RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, ఆగస్టు 2024, శనివారం

మమతే మధురం | Mamathe Madhuram | Song Lyrics | Neerajanam (1988)

మమతే మధురం



చిత్రం:  నీరాజనం (1988)

సంగీతం:  ఓ.పి. నయ్యర్

గీతరచయిత:  రాజశ్రీ

నేపధ్య గానం:  బాలు



పల్లవి:


మమతే మధురం మమతే మధురం

మరపే శిశిరం ఎదకూ విధికీ

జరిగే సమరం జరిగే సమరం

మమతే మధురం మమతే మధురం

మరపే శిశిరం ఎదకూ విధికీ

జరిగే సమరం జరిగే సమరం


చరణం 1:


మనిషికి వలపే వరమా

మది వలపుకు వగపే ఫలమా

మనిషికి వలపే వరమా

మది వలపుకు వగపే ఫలమా

అది పాపమా విధి శాపమా

అది పాపమా విధి శాపమా

ఎద ఉంటె అది నేరమా


మమతే మధురం మమతే మధురం

మరపే శిశిరం ఎదకూ విధికీ

జరిగే సమరం జరిగే సమరం


చరణం 2:


గుండెల దాటని మాట

ఎద పిండిన తీయని పాటా

గుండెల దాటని మాట

ఎద పిండిన తీయని పాటా

చరణాలుగా కరుణించునా

చరణాలుగా కరుణించునా

పల్లవిగ మరపించునా


మమతే మధురం మమతే మధురం

మరపే శిశిరం ఎదకూ విధికీ

జరిగే సమరం జరిగే సమరం

మమతే మధురం మమతే మధురం


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు