ఏదో మనసు పడ్డాను గానీ
చిత్రం - అమ్మ దొంగా (1995 )
సాహిత్యం - వేటూరి
సంగీతం - కోటి,
గానం - మనో, చిత్ర, SP శైలజ
పల్లవి:
ఏదో మనసు పడ్డాను గానీ
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఏదో మనసు పడ్డాను గానీ
ఎంతో అలుసు అయ్యాను గని
నాపై ప్రేమో ఏమో బోలో
రావా పడుచు మది
తెలుసుకొన లెవా
తపనపడు తనువు ముడి
మనువై మమతాయి
మనదయి పోయే
అనురాగాల కలమే
ఏదో మనసు పడ్డాను గని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
చరణం 1 :
ఒక హృదయం పలికినది
జాతకోరే
జాతులు శ్రుతులు కలిపి
ఒక పరువం పిలిచింది ప్రేమించి
ఒక అందం మెరిసినది
ఎదలోనే చిలిపి వలపు చిలికి
ఒక బంధం బిగిసినది వేధించి
తెలుసా యేటి మానస పూల
వయసెమంటుందో
తెలిసి చంటి మనసే కంటి
నలుసై పోతుందో
ఓ భామ రమ్మంటే
ఈ ప్రేమ బాధే సరి
మెడవురి గడసరి సరి సరిలే
ఏదో మనసు పడ్డాను గని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
చరణం 2:
ఒక మురిపం ముదిరినది
మొగమాటం మరిచి ఎదుట నిలిచి
ఒక ఆదరం వొణికినది ఆశించి
ఒక మౌనం తెలిసినది
నిదురించే కళలు కనుల నిలిపి
ఒకరూపం అలిగినది వాదించి
బహుశా భావ సరసాలన్నీ
విరసాలౌను ఏమో
ఇక సాగించు జత సాగించు
మనసే ఉన్నదేమో
ఓ పాప నిందిస్తే
ఆ పాపం నాదే మరి
విధిమారి విషమని మరి తెలిసే
ఏదో మనసు పడ్డాను గని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఏదో మనసు పడ్డాను గని
ఎంతో అలుసు అయ్యాను గని
నాపై ప్రేమో ఏమో బోలో
రావా పడుచు మాది
తెలుసుకొన లెవా
తపనపడు తనువు ముడి
మనువై మమతాయి
మనదయి పోయే
అనురాగాల కలమే
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి