నీలాల కన్నులో మెల్ల మెల్లగా
చిత్రం: నాటకాల రాయుడు (1969)
సంగీతం: జి.కె. వెంకటేశ్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల
పల్లవి:
నీలాల కన్నులో మెల్ల మెల్లగా
నిదుర రావమ్మ రావే నిండారా రావే
నెలవంక చలువ్వల్లు వెదజల్లగా
నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే
నీలాల కన్నులో మెల్ల మెల్లగా
నిదుర రావమ్మ రావే నిండారా రావే
చరణం 1:
చిరుగాలి బాల పాడింది జోల
పాడిందీ జోల
చిగురాకు మనసు కనుపాపలందు
ఎగపోసేనమ్మ ఏవేవో కలలు
కలలన్ని కళలెన్నో విరబూయగా
నిదుర రావమ్మా రావే నెమ్మదిగా రావే
నీలాల కన్నులో మెల్ల మెల్లగా
నిదుర రావమ్మా రావే నిండార రావే
చరణం 2:
నిదురమ్మ ఒడిలో ఒరిగింది రేయి
ఊగింది లాలి
గగనాని చూచి ఒక కన్ను దోయి
వినిపించమంది ఎన్నెన్నో కతలు
కత చెప్పి మురిపించి మరపించగా
నిదుర రావమ్మ రావే నెమ్మదిగా రావే
నీలాల కన్నులో మెల్ల మెల్లగా నిదుర
రావమ్మా రావే నిండారా రావే
నెలవంక చలువ్వల్లు వెదజల్లగా
నిదుర రావమ్మా రావే నెమ్మదిగా రావే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి