పిల్లనగ్రోవి పిలుపు
చిత్రం : శ్రీకృష్ణ విజయం (1970)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
పిల్లనగ్రోవి పిలుపు
మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు
ఒక మాధవునికే తెలుసు..
ఈ మాధవునికే తెలుసు
సుందరి అందెల పిలుపు
నా డెందమునందొక మెరుపు
నందకిశోరుని మనసు
రతనాల బొమ్మకు తెలుసు...
ఈ రతనాల బొమ్మకు తెలుసు...
ఆ..ఆ..ఆ..ఆ...అహ..ఆ..అహ..ఆ..ఆ..ఆ
అహ..అహా...ఆ...అహ..అహా..ఆ...
చరణం 1 :
వెన్న మీగడలు తిన్నావట...
వెన్నెలలో ఆడుకున్నావటా...
వెన్న మీగడలు తిన్నావట...
వెన్నెలలో ఆడుకున్నావటా...
ఎన్నో నేర్చిన వన్నెకాడవట...
ఏమందువో మరి నా మాట
ఏమందువో మరి నా మాట...
వెన్న మీగడలు తిన్నది నిజము...
ఎన్నో నేర్చితినన్నది నిజము
వెన్న మీగడలు తిన్నది నిజము...
ఎన్నో నేర్చితినన్నది నిజము
చిన్నారీ...ఈ.....చిన్నారీ!
నీ కన్నుల బాసలు..
వెన్నుని దోచిన
ఆ మాట నిజము..
వెన్నుని దోచిన మాట నిజము...
సుందరి అందెల పిలుపు...
నా డెందము నందొక మెరుపు
ఓ..పిల్లనగ్రోవి పిలుపు...
మెలమెల్లన రేపెను వలపు
చరణం 2 :
అహ..ఆ..ఆహా..ఆ..అహా..ఆ
అందీ అందని అందగాడవని...
ఎందరో అనగా విన్నాను
అందీ అందని అందగాడవని...
ఎందరో అనగా విన్నాను
అందులోని పరమార్ధమేమిటో...
అలవోకగా కనుగొన్నాను...
అలవోకగా కనుగొన్నాను...
ఆ..ఆహా..ఆ..అహా...ఆ...ఆ...
ఎంత బేలవని అనుకున్నాను...
అంత గడసరి తరుణివిలే
ఎంత బేలవని అనుకున్నాను...
అంత గడసరి తరుణివిలే
అష్ట భార్యలతో అలరే రాజును...
చెంగును ముడిచిన చెలువవులే...
చెలువవులే చెంగలువవులే...
పిల్లనగ్రోవి పిలుపు...
మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు...
ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు..
ఆ..ఆ..ఆ..ఆ...అహ..ఆ..అహ..ఆ..ఆ..ఆ
అహ..ఆ...ఆ...అహ..ఆ..అహ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి