శుక్రవారపు పొద్దు సిరిని విడువొద్దు
చిత్రం : లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : చిల్లర భావనారాయణరావు
నేపధ్య గానం : జానకి
పల్లవి :
శుక్రవారపు పొద్దు సిరిని విడువొద్దు
దివ్వెనూదగ వద్దు... బువ్వనెట్టొద్దు
తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు
తొలిసంజ మలిసంజ నిదురపోవద్దు
మా తల్లి వరలక్ష్మి నినువీడదపుడు
మా తల్లి వరలక్ష్మి నినువీడదపుడు
చరణం 1 :
ఇల్లాలు కంటతడి పెట్టని ఇంట
కల్లలాడని ఇంట... గోమాత వెంట
ముంగిళ్ళ ముగ్గుల్లొ... పసుపు గడపల్లో
పూలల్లో... పాలల్లో...
పూలల్లో... పాలల్లో... ధాన్యరాశుల్లో
మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు
మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి