RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
sri krishnarjuna yudham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sri krishnarjuna yudham లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, నవంబర్ 2023, బుధవారం

అన్ని మంచి శకునములే | Anni Manchi Sakunamule | Song Lyrics | Srikrishnarjuna Yudham (1963)

అన్ని మంచి శకునములే



చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత : పింగళి

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల  


పల్లవి :


అన్ని మంచి శకునములే 

కోరిక తీరే దీవెనెలే

అన్ని మంచి శకునములే 

కోరిక తీరే దీవెనెలే

మనసున మంగళవాద్యమాహా మోగెలే.... 


చరణం 1 :


నావలెనే నా బావ కుడా... 

నాకై తపములు చేయునులే..

తపము ఫలించి నను వరియించి..

తరుణములోనె బిరాళ నన్ను చేరునులే ...


అన్ని మంచి శకునములే 

కోరిక తీరే దీవెనెలే

మనసున మంగళవాద్యమాహా మ్రోగెలే... 


చరణం 2 :


అన్ని మంచి శకునములే 

కన్యాలాభ సూచనలే

అన్ని మంచి శకునములే 

కన్యాలాభ సూచనలే

మనసున మంగళవాద్యమాహా మోగెనులే


కుడికన్ను అదిరే... కుడిభుజమదిరే

కోరిన చెలి నను తలచనులే ....

చిరకాలముగా కాంచిన కలలు

నిజమౌ తరుణము వచ్చెనులే ...


అన్ని మంచి శకునములే 

కన్యాలాభ సూచనలే

మనసున మంగళవాద్యమాహా మోగెలే


చరణం 2 : 


మల్లెతోరణల మంటపమందె 

కనులు మనసులు కలియునులే...

కలసిన మనసుల కళరవళములతో.. 

జీవితమంతా వసంతగానమౌనులే...


అన్ని మంచి శకునములే 

కోరిక తీరే దీవెనెలే...

మనసున మంగళవాద్యమాహా మోగెలే..


పాటల ధనుస్సు 


అలిగితివా సఖీ ప్రియ | Aligithivaa Sakhee Priya | Song Lyrics | Srikrishnarjuna Yudham (1963)

అలిగితివా సఖీ ప్రియ



చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

సంగీతం :  పెండ్యాల

గీతరచయితలు : పింగళి, నంది తిమ్మన

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


అలిగితివా సఖీ ప్రియ కలత మానవా

అలిగితివా సఖీ ప్రియ కలత మానవా

ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా

అలిగితివా సఖీ ప్రియ కలత మానవా... 


చరణం 1 :


లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా

లేని తగవు నటింతువా మనసు తెలియ నెంచితివా

ఈ పరీక్ష మాని ఇంక దయనుజూడవా ...ఆ..ఆ...


అలిగితివా సఖీ ప్రియ కలత మానవా 


చరణం 2 :


నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని

నీవె నాకు ప్రాణమని నీయానతి మీరనని

సత్యాపతి నా బిరుదని నింద యెరుగవా...ఆ...ఆ..


అలిగితివా సఖీ ప్రియ కలత మానవా 


చరణం 3 : 


ప్రియురాలివి సరసనుండి 

విరహమిటుల విధింతువా

ఆ...ఆ...ఆ..ఆ...ఆ...ఆ...ఆ...

ప్రియురాలివి సరసనుండి 

విరహమిటుల విధింతువా

భరియింపగ నా తరమా కనికరింపవా..

ఆ...ఆ...ఆ.. 


నను  భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని తా

చిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మ

త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే

ననియెద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా!


పాటల ధనుస్సు  


31, అక్టోబర్ 2023, మంగళవారం

తపము ఫలించిన శుభవేళా | Tapamu Falinchina Shubhavela | Song Lyrics | Srikrishnarjuna Yudham (1963)

తపము ఫలించిన శుభవేళా



చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  పింగళి

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 



పల్లవి :


తపము ఫలించిన శుభవేళా.. 

బెదరగనేలా ప్రియురాలా

తపము ఫలించిన శుభవేళా.. 

బెదరగనేలా ప్రియురాలా

ఎదుట నిలువుమని మంత్రము వేసి 

చెదరగనేలా జవరాలా 

తపము ఫలించిన శుభవేళా 

బెదరగనేలా ప్రియురాలా


చరణం 1 :


తెలిమబ్బులలో జాబిలి వలెనే 

మేలిముసుగులో దాగెదవేలా

తెలిమబ్బులలో జాబిలి వలెనే 

మేలిముసుగులో దాగెదవేలా

వలచి వరించి.. మనసు హరించి.. 

నను దికురించగనేలా


తపము ఫలించిన శుభవేళా 

బెదరగనేలా ప్రియురాలా 


చరణం 2 :


చూపులతోనే పలుకరించుచూ.. 

చాటున వలపులు చిలకరించుచూ

చూపులతోనే పలుకరించుచూ.. 

చాటున వలపులు చిలకరించుచూ

కోరిక తీరే తరుణము రాగా 

తీరా ఇపుడీ జాగేలా


తపము ఫలించిన శుభవేళా.. 

బెదరగనేలా ప్రియురాలా


పాటల ధనుస్సు 


29, అక్టోబర్ 2023, ఆదివారం

నీకై వేచితినయ్యా | Neekai Vechitinayya | Song Lyrics | Srikrishnarjuna Yudham (1963)

నీకై వేచితినయ్యా



చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  పింగళి

నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :


నీకై వేచితినయ్యా... 

ఓ.. ఏకాంత రామయ్యా... ఆ..

నీకై కాచితినయ్యా...ఆ...ఆ..


నీకై వేచితినయ్యా... 

ఓ ఏకాంత రామయ్యా... ఆ..

నీకై కాచితినయ్యా...ఆ...ఆ..

నీకై కాచితినయ్యా... 



చరణం 1 :


నీవీ క్షణమున వచ్చెదవోయని... 

ఎదురులు చూచితినయ్యా..ఆ..

ఎదురులు చూచితినయ్యా....


నీవు నడతువని త్రోవ త్రోవల... 

పూవుల పరచితినయ్యా...


నీకై వేచితినయ్యా... 

ఓ ఏకాంత రామయ్యా..

నీకై కాచితినయ్యా...



చరణం 2 :


చిగురాకులలో గాలి కదిలినా.. 

నీవని భ్రమచితినయ్యా..ఆ...

నీవని భ్రమచితినయ్యా..

చిలుక పలికినా.. నీ పిలుపేయని... 

ఉలుకున కలగితినయ్యా...ఆ...


నీకై వేచితినయ్యా... 

ఓ ఏకాంత రామయ్యా..

నీకై కాచితినయ్యా...



చరణం 3 : 


నీకు ప్రియముగా విరిసిన పూవుల 

మాలికలల్లితినయ్యా..ఆ..

మాలికలల్లితినయ్యా...

మనసున నిలిచిన మంగళ రూపము.. 

ఎన్నడు చూచెదనయ్యా...ఆ..


నీకై వేచితినయ్యా... 

ఓ ఏకాంత రామయ్యా..ఆ

నీకై కాచితినయ్యా...ఆ...ఆ..

నీకై కాచితినయ్యా...


పాటల ధనుస్సు 


మనసు పరిమళించెనే | Manasu Parimalinchene | Song Lyrics | Srikrishnarjuna Yudham (1963)

మనసు పరిమళించెనే



చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  పింగళి

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 



పల్లవి :

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ.. 

మనసు పరిమళించెనే..  

తనువు పరవశించెనే

నవ వసంత గానముతో.. 

నీవు నటన సేయగనే


మనసు పరిమళించెనే..  

తనువు పరవశించెనే

నవ వసంత రాగముతో.. 

నీవు చెంత నిలువగనే 

మనసు పరిమళించెనే.. 

తనువు పరవశించెనే


చరణం 1 :


నీకు నాకు స్వాగతమనగా 

కోయిలమ్మ కూయగా

ఆ..... ఆ.... . ఆ..... ఆ....

నీకు నాకు స్వాగతమనగా 

కోయిలమ్మ కూయగా

గలగలగల సెలయేరులలో 

కలకలములు రేగగా 

మనసు పరిమళించెనే.. ఆ.. ఆ.. హా..

తనువు పరవశించెనే.. ఓ..ఓ..ఓ..

నవ వసంత గానముతో... 

నీవు చెంత నిలువగనే 


మనసు పరిమళించెనే... 

తనువు పరవశించెనే


చరణం 2 :


క్రొత్త పూల నెత్తావులతో 

మత్తుగాలి వీచగా

ఆహ .. ఆ . అ ఆ

క్రొత్త పూల నెత్తావులతో 

మత్తుగాలి వీచగా

భ్రమరమ్ములు గుములు గుములుగా...  

ఝుం ఝుమ్మని పాడగా 


మనసు పరిమళించెనే... 

తనువు పరవశించెనే


చరణం 3 : 


తెలి మబ్బులు కొండ కొనలపై 

హంసల వలె ఆడగా

అహా .. ఆ . అ.. ఆ

తెలి మబ్బులు కొండ కొనలపై 

హంసల వలె ఆడగా

రంగరంగ వైభవములతో 

ప్రకృతి విందు సేయగా


మనసు పరిమళించెనే...  

తనువు పరవశించెనే

నవ వసంత రాగముతో 

నీవు చెంత నిలువగనే

మనసు పరిమళించెనే... 

తనువు పరవశించెనే


పాటల ధనుస్సు 


27, అక్టోబర్ 2023, శుక్రవారం

స్వాముల సేవకు వేళాయె | Swamula Sevaku Velaye | Song Lyrics | Srikrishnarjuna Yudham (1963)

స్వాముల సేవకు వేళాయె



చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  పింగళి

నేపధ్య గానం :  సుశీల

 


పల్లవి :


స్వాముల సేవకు వేళాయె... 

వైళమె రారే చెలులారా

స్వాముల సేవకు వేళాయె.. 

వైళమె రారే చెలులారా

ఆశీర్వాదము లభించుగా... 

చేసే పూజలు ఫలించుగా..

స్వాముల సేవకు వేళాయె... 

వైళమె రారే చెలులారా 


చరణం 1 :


ఎన్ని తీర్థములు సేవించారో... 

ఎన్ని మహిమలను గణియించారో

విజయం చేసిరి మహానుభావులు... 

మన జీవితములు తరించుగా

స్వాముల సేవకు వేళాయె... 

వైళమె రారే చెలులారా 



చరణం 2 :


లీలాశుకులో.. ఋష్యశృంగులో... 

మన యతీంద్రులై వెలసిరిగా

ఏమి పూజలో.. ఏమి ధ్యానమో.. 

మన లోకములో ఉండరుగా

స్వాముల సేవకు వేళాయె... 

వైళమె రారే చెలులారా



చరణం 3 :


ఏయే వేళలకేమి ప్రియములో... 

ఆ వేళలకవి జరుపవలె

సవ్వడి చేయక... సందడి చేయక... 

భయభక్తులతో మెలగవలె

స్వాముల సేవకు వేళాయె... 

వైళమె రారే చెలులారా


పాటల ధనుస్సు 


6, అక్టోబర్ 2023, శుక్రవారం

చాలదా ఈ పూజ దేవి | Chaladaa Ee Puja Devi | Song Lyrics | Sri Krishnarjuna Yudham (1963)

చాలదా ఈ పూజ దేవి



చిత్రం :  శ్రీకృష్ణార్జునయుద్ధం (1963)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  పింగళి

నేపధ్య గానం :  ఘంటసాల



పల్లవి :


చాలదా ఈ పూజ దేవి... 

చాలదా ఈ కొలువు దేవి...

నీ భక్తునింత నిరాదరణ చేయనేలా...ఆ..

చాలదా ఈ పూజ దేవీ ....


చరణం 1 :


నీ వాలు చూపులే... నా ప్రాణము...

నీ మందహాసమే... నా జీవము...


తపము జపము చేసి అలసి సొలసి పోతినే...

ఇక కనికరించి ఈ బాధను బాపవేలా.....ఆ...

చాలదా ఈ పూజ దేవి... 

చాలదా ఈ కొలువు దేవి...


చరణం 2 :


నీ అందెల గలగలలే... ప్రణవ నాదము

నీ కంకణ రవళియే... ప్రణయ గీతము


నీ కటాక్ష వీక్షణమే నాకు మోక్షము...

కరుణజూపి ఈ దీనుని కావవేలా.. ఆ..


చాలదా ఈ పూజ దేవీ... 

చాలదా ఈ కొలువు దేవీ


చరణం 3 :


నీవులేని నిముషాలే యుగములాయెనే

చెంతనుండి మాటలేని యోగమాయెనే


వరము కోరి ఈ చెరలో చిక్కుబడితినే...

జాలి దలిచి ముక్తి నొసగ జాలమేలా...ఆ..ఆ..


చాలదా ఈ పూజ దేవీ... 

చాలదా ఈ కొలువు దేవీ

నీ భక్తునింత నిరాదరణ చేయనేలా.. ఆ...

చాలదా ఈ పూజ దేవీ...


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు