నేలమీది జాబిలి నింగిలోని సిరిమల్లి
చిత్రం : రాజా రమేష్ (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
నేలమీది జాబిలి నింగిలోని సిరిమల్లి
నా చెలీ నెచ్చెలీ చేరుకోరావా నా కౌగిలి
నేలమీది జాబిలి నింగిలోని సిరిమల్లి
నా చెలీ నెచ్చెలీ చేరుకోరావా నా కౌగిలి
నేలమీది జాబిలి...
చరణం 1:
పిలిచెను కౌగిలింత రమ్మనీ...
ఇమిడిపోమ్మనీ
తెలిసెను పులకరింత ఇమ్మనీ..
దోచి ఇమ్మనీ...
మనసుకు వయసు వచ్చు
తీయనీ రేయినీ
ఆ...ఆ...ఆ...
వయసుకు మతిపోయి పోందనీ హాయినీ
తొలి ముద్దు ఇవ్వనీ..మరుముద్దు పొసగనీ
మలి ముద్దు ఏదనీ..మైమరచి.. అడగనీ
నేలమీది జాబిలి...నింగిలోని సిరిమల్లి...
నా చెలీ నెచ్చెలీ చేరుకోరావా నా కౌగిలి ఈ..ఈ..
నేలమీది జాబిలి...
చరణం 2:
వెన్నెల తెల్లబోయి తగ్గనీ తనకు సిగ్గనీ
కన్నులు సిగ్గుమానీ మొగ్గనీ కలలు నెగ్గనీ
తరచిన మల్లెలు ఫక్కుమనీ ..
నవ్వనీ..
పగటికి చోటివ్వక ఉండనీ..
రాత్రినీ..
దీపాలు మలగనీ ఆ తాపాలు పెరగనీ...ఆ..
రేపన్న దానినీ ఈ పూటే చూడనీ...
నేలమీది జాబిలి నింగిలోని సిరిమల్లి...
నా చెలీ నెచ్చెలీ చేరుకోరావా నా కౌగిలి...ఈ..ఈ..
నేలమీది జాబిలి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి