RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
sridevi movie songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sridevi movie songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, అక్టోబర్ 2026, ఆదివారం

చిరుగాలే వింజామర | Chirugale Vinjamara | Song Lyrics | Sridevi (1970)

చిరుగాలే వింజామర 


చిత్రం :  శ్రీదేవి (1970)

సంగీతం :  జి.కె. వెంకటేశ్

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  ఎస్ పి బాలు, పి సుశీల


పల్లవి :


చిరుగాలే వింజామర.. 

చిట్టిపపే కెందామర..

చిలకమ్మా .. ఆ... పాడింది..

చెవిలో జోల... జోజో బాల...


చిరుగాలే వింజామర...


చరణం 1 :


మా ఇంట వెలసింది శ్రీదేవి...

మా ఇంట వెలసింది శ్రీదేవి...

తాను మౌనాన తెరచింది కెమ్మౌవి..

రతనాల నవ్వులే కురిశాయి..

రంగారు మురిపాలే మెరిశాయి...


చిరుగాలే వింజామర... 

చిట్టిపాపే కెందామర..

చిలకమ్మా ..ఆ... పాడింది..

చెవిలో జోల... జోజో బాల...


చరణం 2 :


నిదురలో పాపాయి పలవింతలు...

అవి ఎదలోన తల్లికి పులకింతలు..

నిదురలో పాపాయి పలవింతలు...

అవి ఎదలోన తల్లికి పులకింతలు..


ఆ తల్లిలో మధుర భావనలు

అందాల పాపకి దీవెనలు

చిరుగాలే వింజామర...


చరణం 3 :


ఉయ్యాలలో బోమ్మ నీ తమ్ముడే..

నీ ఊహ పండించు ఆ దేవుడే...

కోరికల తోటలా చిగురింతలు..

అవి కుసుమించు 

దినదినం వేయింతలు...


చిరుగాలే వింజామర...

చిట్టిపాప కెందామర

చిలకమ్మా పాడింది...

చెవిలో జోల ..జో..జో ..బాల


- పాటల ధనుస్సు


రాశాను ప్రేమలేఖలెన్నో | Rasanu Premalekhalenno | Song Lyrics | Sridevi (1970)

రాశాను ప్రేమలేఖలెన్నో 


చిత్రం :  శ్రీదేవి (1970)

సంగీతం :  జి.కె. వెంకటేశ్

గీతరచయిత :  దాశరథి

నేపథ్య గానం :  ఎస్ పి బాలు,  ఎస్ జానకి.


పల్లవి :


రాశాను ప్రేమలేఖలెన్నో... 

దాచాను ఆశలన్ని నీలో

భువిలోన మల్లియలాయే... 

దివిలోన తారకలాయే 

నీ నవ్వులే

 

రాశాను ప్రేమలేఖలెన్నో...  

దాచాను ఆశలన్ని నీలో

భువిలోన మల్లియలాయే...  

దివిలోన తారకలాయే 

నీ నవ్వులే


చరణం 1 :


కొమ్మల్లో కోయిలమ్మా.. 

కోయన్నది

కొమ్మల్లో కోయిలమ్మా 

కోయన్నది... 

నా మనసు నిన్నే తలచీ 

ఓయన్నదీ

మురిపించే ముద్దు గులాబి 

మొగ్గేసింది... 

చిన్నారి చెక్కిలికేమో 

సిగ్గేసింది

  

రాశాను ప్రేమలేఖలెన్నో...  

దాచాను ఆశలన్ని నీలో

భువిలోన మల్లియలాయే...  

దివిలోన తారకలాయే 

నీ నవ్వులే


చరణం 2 :


ఆ... ఆ... ఆ... ఆ...


నీ అడుగుల సవ్వడి ఉందీ 

నా గుండెలో...  ఊహూ..

నీ చల్లని రూపం ఉందీ 

నా కనులలో...  హా

నాలోని సోయగమంతా 

విరబూసెలే...

నాలోని సోయగమంతా 

విరబూసెలే... 

మనకోసం స్వర్గాలన్నీ 

దిగివచ్చెనులే

  

రాశాను ప్రేమలేఖలెన్నో...  

దాచాను ఆశలన్ని నీలో

భువిలోన మల్లియలాయే...  

దివిలోన తారకలాయే 

నీ నవ్వులే


చరణం 3 :


ఊ..ఊ..ఊ..ఊ...ఊ... ఆ... ఆ...

అందాలా పయ్యెద నేనై 

ఆటాడనా... ఆ.....

కురులందు కుసుమం నేనై 

చెలరేగనా.... ఆ....

నీ చేతుల వీణను నేనై 

పాట పాడనా... 

నీ పెదవుల గుసగుస నేనై 

పొంగిపోదునా


రాశాను ప్రేమలేఖలెన్నో...  

దాచాను ఆశలన్ని నీలో


ఆ.... ఆ.... ఆ.... ఆ.... ఆ......


- పాటల ధనుస్సు


పాటల ధనుస్సు పాపులర్ పాట

చిరుగాలే వింజామర | Chirugale Vinjamara | Song Lyrics | Sridevi (1970)

చిరుగాలే వింజామర  చిత్రం :  శ్రీదేవి (1970) సంగీతం :  జి.కె. వెంకటేశ్ గీతరచయిత :  ఆరుద్ర నేపధ్య గానం :  ఎస్ పి బాలు, పి సుశీల పల్లవి : చిరుగ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు