నీతో సాయంత్రం ఎంతో సంతోషం
చిత్రం - అమ్మ దొంగా (1995 )
సాహిత్యం - వేటూరి
సంగీతం - కోటి,
గానం : బాలు , చిత్ర, SP శైలజ
పల్లవి:
నీతో సాయంత్రం ఎంతో సంతోషం
చేసేయి నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం
చూసేయ్ నా వాలకం
ఓయమ్మో ఒపేరాల గమ్మో
ఒళ్ళంతా తిమ్మిరాయనమ్మో
బావయ్యో బంతులాడవయ్యా
ఈ రాత్రే సంకురాతిరయ్యే
ఇదో రకం స్వయంవరం
త్రియంబకం ప్రియం ప్రియం
ఓ హోం హోం హోం
హోం హోం హోం
హోం హోం హోం
హోం హోం హోం
నీతో సాయంత్రం ఎంతో సంతోషం
చేసేయి నీ సంతకం
చరణం 1 :
నీ జంట కోరే సాయంత్రము
నా ఒంటి పేరే సౌందర్యము
మామిళ్ళకొస్తే ఓ ఆమని
కౌగిళ్ళకిచ్ఛా నా ప్రేమని
ఆ రాధాగోలేమో రాగం తీసే
ఈ రాసలీలేమో ప్రాణం తీసే
దరువే ఆనందం అయినా
పరువే గోవిందం
యమగున్న ఇతగాడే
బహు కొంటె జతగాడు
చలి చుక్కల గిలిగింతకు
పులకింతకు నిను పిలిచేలా
కొంగే బంగారం పొంగే సింగారం
చూసేయ్ నా వాలకం
నీతో సాయంత్రం ఎంతో సంతోషం
చేసేయి నీ సంతకం
చరణం 2 :
మేనత్త కొడుకా ఇది మేనకా
మరుగుమ్మ కోసం పరుగెత్తక
ఊహల్లో ఉంటె నీ ఊర్వశి
నీకెందుకంటా ఈ రాక్షసి
మీ కళ్ళలో మాయ మస్కా కొట్టి
నేనెల్లనా గాలి జట్కా ఎక్కి
అదిగో ఆకాశం
తారాసఖితో సావాసం
మనఇద్దరి కసిముద్దులా
రసమద్దెల వింతే
నిద్రొయినా తొలిజన్మల
సోదలిప్పుడు పొదలడిగేలే
నీతో సాయంత్రం ఎంతో సంతోషం
చేసేయి నీ సంతకం
కొంగే బంగారం పొంగే సింగారం
చూసేయ్ నా వాలకం
ఓయమ్మో ఒపేరాల గమ్మో
ఒళ్ళంతా తిమ్మిరాయనమ్మో
బావయ్యో బంతులాడవయ్యా
ఈ రాత్రే సంకురాతిరయ్యే
ఇదో రకం స్వయంవరం
త్రియంబకం ప్రియం ప్రియం
ఓ హోం హోం హోం
హోం హోం హోం
హా హా హా హా హా హా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి