నీ కన్నులలో నే చూశానులే
చిత్రం : బంగారు కలలు (1974)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల, రామకృష్ణ
పల్లవి :
నీ కన్నులలో నే చూశానులే..
నీ కన్నులలో నే చూశానులే..
అది నా రూపమే
అందుకనే యిద్దరిదీ వీడని బంధం..
ఈ అనుబంధం
నా హృదయంలో నే దాచానులే..
అది నీ రూపమే
అందుకనే యిద్దరిదీ వీడని బంధం..
ఈ అనుబంధం
చరణం 1 :
పున్నమి వెన్నెలలో కన్నులు కలిపావూ..
చిటపట చినుకులలో చెంతకు చేరావూ
పున్నమి వెన్నెలలో కన్నులు కలిపావూ..
చిటపట చినుకులలో చెంతకు చేరావూ
చలి చలి గాలులలో వలపులు రేపావు
అందుకనే తొందరగా మెడలో తాళి..
మెరిపించాలి
నా హృదయంలో నే దాచానులే..
అది నీ రూపమే
అందుకనే యిద్దరిదీ వీడని బంధం..
ఈ అనుబంధం
చరణం 2 :
అల్లరి చూపులతో ఆశలు పెంచావూ..
చల్లని మాటలతో మల్లెలు చల్లావూ
అల్లరి చూపులతో ఆశలు పెంచావూ..
చల్లని మాటలతో మల్లెలు చల్లావూ
తీయని నవ్వులతో తేనెలు చిందావూ
అందుకనే తొందరగా.. ఆలూ మగలం..
అయితే అందం
నీ కన్నులలో నే చూశానులే..
అది నా రూపమే
అందుకనే యిద్దరిదీ వీడని బంధం..
ఈ అనుబంధం
నా హృదయంలో నే దాచానులే..
అది నీ రూపమే
అందుకనే యిద్దరిదీ వీడని బంధం..
ఈ అనుబంధం
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి