RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, ఆగస్టు 2024, గురువారం

కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను | Korukunnanu Ninne Cherukunnanu | Song Lyrics | Magadu (1976)

కోరుకున్నాను నిన్నే చేరుకున్నాను



చిత్రం :  మగాడు (1976)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను

నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను


కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను

నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను


ఏనాడో నేను నీదాన్నీ ...

నీ హృదయానికి అనువాదాన్ని

హూ....హూ..హూ..

కోరుకున్నాను.. నిన్నే చేరుకున్నాను

నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను


చరణం 1:


ఇంత మంచి తరుణం ఇంకెందుకూ... 

కవ్వింత సొగసు కాజేసేటందుకు

ఇంత మంచి తరుణం ఇంకెందుకూ... 

కవ్వింత సొగసు కాజేసేటందుకు

ఇంత పొంగు పరువం నీకెందుకు.. 

ఇంత పొంగు పరువం నీకెందుకు

కౌగిలింతలో కమ్మేసేటందుకు.. ఊ.. ఊ...


ఆరడుగుల వాడివే...ఆరిపోని వేడివే...

మంచులా.. మౌనిలా ..మాటాడకున్నావేం?

మంచులా.. మౌనిలా.. మాటాడకున్నావేం?


కోరుకున్నాను..నిన్నే చేరుకున్నాను

నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను


చరణం 2:


తొలి పొద్దుపొడిచింది ఇప్పుడే.. 

నీకు తుది ఝాము కావాలా అప్పుడే

తొలి పొద్దుపొడిచింది ఇప్పుడే.. 

నీకు తుది ఝాము కావాలా అప్పుడే

తలపు రేకు విప్పింది ఇప్పుడే... 

తలపు రేకు విప్పింది ఇప్పుడే

మరి వలపు పంట పండాలా అప్పుడే.. ఊ... ఊ...


ఆకు మాటు పిందెవే ... అరుగు దిగని పాపవే...

చింతలు.. వంతలు.. నీకేమి తెలుసునులే?

చింతలు.. వంతలు.. నీకేమి తెలుసునులే?


కోరుకున్నాను... నిన్నే చేరుకున్నాను...

ఆ రోజు రానీ అని ఊరుకున్నాను...

కోరుకున్నాను... నిన్నే చేరుకున్నాను...

ఆ రోజు రానీ అని ఊరుకున్నాను...

ఏనాడో నేను నీవాణ్ణి ... 

నీ హృదయానికి అనువాదాన్ని..హూ..హూ....


కోరుకున్నాను... హ..హ..హ..

నిన్నే చేరుకున్నాను...హ..హ..హ..

నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను... 

ఆ రోజు రానీ అని ఊరుకున్నాను

హూ..హూ.. హూ..హూ..


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు