అమ్మమమ్మో తెలిసిందిలే
చిత్రం : లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
అమ్మమమ్మో తెలిసిందిలే..
గుట్టు తెలిసిందిలే
నీ రూపులలోన.. నీ చూపులోన
ఏ రాచకళలో మెరిసేనని
అమ్మమమ్మో తెలిసిందిలే..
గుట్టు తెలిసిందిలే
ఏ కొంటె మరుడో.. గంధర్వ వరుడో
నా కళ్ళలోన నవ్వేనని
అమ్మమమ్మో తెలిసిందిలే
గుట్టు తెలిసిందిలే
చరణం 1:
కులికే వయసే పులకించి పోగా
పోంగు ఆగుతుందా...
ఎదలో కదిలే పొంగు ఆగుతుందా
కులికే వయసు పులకించి పోగా
పొంగు ఆగుతుందా..
ఎదలో కదిలే పొంగు ఆగుతుందా
పువ్వల్లే మారిపోయి.. ముద్దుల్లో తేలిపోయి
పువ్వల్లే మారిపోయి.. ముద్దుల్లో తేలిపోయి
కవ్విస్తే కన్నె మనసు ఆగుతుందా
అమ్మమమ్మో తెలిసిందిలే..
గుట్టు తెలిసిందిలే
నీ రూపులలోన.. నీ చూపులోన
ఏ రాచకళలో మెరిసేనని
అమ్మమమ్మో తెలిసిందిలే..
గుట్టు తెలిసిందిలే
చరణం 2 :
వలచే జాబిలి ఇలపైన రాగ
కలువ దాగుతుందా..
విరిసే మురిసే.. తలపు దాగుతుందా
వలచే జాబిలి ఇలపైన రాగ
కలువ దాగుతుందా..
విరిసే మురిసే.. తలపు దాగుతుందా
తీగల్లే అల్లుకొంటే..ఆహ..
గుండెల్లో జల్లుమంటే..ఓహో..
తీగల్లే అల్లుకొంటే..ఆహ..
గుండెల్లో జల్లుమంటే..ఓహో..
దాచినా దోర వలపు దాగుతుందా
అమ్మమమ్మో తెలిసిందిలే..
గుట్టు తెలిసిందిలే
ఏ కొంటె మరుడో.. గంధర్వ వరుడో
నా కళ్ళలోన నవ్వేనని
అమ్మమమ్మో తెలిసిందిలే..
గుట్టు తెలిసిందిలే
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి