RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
chirugale vinjamara లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
chirugale vinjamara లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, అక్టోబర్ 2026, ఆదివారం

చిరుగాలే వింజామర | Chirugale Vinjamara | Song Lyrics | Sridevi (1970)

చిరుగాలే వింజామర 


చిత్రం :  శ్రీదేవి (1970)

సంగీతం :  జి.కె. వెంకటేశ్

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  ఎస్ పి బాలు, పి సుశీల


పల్లవి :


చిరుగాలే వింజామర.. 

చిట్టిపపే కెందామర..

చిలకమ్మా .. ఆ... పాడింది..

చెవిలో జోల... జోజో బాల...


చిరుగాలే వింజామర...


చరణం 1 :


మా ఇంట వెలసింది శ్రీదేవి...

మా ఇంట వెలసింది శ్రీదేవి...

తాను మౌనాన తెరచింది కెమ్మౌవి..

రతనాల నవ్వులే కురిశాయి..

రంగారు మురిపాలే మెరిశాయి...


చిరుగాలే వింజామర... 

చిట్టిపాపే కెందామర..

చిలకమ్మా ..ఆ... పాడింది..

చెవిలో జోల... జోజో బాల...


చరణం 2 :


నిదురలో పాపాయి పలవింతలు...

అవి ఎదలోన తల్లికి పులకింతలు..

నిదురలో పాపాయి పలవింతలు...

అవి ఎదలోన తల్లికి పులకింతలు..


ఆ తల్లిలో మధుర భావనలు

అందాల పాపకి దీవెనలు

చిరుగాలే వింజామర...


చరణం 3 :


ఉయ్యాలలో బోమ్మ నీ తమ్ముడే..

నీ ఊహ పండించు ఆ దేవుడే...

కోరికల తోటలా చిగురింతలు..

అవి కుసుమించు 

దినదినం వేయింతలు...


చిరుగాలే వింజామర...

చిట్టిపాప కెందామర

చిలకమ్మా పాడింది...

చెవిలో జోల ..జో..జో ..బాల


- పాటల ధనుస్సు


పాటల ధనుస్సు పాపులర్ పాట

చిరుగాలే వింజామర | Chirugale Vinjamara | Song Lyrics | Sridevi (1970)

చిరుగాలే వింజామర  చిత్రం :  శ్రీదేవి (1970) సంగీతం :  జి.కె. వెంకటేశ్ గీతరచయిత :  ఆరుద్ర నేపధ్య గానం :  ఎస్ పి బాలు, పి సుశీల పల్లవి : చిరుగ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు