ఏ జన్మకైనా ఇలాగే ఉందామా
చిత్రం : ప్రేమ బంధం (1976)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల, బాలు
పల్లవి :
ఏ జన్మకైనా ఇలాగే ఉందామా
నేను నీ దాననై... నీవు నా ధ్యానమై
ఇలా ఇలా ఇలా... ఇలా ఇలా ఇలా
చరణం 1 :
నీరెండకే నీ మోము కందిపొవునో
నా జిలుగు పైటనే గొడుగుగా మలచుకోనా
నీరెండకే నీ మోము కందిపొవునో
నా జిలుగు పైటనే గొడుగుగా మలచుకోనా
నిన్ను చూసి ఏ వేళ ఏ కన్ను చెదరునో
నిన్ను చూసి ఏ వేళ ఏ కన్ను చెదరునో
నా నీలి కురులే తెరలుగా నిను దాచుకోనా
ఏ జన్మకైనా ఇలాగే ఉందామా
నేను నీ దాననై... నీవు నా ధ్యానమై
ఇలా ఇలా ఇలా... ఇలా ఇలా ఇలా
చరణం 2 :
వేయిరాత్రులు కలుసుకున్నా...
విరిశయ్యకు విరహమెందుకో
కోటి జన్మలు కలిసి వున్నా...
తనివి తీరని తపన ఎందుకో
విరిశయ్యకు విరహమెందుకో...
తనివి తీరని తపన ఎందుకో
హృదయాల కలయికలో ఉదయించే తీపి అది
హృదయాల కలయికలో ఉదయించే తీపి అది
జీవితాల అల్లికలో చిగురించే రూపమది
ఏ జన్మకైనా ఇలాగే ఉందామా
నేను నీ దాననై... నీవు నా ధ్యానమై
ఇలా ఇలా ఇలా... ఇలా ఇలా ఇలా
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి