RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ntr as srikrishna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ntr as srikrishna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, ఆగస్టు 2024, ఆదివారం

జోహారు శిఖిపించమౌళి | Joharu Sikhipincha Mouli | Song Lyrics | Sri Krishna Vijayam (1970)

జోహారు శిఖిపించమౌళి



చిత్రం  :  శ్రీకృష్ణ విజయం (1970)

సంగీతం  : పెండ్యాల

గీతరచయిత  :  సినారె

నేపధ్య గానం  :   సుశీల    


పల్లవి :


జోహారు శిఖిపించమౌళి..

ఇదే .. జోహారు శిఖిపించమౌళి..

ఇదే .. జోహారు రసరమ్య గుణశాలి... 

వనమాలి

జోహారు శిఖిపించమౌళి..  


చరణం 1 :


కలికి చూపులతోనే చెలులను కరగించి

కరకు చూపులతోనే అరులను జడిపించి

కలికి చూపులతోనే చెలులను కరగించి

కరకు చూపులతోనే అరులను జడిపించి


నయగార మొకకంట.. 

జయవీర మొకకంట..

నయగార మొకకంట.. 

జయవీర మొకకంట..

చిలకరించి చెలువుమించి.. 

నిలిచిన శ్రీకర నరవర.. సిరిదొర


జోహారు శిఖిపించమౌళి..  


చరణం 2 :


నీ నాదలహరిలో నిదురించు భువనాలు

నీ నాట్యకేళిలో నినదించు గగనాలు

నీ నాదలహరిలో నిదురించు భువనాలు

నీ నాట్యకేళిలో నినదించు గగనాలు


నిగమాలకే నీవు సిగబంతివైనావు... 

అ... అఅ... అ... అ

నిగమాలకే నీవు సిగబంతివైనావు

యుగయుగాల దివ్యలీల నెరసిన 

అవతారమూర్తి... ఘనసార కీర్తి 


జోహారు శిఖిపించమౌళి..  


చరణం 3 :


చకిత చకిత హరిణేక్షణా వదన 

చంద్రాకాంతు లివిగో

చలిత లలిత రమణీ చేలాంచల 

చామరమ్ము లివిగో

ఝళం ఝళిత సురలలనా నూపుర 

కలరవమ్ము లివిగో

మధు కర రవమ్ములివిగో ...  

మంగళ రవమ్ములివిగో


దిగంతముల అనంతముగ గుబాళించు

సుదూర నందన సుమమ్ము లివిగో 


జోహారు శిఖిపించమౌళి..  


- పాటల ధనుస్సు 


పిల్లనగ్రోవి పిలుపు | Pillanagrovi Pilupu | Song Lyrics | Srikrishna Vijayam (1970)

పిల్లనగ్రోవి పిలుపు



చిత్రం : శ్రీకృష్ణ విజయం (1970)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 


పల్లవి :


పిల్లనగ్రోవి పిలుపు 

మెలమెల్లన రేపెను వలపు

మమతను దాచిన మనసు 

ఒక మాధవునికే తెలుసు..

ఈ మాధవునికే తెలుసు


సుందరి అందెల పిలుపు

నా డెందమునందొక మెరుపు

నందకిశోరుని మనసు 

రతనాల బొమ్మకు తెలుసు...

ఈ రతనాల బొమ్మకు తెలుసు...


ఆ..ఆ..ఆ..ఆ...అహ..ఆ..అహ..ఆ..ఆ..ఆ

అహ..అహా...ఆ...అహ..అహా..ఆ... 


చరణం 1 :


వెన్న మీగడలు తిన్నావట... 

వెన్నెలలో ఆడుకున్నావటా...

వెన్న మీగడలు తిన్నావట... 

వెన్నెలలో ఆడుకున్నావటా...

ఎన్నో నేర్చిన వన్నెకాడవట...

ఏమందువో మరి నా మాట

ఏమందువో మరి నా మాట...


వెన్న మీగడలు తిన్నది నిజము...

ఎన్నో నేర్చితినన్నది నిజము

వెన్న మీగడలు తిన్నది నిజము...

ఎన్నో నేర్చితినన్నది నిజము

చిన్నారీ...ఈ.....చిన్నారీ! 

నీ కన్నుల బాసలు.. 

వెన్నుని దోచిన

ఆ మాట నిజము..

వెన్నుని దోచిన మాట నిజము... 


సుందరి అందెల పిలుపు... 

నా డెందము నందొక మెరుపు

ఓ..పిల్లనగ్రోవి పిలుపు... 

మెలమెల్లన రేపెను వలపు 


చరణం 2 :


అహ..ఆ..ఆహా..ఆ..అహా..ఆ


అందీ అందని అందగాడవని... 

ఎందరో అనగా విన్నాను

అందీ అందని అందగాడవని... 

ఎందరో అనగా విన్నాను

అందులోని పరమార్ధమేమిటో...

అలవోకగా కనుగొన్నాను... 

అలవోకగా కనుగొన్నాను...

ఆ..ఆహా..ఆ..అహా...ఆ...ఆ...


ఎంత బేలవని అనుకున్నాను... 

అంత గడసరి తరుణివిలే

ఎంత బేలవని అనుకున్నాను... 

అంత గడసరి తరుణివిలే

అష్ట భార్యలతో అలరే రాజును...

చెంగును ముడిచిన చెలువవులే... 

చెలువవులే చెంగలువవులే...


పిల్లనగ్రోవి పిలుపు... 

మెలమెల్లన రేపెను వలపు

మమతను దాచిన మనసు... 

ఒక మాధవునికే తెలుసు

ఈ మాధవునికే తెలుసు..


ఆ..ఆ..ఆ..ఆ...అహ..ఆ..అహ..ఆ..ఆ..ఆ

అహ..ఆ...ఆ...అహ..ఆ..అహ... 


- పాటల ధనుస్సు 

నీవైన చెప్పవే ఓ మురళీ | Neevaina Cheppave O Murali | Song Lyrics | Srikrishnanjaneya Yudham (1972)

నీవైన చెప్పవే ఓ మురళీ



చిత్రం :  శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం (1972)

సంగీతం : టి. వి. రాజు

గీతరచయిత : సి నారాయణ రెడ్డి,

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల


పల్లవి : 


నీవైన చెప్పవే ఓ మురళీ..

ఇక నీవైన చెప్పవే ప్రియమురళీ.. 

నీవైన చెప్పవే ఓ మురళీ

అడుగడుగున నా ప్రియభామినికి.. 

అలుక ఎందుకని.. ఎందుకని

నీవైన చెప్పవే ఓ మురళీ 


నీవైన చెప్పవే జాబిలీ..

ఇక నీవైన చెప్పవే ఓ జాబిలీ..  

నీవైన చెప్పవే జాబిలీ

తలబంతి ఎవరో.. పదదాసి ఎవరో

తెలుసుకొమ్మనీ.. పిదప రమ్మనీ.. 

నీవైన చెప్పవే జాబిలీ


చరణం 1 :


అలుకలోన నా చెలియ వదనము.. 

అరుణ కమలమై విరిసెననీ

అలుకలోన నా చెలియ వదనము.. 

అరుణ కమలమై విరిసెననీ

ఆ కమలములోని తేనియలానగ.. 

కమలములోని తేనియలానగ

నామది భ్రమరమై ఎగసెననీ.. 

నీవైన చెప్పవే ఓ మురళీ 


చరణం 2 :


కోటిపూలతో కులుకు తుమ్మెదకు.. 

ఈ తోటలో చొటులేదనీ

కోటిపూలతో కులుకు తుమ్మెదకు.. 

ఈ తోటలో చొటులేదనీ

మనసెరిగిన సత్యా విధేయునికే.. 

మనసెరిగిన సత్యా విధేయునికే

అనురాగ మధువు అందుననీ.. 

నీవైన చెప్పవే జాబిలీ


ఇక నీవైన చెప్పవే ఓ జాబిలీ.. 

నీవైన చెప్పవే జాబిలీ


- పాటల ధనుస్సు 

ప్రియురాల సిగ్గేలనే | Priyurala Siggelane | Song Lyrics | Srikrishna Pandaveeyam (1966)

ప్రియురాల సిగ్గేలనే



చిత్రం :  శ్రీకృష్ణ పాండవీయం (1966)

సంగీతం :  టి.వి. రాజు

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 


పల్లవి :


ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ.. 

ప్రియురాల సిగ్గేలనే

నీ మనసేలు మగవానిజేరి.. ఈ..ఈ..  

ప్రియురాల సిగ్గేలనే


నాలోన ఊహించినా..ఆ..ఆ.. 

నాలోన ఊహించినా

కలలీనాడు ఫలియించే స్వామి..ఈ..ఈ.. 

నాలోన ఊహించినా 


చరణం 1 :


ఏమి ఎరుగని గోపాలునికి.. 

ప్రేమలేవో నేరిపినావు

మనసు తీర పలుకరించి.. 

నా ముద్దు ముచ్చట చెల్లించవే


ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ.. 

ప్రియురాల సిగ్గేలనే


చరణం 2 :


ప్రేమలు తెలిసిన దేవుడవని విని.. 

నా మదిలోనా కొలిచితిని

స్వామివి నీవని తలచి నీకే.. 

బ్రతుకు కానుక చేసితిని


నాలోన ఊహించినా..ఆ..ఆ.. 

నాలోన ఊహించినా

కలలీనాడు ఫలియించే స్వామి..ఈ..ఈ.. 

నాలోన ఊహించినా..ఆ.. 


చరణం 3 :


సమయానికి తగు మాటలు నేర్చిన.. 

సరసురాలవే ఓ భామా

సమయానికి తగు మాటలు నేర్చిన.. 

సరసురాలవే ఓ భామా

ఇపుడేమన్నా ఒప్పునులే.. 

ఇక ఎవరేమన్నా తప్పదులే


ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ.. 

ప్రియురాల సిగ్గేలనే

నీ మనసేలు మగవానిజేరి..ఈ..ఈ.. 

ప్రియురాల సిగ్గేలనే


- పాటల ధనుస్సు 


1, నవంబర్ 2023, బుధవారం

అలిగితివా సఖీ ప్రియ | Aligithivaa Sakhee Priya | Song Lyrics | Srikrishnarjuna Yudham (1963)

అలిగితివా సఖీ ప్రియ



చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

సంగీతం :  పెండ్యాల

గీతరచయితలు : పింగళి, నంది తిమ్మన

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


అలిగితివా సఖీ ప్రియ కలత మానవా

అలిగితివా సఖీ ప్రియ కలత మానవా

ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా

అలిగితివా సఖీ ప్రియ కలత మానవా... 


చరణం 1 :


లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా

లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా

ఈ పరీక్ష మాని ఇంక దయనుజూడవా ...ఆ..ఆ...


అలిగితివా సఖీ ప్రియ కలత మానవా 


చరణం 2 :


నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని

నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని

సత్యాపతి నా బిరుదని నింద యెరుగవా...ఆ...ఆ..


అలిగితివా సఖీ ప్రియ కలత మానవా 


చరణం 3 : 


ప్రియురాలివి సరసనుండి 

విరహమిటుల విధింతువా

ఆ...ఆ...ఆ..ఆ...ఆ...ఆ...ఆ...

ప్రియురాలివి సరసనుండి 

విరహమిటుల విధింతువా

భరియింపగ నా తరమా కనికరింపవా..

ఆ...ఆ...ఆ.. 


నను  భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని తా

చిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మ

త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే

ననియెద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా!


పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు