RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
srikrishna songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
srikrishna songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జులై 2026, మంగళవారం

నీ పేరు తలచినా చాలు | Nee Peru Talachina Chalu | Song Lyrics | Ekaveera (1969)

నీ పేరు తలచినా చాలు 


చిత్రం: ఏకవీర (1969) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: సి.నారాయణరెడ్డి  

నేపథ్య గానం: పి.సుశీల 

 

పల్లవి: 


కృష్ణా.... 

నీ పేరు తలచినా చాలు 

నీ పేరు తలచినా చాలు 

మదిలో పొంగు శతకోటి 

యమునా తరంగాలు 

నీ పేరు తలచినా చాలు 


చరణం 1: 


ఏమి మురళి అది ఏమి రవళి రా..అ.ఆ.. 

ఏమి మురళి అది ఏమి రవళి రా 

పాట వినగ ప్రాణాలు కదలురా 

ఏమీ మురళి అది ఏమీ రవళి రా 

పాట వినగ ప్రాణాలు కదలురా 

మురళీధరా నీ స్వరలహరులలో 

మరణమైనా మధురమురా 


చరణం 2: 


వెదురు పొదలలో తిరిగి తిరిగి 

నీ పదపల్లవములు కందిపోయేనో 

వెదురు పొదలలో తిరిగి తిరిగి

నీ పదపల్లవములు కందిపోయేనో 

యెదపానుపుపై పవళించరా 

నా పొదిగిన కౌగిట పులకించరా 


చరణం 3: 


గోపాలా ...నందబాలా..... 

నవమంజుల మురళీలోల 

మృదు సమీరకంపిత 

మనోజ్ఞకుంతల తమాలపల్లవజాలా 

కృష్ణా నీ పేరు తలచినా చాలూ 


ఏమి పిలుపు అది ఏమి పిలుపు 

బృందానికుంజముల పూలు పూసి 

శరదిందు చంద్రికల కేలు సాచి  

కరుణాంతరంగముల దాగి దాగి 

చెలి అందెలందు చెలరేగి రేగి 

నను తొందరించెరా ..ఆ...

తొలకరించెరా..ఆ.. 

తొందరించెరా తొలకరించెరా 

వలపు జల్లుగా పలుకరించెరా 

వల్లవీరమణి చల్లని ఉల్లము 

అల్లన జల్లన పరవశించెరా..ఆ..ఆ.. 

కృష్ణా.... 

నీ పేరు తలచినా చాలు


- పాటల ధనుస్సు 


24, అక్టోబర్ 2022, సోమవారం

పొన్నచెట్టు నీడలో పెంచుకున్న ఆశలు | Ponnachettu needalo | Song Lyrics | Brindavanam | RKSS Creations

గోపికల విరహ వేధన: 

పొన్నచెట్టు నీడలో పెంచుకున్న ఆశలు

రచన : రామకృష్ణ దువ్వు

స్వరకల్పన : దుర్గారావు పిచ్చిక,

గానం : మూల శ్రీలత, 

ఆల్బం : బృందావనం 

రికార్డింగ్ : శ్రీ మాత రికార్డింగ్, విశాఖపట్నం 

నిర్మాతలు : RKSS క్రియేషన్స్ 


పల్లవి:

పొన్నచెట్టు నీడలో పెంచుకున్న ఆశలు

కన్నయ్యా తెంచేసి వెళ్ళి పోయావా

పున్నమి రాతిరిలో వెన్నెల వెలుతురు లో

వెన్నదొంగ పిల్లనగ్రోవి ఊదకున్నావే

 

చరణం 1:

ఆలమందల గిట్టల సవ్వడి మా చెవిలో పడగానే

తనువంతా పులకించి నీ కోసం ఎదురొస్తే

ఆలమందల గిట్టల సవ్వడి మా చెవిలో పడగానే

తనువంతా పులకించి నీ కోసం ఎదురొస్తే

నువు లేక మా కళ్ళ జారాయి కన్నీళ్ళు..

రేగిన గోధూళికి కళ్ళాపి జల్లాయి

నువు లేక మా కళ్ళ జారాయి కన్నీళ్ళు..

రేగిన గోధూళికి కళ్ళాపి జల్లాయి

 

చరణం 2:

చల్లను చిలికి వెన్నను తీసి వెన్నునికై చూడగా

మన్నుతిన్న నోటికి చేరలేక కరిగిపోతే

చల్లను చిలికి వెన్నను తీసి వెన్నునికై చూడగా

మన్నుతిన్న నోటికి చేరలేక కరిగిపోతే

కనుపాపలందు దాగిన నీరూపమే

జలపాతమై ఉరికె మా కన్నీరుగా

కనుపాపలందు దాగిన నీరూపమే

జలపాతమై ఉరికె మా కన్నీరుగా

 

చరణం 3:

వెదురగడను మురళిగా మలచేవు నీవు

కమ్మనైన రాగాలు ఇంపుగా తీసేవు..

వెదురగడను మురళిగా మలచేవు నీవు

కమ్మనైన రాగాలు ఇంపుగా తీసేవు..

మనసు ఇచ్చిన ఈ మగువల విడిచేవు

ప్రాణమే లేనట్టి శిలలు గా చేసావు

మనసు ఇచ్చిన ఈ మగువల విడిచేవు

ప్రాణమే లేనట్టి శిలలు గా చేసావు

 

పొన్నచెట్టు నీడలో పెంచుకున్న ఆశలు

కన్నయ్యా తెంచేసి వెళ్ళి పోయావా

 

- రామకృష్ణ దువ్వు -

16, ఏప్రిల్ 2022, శనివారం

రాసలీల నృత్యము | Rasaleela Song | Brindavanam | RKSS Creations

 రాసలీల నృత్యము


గీత రచన : రామకృష్ణ దువ్వు 

స్వర కల్పన : S వేణుమాధవ్,

ఆల్బం : బృందావనం 

రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం 


పల్లవి:

శారద చంద్రికలు మరులను కురిపించే

గువ్వలన్ని గూడుచేరి రాసలీలకై వేచే

విరహంలో వేగిపోయి వేంచేసిన చెలులారా

గోవిందుని పదములకు తనువులూగిపోగా

రాసలీల నాట్యమాడ రస జగమే ఓలలాడు

 

చరణం:

నిశ్శబ్ధ నిశీధిలో జగమే సోలినది

శ్రమియించి ధరియిత్రి నిద్రలో వాలినది

పున్నమి జాబిలికై కలువ కన్నెలు

వన్నెలెన్నో విరబూసి నాట్యమే ఆడాయి

తరుణుల సోయగాలు పిల్లనగ్రోవి చేసి

మురళీధరుని వేలికొసలు మీటగా

మధురమైన గానము కంఠాన పలికింది

 

చరణం:

తమకపు తనువులు బరువుగ మారెను

ఆతని కౌగిలిలో ఎదలే పొంగెను

ఫాలము మొదలుకొని చరణాల వరకు

అణువు అణువు నల్లనయ్య స్పర్శ కోసం

పరితపించి పోయాయి.. పరవశించాయి

శ్రీకృష్ణ భావనలో తనువులు మనసులు

అర్పించే భాగ్యమే రాసలీల నృత్యము

- RKSS Creations...

25, జనవరి 2022, మంగళవారం

నమ్మ జాలరే యశోదా తనయుని | Nammajalare Yashoda | Song Lyrics | Brindavanam | RKSS Creations

 నమ్మ జాలరే యశోదా తనయుని



రచన : రామకృష్ణ దువ్వు,

కంపోజింగ్ : Dr Y బాల గణేష్,

గానం : మూల శ్రీలత,

రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం. 

ప్రొడ్యూసర్స్ : RKSS Creations 


పల్లవి:  

నమ్మ జాలరే యశోదా తనయుని

మహిమలెన్నని అచ్చెరవొందగ

    నిక్కమదియె జగతి నందు

    ఇతని సాటి  లేనే లేరు

 

చరణం 1: 

పాలు త్రాగే ప్రాయము లో  రక్కసి పూతను చంపే

బుడి బుడి అడుగులు వేస్తూ బండి చక్రమందు

ఆ అసురుని నరకముకే సాగనంపే

  వ్రేపల్లె నందు వెలుగు నింపే

 

చరణం2: 

మన్ను తిన్న నోటి తోనె తల్లికి జగములు జూపె

వెన్న దొంగను అదుపు చేయగా రోటికీ కట్టగా

శాపవిమోచనము చేసే చెట్లను కూల్చీ

విస్మయ పరచే గోకులమంతా ..

 

చరణం 3:

సుడిగాలై కమ్ముకు వచ్చిన తృణావర్తుని

ప్రాణములను అవలీలగ హరించినాడే

యమునా నదిలో విషమును చిమ్మే

కాళీయుని పడగలు మర్ధించి నటించి నాడే

బృందావనమున కనువిందు వాడే

 

చరణం 5:

దిక్కుల పాలించే వాడి దర్పమణచగ 

వేలి కొనతో గోవర్ధన గిరినెత్తినాడే

  జీవులందరిని తానై కాచినాడే

      బాలుడీతడు నందుని ఇంట

      వెలసియున్న హరి.. గోవిందుడు..

 

- రామకృష్ణ దువ్వు

RKSS Creations...


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు