అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా
చిత్రం : ప్రేమ బంధం (1976)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : సుశీల, బాలు
పల్లవి :
అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా...
అయ్యో రామా చెపితే వినడమ్మా
చోటుకాని చోట అల్లరి చేటంటే వినడు
ఒదిగి ఉండమంటే ఎదలో ఎదిగి ఎదిగి పోతాడు
అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా...
అయ్యోరామా చెపితే వినడమ్మా
చరణం 1 :
ఆ...హా ఆ.... హా ఆ.. హా
నేనడిగానా ఆ చోటు... ఆహా ఆహా ఆహా
నీదేనమ్మ పొరపాటు... పాపం
దాచుకున్న సొగసు చూసి... ఊహు హా అబ్బ
దాగని నీ వయసు చూసి ...ఆ... ఆ... ఆ
ఛీ ... పాడు
అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా....
అయ్యోరామా చెపితే వినడమ్మా
చరణం 2 :
తీపి తీపిగా పెదవులు తడిపిందెవరమ్మా?
తేనె దొంగకు ఏ పూవో తేరగా దొరికిందమ్మా
చెక్కిలి పై గాటేమిటి చిలకమ్మా?
పోతుటీగ కాటేసింది ఓయమ్మా
చిన్నగాటుకే చెదిరిపోతే ఎట్టాగమ్మా...
రేపెట్టాగమ్మా
తేనెపట్టుకు చేరినప్పుడు చెబుతానమ్మా...
అప్పుడే చెబుతానమ్మా... ఇప్పుడే చెప్పాలి
అమ్మమ్మమ్మా అల్లరి పిడుగమ్మా...
ఊహు ఊహు ఆహా అబ్బబ్బ
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి