RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, ఏప్రిల్ 2024, శనివారం

ఎదగడానికెందుకురా తొందరా | Edagadanikendukura Thondaraa | Song Lyrics | Andala Ramudu (1973)

ఎదగడానికెందుకురా తొందరా 



చిత్రం: అందాల రాముడు (1973) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: ఆరుద్ర 

నేపథ్య గానం: రామకృష్ణ 


సాకి :


ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా... 

ఏడుస్తే నీ కళ్లు నీలాలు కారూ.. 

జోజో జోజో... జోజో జోజో... 


పల్లవి: 


ఎదగడానికెందుకురా తొందరా 

ఎదర బతుకంతా చిందర వందర 

జోజో జోజో... జోజో జోజో... 


చరణం 1: 


ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి 

పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి 

చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి 

పట్టుబడితె ఫెయిలైతే బిక్కమొహం వెయ్యాలి 

కాలేజీ సీట్లు అగచాట్లురా 

అవి కొనడానికి ఉండాలి నోట్లురా 

చదువు పూర్తయితే మొదలవ్వును పాట్లురా ..

అందుకే... 


చరణం 2: 


ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి 

అడ్డమైనవాళ్లకీ గుడ్మార్నింగ్ కొట్టాలి 

ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి 

ఇంటర్వ్యూ అంటూ క్యూ అంటూ 

పొద్దంతా నిలవాలి 

పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా 

మళ్లా పెట్టాలి ఇంకో దరఖాస్తురా 

ఎండమావి నీకెపుడూ దోస్తురా ..అందుకే...  


చరణం 3: 


బిఏను చదివి చిన్న బంట్రోతు పనికెళితే 

ఎంఏలు అచట ముందు సిద్ధము 

నీవు చేయలేవు వాళ్లతో యుద్ధము 

బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో 

పదినెల్లదాకా జీతమివ్వరు 

నువ్వు బతికావో చచ్చేవో చూడరు 

ఈ సంఘంలో ఎదగడమే దండగా 

మంచి కాలమొకటి వస్తుంది నిండుగా 

అపుడు ఎదగడమే బాలలకు పండగా 

అందాకా... 


ఎదగడానికెందుకురా తొందరా 

ఎదర బతుకంతా చిందర వందర 


జోజో జోజో... జోజో జోజో... 

టాటా టాటా... టాటా టాటా...


పాటల ధనుస్సు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు