RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, ఆగస్టు 2024, మంగళవారం

నీకూ నాకూ పెళ్ళంటె | Neeku Naaku Pellante | Song Lyrics | Dora Babu (1974)

నీకూ నాకూ పెళ్ళంటె



చిత్రం :  దొరబాబు (1974)

సంగీతం : జె.వి. రాఘవులు

గీతరచయిత : ఆంజనేయశాస్త్రి

నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల


పల్లవి :


నీకూ నాకూ పెళ్ళంటె.. 

నింగి నేలా మురిశాయీ

వయసూ సొగసూ కలిబోసి 

రంగవల్లి వేశాయీ


నీకూ నాకూ పెళ్ళంటె..  

నింగి నేలా మురిశాయీ

వయసూ సొగసూ కలిబోసి 

రంగవల్లి వేశాయీ


నీకూ నాకూ పెళ్ళంటె..  

నింగి నేలా మురిశాయీ 


చరణం 1 :


కొత్త కొత్త కోరికలేవో 

నాలో చెలరేగాయీ..  

కౌగిలిలో బంధిస్తేనే 

కలత నిదురపోతాయీ

కొత్త కొత్త కోరికలేవో 

నాలో చెలరేగాయీ.. 

కౌగిలిలో బంధిస్తేనే 

కలత నిదురపోతాయీ


తెలిసింది నీ ఎత్తూ.. 

ఆ ఎత్తే గమ్మత్తూ

తెలిసింది నీ ఎత్తూ..  

ఆ ఎత్తే గమ్మత్తూ

సందెలో విందులా.. 

విందులో..  పొందులా  

అలా.. అలా.. అలా.. అలా.. అలా


నీకూ నాకూ పెళ్ళంటె..  

నింగి నేలా మురిశాయీ

వయసూ సొగసూ కలిబోసి 

రంగవల్లి వేశాయీ


నీకూ నాకూ పెళ్ళంటె..  

నింగి నేలా మురిశాయీ 


చరణం 2 :


ఏడడుగులు నడిచావంటే . . 

ఎండ మొహం చూడనీయను

వలపు జల్లు తడిసిన ఒళ్ళూ 

ఎక్కడ ఆరేసుకోను

ఏడడుగులు నడిచావంటే . . 

ఎండ మొహం చూడనీయను

వలపు జల్లు తడిసిన ఒళ్ళూ 

ఎక్కడ ఆరేసుకోను 


నాలోనే వేడుందీ.. 

నీ ధోరణి బావుంది

నాలోనే వేడుందీ.. 

నీ ధోరణి బావుంది


ఎండలో.. వానలా.. 

వానలో.. హాయిలా  

అలా.. అలా.. అలా.. అలా.. అలా   

   

నీకూ నాకూ పెళ్ళంటె.. 

నింగి నేలా మురిశాయీ

వయసూ సొగసూ కలిబోసి 

రంగవల్లి వేశాయీ


నీకూ నాకూ పెళ్ళంటె.. 

నింగి నేలా మురిశాయీ 


చరణం 3 :


మూడు ముళ్ళూ వేయకముందే..  

నన్నల్లరి చెయ్యొద్దూ

ఇల్లాలివి కావాలంటే 

ఇవ్వాలి తొలిముద్దూ


ఏమిటి ఈ చిలిపితనం.. 

అంతేలే కుర్రతనం

పూవులో.. తేటిలా.. తేటిలో.. పాటలా  

అలా.. అలా.. అలా.. అలా.. అలా    


నీకూ నాకూ పెళ్ళంటె.. 

నింగి నేలా మురిశాయీ

వయసూ సొగసూ కలిబోసి 

రంగవల్లి వేశాయీ


నీకూ నాకూ పెళ్ళంటె..  

నింగి నేలా మురిశాయీ  


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు