RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, ఏప్రిల్ 2024, శనివారం

కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా | Kurise Vennello Merise Godarila | Song Lyrics | Andala Ramudu (1973)

కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా



చిత్రం: అందాల రాముడు (1973)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: సినారె

నేపథ్య గానం: రామకృష్ణ, P సుశీల,


పల్లవి:


కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా

మెరిసే గోదారిలో విరబూసిన నురగలా

నవ్వులారబోసే పడుచున్నదీ

కలువ పువ్వు వేయి రేకులతో విచ్చుకున్నదీ

పున్నమి ఎపుడెపుడా అని వేచి ఉన్నదీ

ఆ..


కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా

మెరిసే గోదారిలో ఎగసిపడే తరగలా..

నాజూకు నెలబాలుడున్నాడూ

నవమి నాడే పున్నమి అని దిగుతున్నాడూ

పున్నమి ఇప్పుడిపుడే అనిపిస్తున్నాడూ

ఆ..


కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా


చరణం:


ఈ వెండి వెన్నెల్లో ఏమిటి ఈ ఎరుపూ

ఎరుపా అది కాదు ఈ అరికాళ్ళ మెరుపూ

ఆ కాలి ఎరుపు కెంపులుగా

ఆ చిరునవ్వులె మువ్వలుగా

ఆ మేని పసిమి పసిడిగా

అందాలా వడ్డాణం అమరించాలి

అని తలచానే గాని ఆనదు నీది


ఇంతకూ..


అది ఉన్నట్టా..మరి లేనట్టా..

నడుమూ ఉన్నట్టా మరి లేనట్టా..ఊహు


పైట చెంగు అలలు దాటీ

అలలపై ఉడికే పొంగులు దాటీ

ఏటికి ఎదురీది ఈది ఎటు తోచక నేనుంటే

మెరుపులాంటి ఎరుపేదో 

కళ్ళకు మిరుమిట్లు గొలిపింది


ఏమిటది?


ఎవరమ్మా ఇతగాడూ 

ఎంతకు అంతుపట్టని వాడు

చెంతకు చేరుకున్నాడూ

హ హా..ఎవరమ్మా ఇతగాడూ

పాలవెన్నెలలోనా బాలగోదారిలా

చెంగుచెంగున వచ్చి 

చెయ్యి పట్టబోయాడూ


అంతేనా...


తిరగట్లే ఒరుసుకునే వరద గోదారిలా

పరుగుపరుగున వచ్చి పైట చెంగు లాగాడూ


ఆపైన


అతడు చెయ్యపట్టబోతుంటే 

పైట చెంగులాగబోతుంటే

ఉరిమి చూసీ ఉరిమి చూసీ 

తరిమి కొట్టబోయాను


కానీ..


చల్లచల్లగా సాగే గోదారిలా శాంత గోదారిలా

నిలువెల్లా నిండుగా తోచాడూ 

పులకించే గుండెనే దోచాడూ


ఎవరమ్మా ఇతగాడెవరమ్మా



పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు