RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

21, ఆగస్టు 2024, బుధవారం

బోలో కృష్ణ ముకుంద | Bolo Krishna Mukunda | Song Lyrics | Amma Donga (1995)

బోలో కృష్ణ ముకుంద 



చిత్రం - అమ్మ దొంగా (1995 )

సాహిత్యం - వేటూరి  

సంగీతం - కోటి,

గానం  : బాలు , చిత్ర, 


పల్లవి: 


తక్క దిన్న తక్కా దిన్న 

తక్క దిన్న తక్కా దిన్న 


తకా తక్కా దిన్న

తకా తక్కా దిన్న 


బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద

వేణువిలా వాయించారా

ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద

వెన్నెలలా తేలించరా

ఒక బేబీ భామ పోరాటం

ఇది అల్లరి చిల్లరి తిమ్మిరి 

తిక్కల లవ్ బుల్లిరో

అది చుక్కల గాలికి మొక్కిన 

చక్కని జాబిల్లిరో


బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద

వేణువిలా వాయించారా

ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద

వెన్నెలలా తేలించరా


చరణం 1 :


వెన్నెట్లో నేను వేడెక్కితే 

ముద్దు తేనెల్లో నన్ను ముంచెత్తరా

చిగ్గంటు లేక చలరేగితే 

ఉగ్గు పాలిచ్చి జోల పాడేయన

పొద్దు పోదోయ్ నాకు హద్దులేదోయ్ నీకు

ఆడదే అరిటాకు ముళ్ళు నే కానీకు

పడగెత్తిన పరువానికి అలవాటు

తొడగొట్టిన మహవీరుడి తొలిపాటు

ఇక చూడు మరి చూపు 

మరి పిల్ల కిదే ఫిబ్రవరి

చలి గిలి భళా భళిరో


బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద

వేణువిలా వాయించారా

ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద

వెన్నెలలా తేలించరా


చరణం 2 :


నీ వేణు గానం విన్నప్పుడే 

నే రాధల్లె ఊగి పోయానులే

నీ ముగ ప్రేమ కన్నప్పుడే 

పారిజాతాబిషేకం చేశానులే

కన్నె వయసోయ్ నాది 

తేనే మనసోయ్ నీది

అందమే తాంబూలం పండని నాకోసం

విసుగెత్తిన విరహానికి విడిచేసి 

మారుమల్లెకు మరుజన్మకు వదిలేసి

ఇదే సత్యమని స్వప్నమని 

బంధమని పాశమని రచించని కధాకలిలో


బోలో కృష్ణ ముకుంద కిస్సే కిస్కింద

వేణువిలా వాయించారా

ప్రియా రాధా గోవిందా ప్రేమారవింద

వెన్నెలలా తేలించరా

ఒక బేబీ భామ పోరాటం

ఇది అల్లరి చిల్లరి తిమ్మిరి 

తిక్కల లవ్ బుల్లిరో

అది చుక్కల గాలికి మొక్కిన 

చక్కని జాబిల్లిరో


- పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు