింహా
శ్రీనివాసా .. శ్రీయోగ నరసింహా..
- రామకృష్ణ
దువ్వు
25, జనవరి 2022, మంగళవారం
నమ్మ జాలరే యశోదా తనయుని | Nammajalare Yashoda | Song Lyrics | Brindavanam | RKSS Creations
నమ్మ జాలరే యశోదా తనయుని
రచన : రామకృష్ణ దువ్వు,
కంపోజింగ్ : Dr Y బాల గణేష్,
గానం : మూల శ్రీలత,
రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం.
ప్రొడ్యూసర్స్ : RKSS Creations
పల్లవి:
నమ్మ జాలరే యశోదా తనయుని
మహిమలెన్నని అచ్చెరవొందగ
నిక్కమదియె జగతి నందు
ఇతని సాటి లేనే లేరు
చరణం 1:
పాలు త్రాగే ప్రాయము లో రక్కసి పూతను చంపే
బుడి బుడి అడుగులు వేస్తూ బండి చక్రమందు
ఆ అసురుని నరకముకే సాగనంపే
వ్రేపల్లె నందు వెలుగు నింపే
చరణం2:
మన్ను తిన్న నోటి తోనె తల్లికి జగములు జూపె
వెన్న దొంగను అదుపు చేయగా రోటికీ
కట్టగా
శాపవిమోచనము చేసే చెట్లను
కూల్చీ
విస్మయ పరచే గోకులమంతా ..
చరణం 3:
సుడిగాలై కమ్ముకు వచ్చిన తృణావర్తుని
ప్రాణములను అవలీలగ
హరించినాడే
యమునా నదిలో విషమును చిమ్మే
కాళీయుని పడగలు మర్ధించి నటించి నాడే
బృందావనమున కనువిందు వాడే
చరణం 5:
దిక్కుల పాలించే వాడి దర్పమణచగ
వేలి కొనతో గోవర్ధన గిరినెత్తినాడే
జీవులందరిని తానై కాచినాడే
బాలుడీతడు నందుని ఇంట
వెలసియున్న హరి.. గోవిందుడు..
- రామకృష్ణ దువ్వు
RKSS Creations...
పాటల ధనుస్సు పాపులర్ పాట
ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)
ఏమండోయ్ నిదుర లేవండోయ్ చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...
పాటల ధనుస్సు పాపులర్ పాటలు
-
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ రచన : రాజశ్రీ, సంగీతం : ఇళయరాజా, గానం : SP బాలు, చిత్రం : ఓ పాపా లాలీ (1990) మాటేరాని చిన్నదాని కళ్ళు ...
-
అమ్మ భవాని లోకాల నేలే చిత్రం : శివరామరాజు (2002 ) సంగీతం : ఎస్ ఏ రాజ్ కుమార్, రచన : చిర్రావూరి విజయ్ కుమార్ గానం : బాలు, పల్లవి : ఓం శక్త...
-
మహాకనకదుర్గా విజయకనకదుర్గా చిత్రం: దేవుళ్ళు (2000) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ గీతరచయిత: జొన్నవిత్తుల నేపధ్య గానం: జానకి పల్లవి: మహాకనకదుర్...
