RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kr vijaya songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kr vijaya songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జులై 2026, శనివారం

ఒక దీపం వెలిగింది | Oka Deepam Veligindi | Song Lyrics | Ekaveera (1969)

ఒక దీపం వెలిగింది 


చిత్రం: ఏకవీర (1969)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం: ఘంటసాల, పి.సుశీల 


పల్లవి:


ఒక దీపం వెలిగింది.. 

ఒక రూపం వెలసింది

ఒక దీపం వెలిగింది.. 

ఒక రూపం వెలసింది

స్నేహంలో రేకులు విరిసి ..

చిరునవ్వుల వెలుగు కురిసి

స్నేహంలో రేకులు విరిసి ..

చిరునవ్వుల వెలుగు కురిసి

ఒక దీపం వెలిగింది.. 

ఒక రూపం వెలసింది


ఒక దీపం మలిగింది.. 

ఒక రూపం తొలగింది

ఒక దీపం మలిగింది ..

ఒక రూపం తొలగింది

వేకువ ఇక లేదని తెలిసి ..

చీకటితో చేతులు కలిపి

వేకువ ఇక లేదని తెలిసి ..

చీకటితో చేతులు కలిపి

ఒక దీపం మలిగింది ..

ఒక రూపం తొలగింది


చరణం 1:


మంచు తెరలే కరిగిపోగా ..

మనసు పొరలే విరిసిరాగా

మంచు తెరలే కరిగిపోగా ..

మనసు పొరలే విరిసిరాగా

చెలిమి పిలుపే చేరుకోగ ..

చెలియ వలపే నాదికాగా

అనురాగపు మాలికలల్లి.. 

అణువణువున మధువులు చల్లి

అనురాగపు మాలికలల్లి.. 

అణువణువున మధువులు చల్లి

ఒక ఉదయం పిలిచింది... 

ఒక హృదయం ఎగిసింది


చరణం 2:


నింగి అంచులు అందలేక.. 

నేలపైన నిలువరాక

నింగి అంచులు అందలేక ..

నేలపైన నిలువరాక

కన్నె కలలే వెతలుకాగా ..

ఉన్న రెక్కలు చితికిపోగా

కనిపించని కన్నీట తడిసి... 

బడబానల మెడలో ముడిచి

కనిపించని కన్నీట తడిసి... 

బడబానల మెడలో ముడిచి

ఒక ఉదయం ఆగింది ..

ఒక హృదయం ఆరింది

ఒక ఉదయం ఆగింది.. 

ఒక హృదయం ఆరింది


ఒక దీపం వెలిగింది ...

ఒక దీపం మలిగింది..


- పాటల ధనుస్సు 


17, జులై 2026, శుక్రవారం

ఔనే చెలియా సరి సరి | Oune Cheliya Sarisari | Song Lyrics | Ekaveera (1969)

ఔనే చెలియా సరి సరి 


చిత్రం: ఏకవీర (1969)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం: పి.సుశీల 


పల్లవి:


ఔనే...చెలియా...సరి సరి

ఆ హంసల నడకలిప్పుడా ..

సొగసరి

ఔనే చెలియా.. సరి సరి

ఆ హంసల నడకలిప్పుడా... 

సొగసరి

ఔనే చెలియా.. సరి సరి


చరణం 1:


ఆమ్మచెల్ల తెలిసేనే 

ఎమ్మెలాడి వగలు

నెమ్మదిలో దాచాలని  

కమ్మని కోరికలు

వాలుకన్ను రెప్పలలో 

వాలాడే తొందరలు

వాలుకన్ను రెప్పలలో  

వాలాడే తొందరలు

దోరపెదవి అంచుల 

చిరునవ్వుల... దోబూచులు


ఔనే ..చెలియా.. సరి సరి

ఆ హంసల నడకలిప్పుడా ...

సొగసరి

ఔనే చెలియా... సరి సరి


చరణం 2:


పవళింపుల గదిలో... 

ప్రణయరాజ్యమేలాలని

పవళింపుల గదిలో... 

ప్రణయరాజ్యమేలాలని

నవమల్లెల పానుపుపై.. 

నవమదనుడు త్వరపడునే

నవమల్లెల పానుపుపై.. 

నవమదనుడు త్వరపడునే


చెరిపడనీవే సుంత ..ఉహు.. 

చీర చెరకు గుసగుసలు

ఓ ...చెరిపడనీవే సుంత.. 

చీర చెరకు గుసగుసలు

రవల అందె మువలూదే ..

రాగరహస్యాలు


ఔనే ..చెలియా.. సరి సరి

ఆ హంసల నడకలిప్పుడా ...

సొగసరి

ఔనే చెలియా... సరి సరి


చరణం 3:


ఏ చోట దాచేవే ...

ఈ వరకీ సిగ్గులు

ఈ చెక్కిటిపై పూచే...

ఈ గులాబి నిగ్గులు

ఏ చోట దాచేవే 

ఈ వరకీ సిగ్గులు

ఈ చెక్కిటిపై పూచే...

ఈ గులాబి నిగ్గులు


మాపటి బిడియాలన్ని.. 

రేపటికి వుండవులే..ఏ...

మాపటి బిడియాలన్ని... 

రేపటికి వుండవులే...

నేటి సోయగాలు ...

మరునాటికి వడిలేనులే


ఔనే ..చెలియా.. సరి సరి

ఆ హంసల నడకలిప్పుడా ...

సొగసరి

ఔనే చెలియా.. సరి సరి


- పాటల ధనుస్సు 


14, జులై 2026, మంగళవారం

ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ | Entha Dooramu Adi | Song Lyrics | Ekaveera (1969)

ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ 


చిత్రం: ఏకవీర (1969)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత:  సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల 


పల్లవి:


ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ

ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ

పరిమళించు పాన్పులకూ 

నిరీక్షించు చూపులకూ

పరిమళించు పాన్పులకూ 

నిరీక్షించు చూపులకూ

వేసిన తలపులకూ 

వేచిన తలపులకూ

ఎంత చేరువో అది 

అంత దూరము


ఎంత దూరమూ అదీ 

యెంత దూరమూ

ఎంత దూరమూ అదీ 

యెంత దూరమూ

ఉదయించే కిరణాలకు 

ఉప్పొంగే కెరటాలకు..

ఉదయించే కిరణాలకు 

ఉప్పొంగే కెరటాలకు..

కలలుగనే చెలునికీ 

కలతపడే చెలియకు

ఎంత చేరువో అది 

అంత దూరము


చరణం 1:


ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ

ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ

మనసు పడని సంపంగికి.. 

మరులు విడని భ్రమరానికి

మనసు పడని సంపంగికి.. 

మరులు విడని భ్రమరానికి

ఉన్నదానికీ.. 

అనుకున్నదానికీ

ఎంత చేరువో అది 

అంత దూరము


చరణం 2:


ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ

ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ

అల్లనాటి ఆశలకూ.. 

అణగారిన బాసలకూ

అల్లనాటి ఆశలకూ.. 

అణగారిన బాసలకూ

మరువరాని అందానికి.. 

చెరిగిపోని బంధానికి

ఎంత చేరువో అది 

అంత దూరము


ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ

ఎంత దూరమూ అదీ 

ఎంత దూరమూ


- పాటల ధనుస్సు 


కలువపూల చెంత చేరి | Kaluva Poola Chentha Cheri | Song Lyrics | Ekaveera (1969)

కలువపూల చెంత చేరి 


చిత్రం : ఏకవీర (1969)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం : ఎస్ పి బాలు 


పల్లవి : 


కలువపూల చెంత చేరి 

కైమోడుపు సేతును

నా కలికి మిన్న కన్నులలో 

కలకలమని విరియాలని

మబ్బులతో ఒక్కమారు 

మనవి చేసికొందును

నా అంగన ఫాలాంగణమున 

ముంగురులై కదలాలని


చరణం 1:


చుక్కలతో ఒక్కసారి 

సూచింతును

నా ప్రేయసి నల్లని వాల్జడ 

సందుల మల్లియలై మొలవాలని

పూర్ణ సుధాకర బింబమ్మునకు 

వినతి సేతును

నా పొలతికి ముఖబింబమై 

కళలు దిద్దుకోవాలని


చరణం 2:


ప్రకృతి ముందు చేతులెత్తి 

ప్రార్థింతును కడసారిగా...

నా రమణికి బదులుగ 

ఆకారం ధరియించాలని 


- పాటల ధనుస్సు 


ఏ పారిజాతమ్ములీయగలనో | Ye Parijathammuleyagalano | Song Lyrics | Ekaveera (1969)

ఏ పారిజాతమ్ములీయగలనో 


చిత్రం: ఏకవీర (1969) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం: ఎస్ పి బాలు 


పల్లవి: 


ఏ పారిజాతమ్ములీయగలనో…  

సఖీ 

గిరి మల్లికలు తప్ప…  

గరికపూవులు తప్ప 

ఏ కానుకలను అందించగలనో…  

చెలీ 

గుండెలోతుల దాచుకున్న 

వలపులు తప్ప 


జగతిపై నడయాడు 

చంచలా వల్లికా 

తరుణి ఆకృతి దాల్చు 

శరదిందు చంద్రికా... 

శరదిందు చంద్రికా... 


చరణం 1: 


నీవు లేని తొలి రాతిరి... 

నిట్టూర్పుల పెను చీకటి 

నీవు లేని విరి పానుపు... 

నిప్పులు చెరిగే కుంపటి 


విరులెందుకు... సిరులెందుకు 

మనసు లేక  మరులెందుకు 

తలపెందుకు... తనువెందుకు 

నీవు లేక నేనెందుకు 

నీవు లేక నేనెందుకు


- పాటల ధనుస్సు 


నీ పేరు తలచినా చాలు | Nee Peru Talachina Chalu | Song Lyrics | Ekaveera (1969)

నీ పేరు తలచినా చాలు 


చిత్రం: ఏకవీర (1969) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: సి.నారాయణరెడ్డి  

నేపథ్య గానం: పి.సుశీల 

 

పల్లవి: 


కృష్ణా.... 

నీ పేరు తలచినా చాలు 

నీ పేరు తలచినా చాలు 

మదిలో పొంగు శతకోటి 

యమునా తరంగాలు 

నీ పేరు తలచినా చాలు 


చరణం 1: 


ఏమి మురళి అది ఏమి రవళి రా..అ.ఆ.. 

ఏమి మురళి అది ఏమి రవళి రా 

పాట వినగ ప్రాణాలు కదలురా 

ఏమీ మురళి అది ఏమీ రవళి రా 

పాట వినగ ప్రాణాలు కదలురా 

మురళీధరా నీ స్వరలహరులలో 

మరణమైనా మధురమురా 


చరణం 2: 


వెదురు పొదలలో తిరిగి తిరిగి 

నీ పదపల్లవములు కందిపోయేనో 

వెదురు పొదలలో తిరిగి తిరిగి

నీ పదపల్లవములు కందిపోయేనో 

యెదపానుపుపై పవళించరా 

నా పొదిగిన కౌగిట పులకించరా 


చరణం 3: 


గోపాలా ...నందబాలా..... 

నవమంజుల మురళీలోల 

మృదు సమీరకంపిత 

మనోజ్ఞకుంతల తమాలపల్లవజాలా 

కృష్ణా నీ పేరు తలచినా చాలూ 


ఏమి పిలుపు అది ఏమి పిలుపు 

బృందానికుంజముల పూలు పూసి 

శరదిందు చంద్రికల కేలు సాచి  

కరుణాంతరంగముల దాగి దాగి 

చెలి అందెలందు చెలరేగి రేగి 

నను తొందరించెరా ..ఆ...

తొలకరించెరా..ఆ.. 

తొందరించెరా తొలకరించెరా 

వలపు జల్లుగా పలుకరించెరా 

వల్లవీరమణి చల్లని ఉల్లము 

అల్లన జల్లన పరవశించెరా..ఆ..ఆ.. 

కృష్ణా.... 

నీ పేరు తలచినా చాలు


- పాటల ధనుస్సు 


25, ఆగస్టు 2024, ఆదివారం

ప్రియురాల సిగ్గేలనే | Priyurala Siggelane | Song Lyrics | Srikrishna Pandaveeyam (1966)

ప్రియురాల సిగ్గేలనే



చిత్రం :  శ్రీకృష్ణ పాండవీయం (1966)

సంగీతం :  టి.వి. రాజు

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 


పల్లవి :


ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ.. 

ప్రియురాల సిగ్గేలనే

నీ మనసేలు మగవానిజేరి.. ఈ..ఈ..  

ప్రియురాల సిగ్గేలనే


నాలోన ఊహించినా..ఆ..ఆ.. 

నాలోన ఊహించినా

కలలీనాడు ఫలియించే స్వామి..ఈ..ఈ.. 

నాలోన ఊహించినా 


చరణం 1 :


ఏమి ఎరుగని గోపాలునికి.. 

ప్రేమలేవో నేరిపినావు

మనసు తీర పలుకరించి.. 

నా ముద్దు ముచ్చట చెల్లించవే


ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ.. 

ప్రియురాల సిగ్గేలనే


చరణం 2 :


ప్రేమలు తెలిసిన దేవుడవని విని.. 

నా మదిలోనా కొలిచితిని

స్వామివి నీవని తలచి నీకే.. 

బ్రతుకు కానుక చేసితిని


నాలోన ఊహించినా..ఆ..ఆ.. 

నాలోన ఊహించినా

కలలీనాడు ఫలియించే స్వామి..ఈ..ఈ.. 

నాలోన ఊహించినా..ఆ.. 


చరణం 3 :


సమయానికి తగు మాటలు నేర్చిన.. 

సరసురాలవే ఓ భామా

సమయానికి తగు మాటలు నేర్చిన.. 

సరసురాలవే ఓ భామా

ఇపుడేమన్నా ఒప్పునులే.. 

ఇక ఎవరేమన్నా తప్పదులే


ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ.. 

ప్రియురాల సిగ్గేలనే

నీ మనసేలు మగవానిజేరి..ఈ..ఈ.. 

ప్రియురాల సిగ్గేలనే


- పాటల ధనుస్సు 


16, ఏప్రిల్ 2024, మంగళవారం

అమ్మమమ్మో తెలిసిందిలే | Ammamammo Telisindile | Song Lyrics | Lakshmi Kataksham (1970)

అమ్మమమ్మో తెలిసిందిలే



చిత్రం :  లక్ష్మీ కటాక్షం (1970)

సంగీతం :  కోదండపాణి

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల 


పల్లవి :


అమ్మమమ్మో తెలిసిందిలే.. 

గుట్టు తెలిసిందిలే

నీ రూపులలోన.. నీ చూపులోన

ఏ రాచకళలో మెరిసేనని


అమ్మమమ్మో తెలిసిందిలే.. 

గుట్టు తెలిసిందిలే

ఏ కొంటె మరుడో.. గంధర్వ వరుడో

నా కళ్ళలోన నవ్వేనని

అమ్మమమ్మో తెలిసిందిలే 

గుట్టు తెలిసిందిలే  


చరణం 1:


కులికే వయసే పులకించి పోగా

పోంగు ఆగుతుందా... 

ఎదలో కదిలే పొంగు ఆగుతుందా


కులికే వయసు పులకించి పోగా

పొంగు ఆగుతుందా.. 

ఎదలో కదిలే పొంగు ఆగుతుందా


పువ్వల్లే మారిపోయి.. ముద్దుల్లో తేలిపోయి

పువ్వల్లే మారిపోయి.. ముద్దుల్లో తేలిపోయి

కవ్విస్తే కన్నె మనసు ఆగుతుందా


అమ్మమమ్మో తెలిసిందిలే.. 

గుట్టు తెలిసిందిలే

నీ రూపులలోన.. నీ చూపులోన

ఏ రాచకళలో మెరిసేనని

అమ్మమమ్మో తెలిసిందిలే.. 

గుట్టు తెలిసిందిలే 


చరణం 2 :


వలచే జాబిలి ఇలపైన రాగ

కలువ దాగుతుందా.. 

విరిసే మురిసే.. తలపు దాగుతుందా


వలచే జాబిలి ఇలపైన రాగ

కలువ దాగుతుందా.. 

విరిసే మురిసే.. తలపు దాగుతుందా


తీగల్లే అల్లుకొంటే..ఆహ..

గుండెల్లో జల్లుమంటే..ఓహో..

తీగల్లే అల్లుకొంటే..ఆహ..

గుండెల్లో జల్లుమంటే..ఓహో..

దాచినా దోర వలపు దాగుతుందా


అమ్మమమ్మో తెలిసిందిలే.. 

గుట్టు తెలిసిందిలే

ఏ కొంటె మరుడో.. గంధర్వ వరుడో

నా కళ్ళలోన నవ్వేనని

అమ్మమమ్మో తెలిసిందిలే.. 

గుట్టు తెలిసిందిలే


పాటల ధనుస్సు 


రా వెన్నెల దొరా కన్నియను చేరా | Raa Vennela Dora | Song Lyrics | Lakshmi Kataksham (1970)

రా వెన్నెల దొరా కన్నియను చేరా



చిత్రం :  లక్ష్మీ కటాక్షం (1970)

సంగీతం :  కోదండపాణి

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల 


పల్లవి :


ఆహా...హ....అహ...హ...

అహ...హ.....ఓహో...ఓ...ఓ...

ఆహ....హ.....హా......


రా...వెన్నెల దొరా....కన్నియను చేరా

రా...కన్ను చెదర ...వేచితిని..రా రా...ఆ...ఆ..ఆ


రా..వెన్నెల దొరా....కన్నియను చేరా...

రా..కన్ను చెదర ...వేచితిని..రా రా...ఆ...ఆ...ఆ..   


చరణం 1 :


ఈ పాల వెన్నెలలోన...నీ నీలి కన్నులలోనా..

ఈ పాల వెన్నెలలోన...నీ నీలి కన్నులలోనా..

ఉన్నానులేవే ...ప్రియతమా....ఆ..ఆ


నీ మగసిరి నగవులు...చాలునులే...

నీ సొగసరి నటనలు చాలునులే...

నీ మనసైన తారను నే కానులే...


రా..వెన్నెల దొరా...వింత కనవేరా..

రా..చిలకవౌరా...అలిగినదిలేరా...ఆ...ఆ..ఆ.. 


చరణం 2 :


ఈ మబ్బు తెరచాటేలా...ఈ నింగి పయణాలేలా...

ఈ మబ్బు తెరచాటేలా...ఈ నింగి పయణాలేలా...

ఎద నిండిపోరా...చందమా....ఆ...ఆ..


నీ పగడపు పెదవుల...జిగి నేనే...

నీ చెదరని కౌగిలి ...బిగి నేనే...

నా ఎద నిండ నీవే నిలిచేవులే....


రా..వెన్నెల దొరా....కన్నియను చేరా...

రా..కన్ను చెదర ...వేచితిని..రా రా...ఆ...ఆ...ఆ..


రా..వెన్నెల దొరా...వింత కనవేరా..

రా..చిలకవౌరా...అలిగినదిలేరా...ఆ...ఆ..ఆ..


పాటల ధనుస్సు 



11, ఫిబ్రవరి 2024, ఆదివారం

కలలే కన్నానురా | Kalale kannanura | Song Lyrics | Asadhyudu (1968)

కలలే కన్నానురా



చిత్రం :  అసాధ్యుడు (1968)

సంగీతం :  టి. చలపతిరావు

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  జానకి 



పల్లవి :


కలలే కన్నానురా... 

ఆశతో ఉన్నానురా... 

త్వరగా రావేమిరా....

కలలే కన్నానురా..... 


చరణం 1 :


వెన్నెల్లో ఈ రేయి...విరబూసి ఉందోయి...

నీలాల కనుదోయి ....నిన్నే వెతికేనోయి....

వెన్నెల్లో ఈ రేయి...విరబూసి ఉందోయి...

నీలాల కనుదోయి ....నిన్నే వెతికేనోయి....


సొగసులన్ని దోచుకో... నన్ను నీలో దాచుకో...

కలలే కన్నానురా.... 


చరణం 2 : 


నా సిగ్గు దోచేవు... నను చూసి నవ్వేవు....

మెరుపల్లే మెరిసేవు... మురిపించి పొయేవు...

కనులముందే ఉండిపో... 

మనసునిండా నిండిపో...

కలలే కన్నానురా... 


చరణం 3 :


లా...లా...లా..లా...

లలా....లలా....లలా....

పులకించే నా మేను...ఏమేమో కోరేను...

నిను చేరా రాలేను...ఒంటరిగా మనలేను...

పులకించే నా మేను...ఏమేమో కోరేను...

నిను చేరా రాలేను...ఒంటరిగా మనలేను...

వలపుపోంగే వేళరా...నీవు నాతో చేరరా....


కలలే కన్నానురా.....ఆశతో ఉన్నానురా......

త్వరగా....రావేమిరా....


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు