RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
bapu movies లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bapu movies లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, డిసెంబర్ 2025, శనివారం

అమ్మ కడుపు చల్లగా | Amma Kadupu Challaga | Song Lyrics | Sakshi (1967)

అమ్మ కడుపు చల్లగా


చిత్రం : సాక్షి (1967)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  పి. సుశీల  


పల్లవి :


అమ్మ కడుపు చల్లగా... 

అత్త కడుపు చల్లగా

బతకరా బతకరా పచ్చగా

నీకు నేనుంటా వెయ్యేళ్ళు 

తోడుగా నీడగా 


అమ్మ కడుపు చల్లగా... 

అత్త కడుపు చల్లగా

బతకరా బతకరా పచ్చగా


చరణం 1 :


నా మెడలో తాళిబొట్టు కట్టరా .. 

నా నుదుటా నిలువు బొట్టు పెట్టరా

నా మెడలో తాళిబొట్టు కట్టరా .. 

నా నుదుటా నిలువు బొట్టు పెట్టరా

నీ పెదవి మీద సిరునవ్వు 

చెరగదురా ..

నా సిగపూవుల రేకైనా వాడదురా... 

వాడదురా .. 

బతకరా.. బతకరా పచ్చగా 


చరణం 2 :


చల్లని అయిరేణికి మొక్కరా .. 

సన్నికల్లు మీద కాలు తొక్కరా

చల్లని అయిరేణికి మొక్కరా .. 

సన్నికల్లు మీద కాలు తొక్కరా

చల్లనేళ కంటనీరు వద్దురా ...

నా నల్ల పూసలే నీకు రక్షరా.. 

రక్షరా ... బతకరా.. 

బతకరా పచ్చగా 


చరణం 3 :


నా కొంగు నీ చెంగూ ముడివేయరా .. 

నా చెయ్యి నీ చెయ్యి కలపరా

నా కొంగు నీ చెంగూ ముడివేయరా .. 

నా చెయ్యి నీ చెయ్యి కలపరా

ఏడడుగులు నాతో నడవరా ...

ఆ యముడైనా మనమద్దికి రాడురా.. 

రాడురా .... బతకరా.. 

బతకరా పచ్చగా


అమ్మ కడుపు చల్లగా... 

అత్త కడుపు చల్లగా

బతకరా బతకరా పచ్చగా


- పాటల ధనుస్సు 


14, మే 2024, మంగళవారం

మేలుకోరాదా కృష్ణా మేలుకోరాదా | Melukorada Krishna | Song Lyrics | Krishnavatharam (1982)

మేలుకోరాదా కృష్ణా మేలుకోరాదా



చిత్రం : కృష్ణావతారం (1982)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : బాలు, సుశీల, శైలజ 


పల్లవి :


మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా

మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా


నలుగురి మేలు కోరే వాడా... 

మమ్మేలుకోవేరా

మేలుకోరాదా... కృష్ణా... 

మేలుకోరాదా

నలుగురి మేలు కోరే వాడా... 

మమ్మేలుకోవేరా


మేలుకోరాదా... 


చరణం 1 :


ఆ...  ఆ... ఆ...  ఆ...  ఆ...  ఆ

జేబుదొంగలు లేచారు...  

దొరబాబు దొంగలు లేచారు

తడిగుడ్డలతో గొంతులు కోసే 

దగాకోరులు లేచారు

జేబుదొంగలు లేచారు...  

దొరబాబు దొంగలు లేచారు

తడిగుడ్డలతో గొంతులు కోసే 

దగాకోరులు లేచారు

బడా చోరులూ.. ఊ... ఊ... లేచారూ


ఎవడి దవడ నీ చేతి చలవతో 

ఎన్ని తునకలు కానుందో

ఏ జైలు నీ రాక కోసమై 

ఎంతగా ఎదురు చూస్తుందో

ఎవడి దవడ నీ చేతి చలవతో 

ఎన్ని తునకలు కానుందో

ఏ జైలు నీ రాక కోసమై 

ఎంతగా ఎదురు చూస్తుందో

ఎన్నికళ్ళతో..ఓ... ఓ... చూస్తుందో


మేలుకోరాదా... కృష్ణా... మేలుకోరాదా

నలుగురి మేలు కోరే వాడా... మమ్మేలుకోవేరా

మేలుకోరాదా... 


చరణం 2 :


మేలుకునే ఉన్నాం హమేషా 

మేలుకునే ఉంటాం

నలుగురి మేలు కోసం రేతిరి కూడా 

మేలుకునే ఉంటాం

ఖబడ్దార్... 


మేలుకునే ఉన్నాం హమేషా 

మేలుకునే ఉంటాం

నలుగురి మేలు కోసం రేతిరి కూడా 

మేలుకునే ఉంటాం

మేలుకునే ఉన్నాం ... 


ఉన్నోడికేమో తిన్నదరగదూ... 

లేనోడికా తిండే దొరకదు

ధర్మానికేమొ మొద్దు నిద్దరా... ఆ... 

దేవుడికా తీరికేదిరా


అందుకే మనం పుట్టాం...  తొడ గొట్టాం

అందుకే మనం పుట్టాం...  తొడ గొట్టాం

అన్యాయాన్ని చావబాదె డ్యూటీ చేపట్టాం


- పాటల ధనుస్సు  


13, ఏప్రిల్ 2024, శనివారం

ఎదగడానికెందుకురా తొందరా | Edagadanikendukura Thondaraa | Song Lyrics | Andala Ramudu (1973)

ఎదగడానికెందుకురా తొందరా 



చిత్రం: అందాల రాముడు (1973) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: ఆరుద్ర 

నేపథ్య గానం: రామకృష్ణ 


సాకి :


ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా... 

ఏడుస్తే నీ కళ్లు నీలాలు కారూ.. 

జోజో జోజో... జోజో జోజో... 


పల్లవి: 


ఎదగడానికెందుకురా తొందరా 

ఎదర బతుకంతా చిందర వందర 

జోజో జోజో... జోజో జోజో... 


చరణం 1: 


ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి 

పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి 

చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి 

పట్టుబడితె ఫెయిలైతే బిక్కమొహం వెయ్యాలి 

కాలేజీ సీట్లు అగచాట్లురా 

అవి కొనడానికి ఉండాలి నోట్లురా 

చదువు పూర్తయితే మొదలవ్వును పాట్లురా ..

అందుకే... 


చరణం 2: 


ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి 

అడ్డమైనవాళ్లకీ గుడ్మార్నింగ్ కొట్టాలి 

ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి 

ఇంటర్వ్యూ అంటూ క్యూ అంటూ 

పొద్దంతా నిలవాలి 

పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా 

మళ్లా పెట్టాలి ఇంకో దరఖాస్తురా 

ఎండమావి నీకెపుడూ దోస్తురా ..అందుకే...  


చరణం 3: 


బిఏను చదివి చిన్న బంట్రోతు పనికెళితే 

ఎంఏలు అచట ముందు సిద్ధము 

నీవు చేయలేవు వాళ్లతో యుద్ధము 

బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో 

పదినెల్లదాకా జీతమివ్వరు 

నువ్వు బతికావో చచ్చేవో చూడరు 

ఈ సంఘంలో ఎదగడమే దండగా 

మంచి కాలమొకటి వస్తుంది నిండుగా 

అపుడు ఎదగడమే బాలలకు పండగా 

అందాకా... 


ఎదగడానికెందుకురా తొందరా 

ఎదర బతుకంతా చిందర వందర 


జోజో జోజో... జోజో జోజో... 

టాటా టాటా... టాటా టాటా...


పాటల ధనుస్సు 



11, ఏప్రిల్ 2024, గురువారం

పలుకే బంగారమాయెరా | Paluke Bangaramayera | Song Lyrics | Andala Ramudu (1973)

పలుకే బంగారమాయెరా



చిత్రం :  అందాల రాముడు (1973)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆరుద్ర

నేపథ్య  గానం :  బాల మురళీకృష్ణ


పల్లవి :


పలుకే బంగారమాయెరా... అందాల రామ.. 

పలుకే బంగారమాయెరా

అందాల రామ... పలుకే బంగారమాయెరా 


ఖగరాజ గమన నీవే జగముల సృష్టించావు

జగమంతా ఒక ఇల్లని జనులంతా సోదరులనే... 

పలుకే బంగారమాయెరా

అందాల రామ... పలుకే బంగారమాయెరా


చరణం 1 :


లక్షాధికారులైనా లవణమన్నమే గాని

బంగారు కణికలు... మింగలేరను మంచి... 

పలుకే బంగారమాయెరా

అందాల రామ... పలుకే బంగారమాయెరా 


చిన్ని నా బొజ్జకు... శ్రీరామ రక్షనుకొన్నా

అన్నపానాదులన్ని.. అందరికుండాలనే.. 

పలుకే బంగారమాయెరా

అందాల రామ... పలుకే బంగారమాయెరా 


చరణం 2 :


బిరుదులు పదవుల మీద...  

పరనారి పెదవుల మీద

బుద్దంతా నిలిపేవాడు బూడిదై పొతాడన్న... 

ఎరుకే బంగారమాయెరా

అందాల రామ... పలుకే బంగారమాయెరా 


పంచదారను మించే... పాలూ మీగడల మించె

పరమ మధుర నామస్మరణే మంచిదనే... 

పలుకే బంగారమాయెరా


అందాలరామ పలుకే బంగారమాయెరా... 

అందాలరామ పలుకే బంగారమాయెరా

అందాలరామ పలుకే బంగారమాయెరా


పాటల ధనుస్సు 


సమూహ భోజనంబు | Samuha Bhojanambu | Song Lyrics | Andala Ramudu (1973)

సమూహ భోజనంబు



చిత్రం : అందాల రాముడు (1973)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : కొసరాజు

నేపథ్య గానం : రామకృష్ణ


పల్లవి :


సమూహ భోజనంబు.. సంతోషమైన విందు..

అంతస్తులన్ని బందు.. అహహ్హ ఏమనందు      

సమూహ భోజనంబు.. సంతోషమైన విందు..

అంతస్తులన్ని బందు.. అహహ్హ ఏమనందు         


చరణం 1 :


గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు.. 

అంగట్లో అమ్ము బియ్యం కోంటారు కలిసి మీరు

గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు..  

అంగట్లో అమ్ము బియ్యం కోంటారు కలిసి మీరు

ఆ నీటితోనె బియ్యం వండగనె వచ్చు కయ్యం.. 

ఆ నీటితోనె బియ్యం వండగనె వచ్చు కయ్యం

అబ్బా ఇదేమి న్యాయం బహు చెడ్డ సాంప్రదాయం.. 

అబ్బా ఇదేమి న్యాయం బహు చెడ్డ సాంప్రదాయం

ఈ గొణుగుచున్న ఘనులు.. కడు మూర్ఖ శిఖామణులు        

       

సమూహ భోజనంబు...  సంతోషమైన విందు

అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు         


చరణం 2 :


అరె..హ ! ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు... 

ఇస్కూల్లొ చదువునపుడు పుస్తకము మైలబడదు

ఆస్పత్రి మందులందు అంటేమి కానబడదు... 

ఇస్కూల్లొ చదువునపుడు పుస్తకము మైలబడదు

కాదప్ప అల్లాటప్ప ఇహ చెల్లదు మీ గొప్ప.. 

కాదప్ప అల్లాటప్ప ఇహ చెల్లదు మీ గొప్ప

కాలమ్ము మారెనప్పా ఓ వెర్రివెంగళప్పా..

ఆలోచనలను పెంచు.. ఆవేశములను దించు 

              

సమూహ భోజనంబు...  సంతోషమైన విందు

అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు   


చరణం 3 :


దేవుడికి మొక్కునపుడు హోటల్లో మెక్కినపుడు.. 

రైళ్ళల్లో ఎక్కునపుడు బస్సుల్లో చిక్కినపుడు

దేవుడికి మొక్కునపుడు హోటల్లో మెక్కినపుడు.. 

రైళ్ళల్లో ఎక్కునపుడు బస్సుల్లో చిక్కినపుడు

హెచ్చన్న మాటరాదు తగ్గన్న మాట లేదు.. 

హెచ్చన్న మాటరాదు తగ్గన్న మాటలేదు

సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు.. 

సహపంక్తి భోజనాన కొంపేమి మునిగిపోదు

కోపాలు సర్దుకోండి... సాపాటు పంచుకోండి


సమూహ భోజనంబు.. సంతోషమైన విందు

అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు      

సమూహ భోజనంబు.. సంతోషమైన విందు

అంతస్తులన్ని బందు... అహహ్హ ఏమనందు


పాటల ధనుస్సు 


6, ఫిబ్రవరి 2024, మంగళవారం

గోరంత దీపం కొండంత వెలుగు | Gorantha Deepam Kondanta Velugu | Song Lyrics | Gorantha Deepam (1978)

గోరంత దీపం... కొండంత వెలుగు



చిత్రం :  గోరంత దీపం (1978)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం : బాలు, సుశీల



పల్లవి :


గోరంత దీపం...  కొండంత వెలుగు

చిగురంత ఆశ...  జగమంత వెలుగు

గోరంత దీపం...  కొండంత వెలుగు

చిగురంత ఆశ...  జగమంత వెలుగు



చరణం 1 :


కరిమబ్బులు కమ్మే వేళ.. 

మెరుపు తీగే వెలుగూ

కారు చీకటి ముసిరే వేళ.. 

వేగు చుక్కే వెలుగు

కరిమబ్బులు కమ్మే వేళ..

మెరుపు తీగే వెలుగూ

కారు చీకటి ముసిరే వేళ..

వేగు చుక్కే వెలుగు



మతి తప్పిన కాకుల రొదలో 

మౌనమే వెలుగు

మతి తప్పిన కాకుల రొదలో 

మౌనమే వెలుగు

దహియించే బాధల మద్యన 

సహనమే వెలుగు

ఆహా....ఆ.. ఆ.. ఆ.. ఆ.... ఆ...ఆ.. ఆ... ఆ


గోరంత దీపం...  కొండంత వెలుగు..

చిగురంత ఆశ...  జగమంత వెలుగు..


చరణం 2 :



కడలి నడుమ పడవ మునిగితే... 

కడదాకా ఈదాలి

కడలి నడుమ పడవ మునిగితే... 

కడదాకా ఈదాలి


నీళ్ళు లేని ఎడారిలో..

ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ

నీళ్ళు లేని ఎడారిలో...  

కన్నీళ్ళైనా తాగి బతకాలి..

నీళ్ళు లేని ఎడారిలో... 

కన్నీళ్ళైనా తాగి బతకాలి..


ఏ తోడు లేని నాడు... 

నీ నీడే నీకు తోడు

ఏ తోడు లేని నాడు... 

నీ నీడే నీకు తోడు

జగమంతా దగా చేసినా...  

చిగురంత ఆశను చూడు

చిగురంత ఆశ...  జగమంత వెలుగు..

గోరంత దీపం...  కొండంత వెలుగు..

చిగురంత ఆశ...  జగమంత వెలుగు.


పాటల ధనుస్సు 

4, ఫిబ్రవరి 2024, ఆదివారం

గోడకు చెవులుంటేను | Godaku Chevuluntenu | Song Lyrics | Goratha Deepam (1978)

గోడకు చెవులుంటేను




చిత్రం :  గోరంత దీపం (1978)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  సుశీల, బాలు 



పల్లవి :


గోడకు చెవులుంటేను... నో.. నో

ఈ మేడకు కళ్ళుంటేను.. నో.. నో 


గోడకు చెవులుంటే... ఈ గుసగుస వింటాయి

ఈ మేడకు కళ్ళుంటే... ఆ మిసమిస చూస్తాయి


పిట్ట మనిషి లేని చోట ఎందుకు బెదురు

సిగ్గూ బిడియాలిక్కడ.. చెల్లాచెదురు


గోడకు చెవులుంటేను... నో.. నో

ఈ మేడకు కళ్ళుంటేను.. నో.. నో 


చరణం 1 :


పూవులకే మాటలు వస్తే...

నన్ను తుంచమంటాయి... 

జడలో ఉంచమంటాయి


కాలి మువ్వలకే పాటలు వస్తే...

నిన్ను ఆడమంటాయి... 

నన్ను చూడమంటాయి

గరిసస.. నిసగరిసనిసస

నినిరిరిమమరిరిగగ.. 

రిగపమగరి గ.. సా.. ద.. ని..పమగరిస


ఇప్పుడు చప్పుడు చేయకుండా... 

అత్తగారు వస్తే

నువ్వు బిత్తరపోతావు... 

నేను కత్తులు దూస్తాను


గోడకు చెవులుంటేను... నో.. నో

ఈ మేడకు కళ్ళుంటేను.. నో.. నో 



చరణం 2 :


చల్లని వెన్నెలకే కమ్మదనం ఉంటే...

అది నీ మనసౌతుంది... 


చల్లని కమ్మని కర్పూరానికి నున్నదనం ఉంటే...

అది నీ సొగసౌతుంది...


చల్లని కమ్మని నున్నని గాలికి తీయదనం ఉంటే...

అది నీ మమతౌతుంది


మనసు.. సొగసు.. మమత... ఆలయమైతే...

దేవతవౌతావు... ప్రణయ దేవతవౌతావు

ఆహా.. ఉమ్మ్..

ఆహా.. ఆహా...


నల్లనీ జడ చూడ నాగస్వరమాయే... 

నాగస్వరమూ మీద నందివర్ధనము

నాగస్వరమూదితే నాగులకు నిద్ర... 

జోలల్లు రాజేంద్ర భోగులకు నిద్ర..

జోజోజోజో.. జోజోజోజో.. జోజోజోజో.. జోజోజోజో.. 


మావారి కన్నుళ్లు తమ్మి పువ్వులు...

తమ్మి పువ్వులోనా కమ్మతేనిళ్లు

కోరికల పాన్పుపై  కొంగుపరిచాను

ఎవరు లేనీ చోట జోలపాడాను...


పాటల ధనుస్సు


23, నవంబర్ 2022, బుధవారం

సరికొత్త చీర ఊహించినాను | Sarikotta cheera vuhinchinanu | Song Lyrics | Pelli Pustakam (1991)

సరికొత్త చీర ఊహించినాను



చిత్రం: పెళ్లిపుస్తకం (1991)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్. పి. బాలు


పల్లవి :


సరికొత్త చీర ఊహించినాను

సరదాల సరిగంచు నేయించినాను

మనసు మమత పడుగూ పేక

చీరలో చిత్రించినాను

ఇది ఎన్నోకలల  కల నేత

నా వన్నెల రాశికి సిరి జోత

నా వన్నెల రాశికి సిరి జోత


చరణం 1:


ముచ్చట గొలిపే మొగలి పొద్దుకు

ముళ్ళు వాసన ఒక అందం

అభిమానం గల ఆడపిల్లకు

అలక కులుకు ఒక అందం

ఈ అందాలన్నీ కలబోశా

నీ కొంగుకు చెంగున ముడి వేస్తా

ఈ అందాలన్నీ కలబోశా

నీ కొంగుకు చెంగున ముడి వేస్తా


ఇది ఎన్నోకలల  కల నేత

నా వన్నెల రాశికి సిరి జోత

నా వన్నెల రాశికి సిరి జోత


చరణం 2:


చుర చుర చూపులు ఒక మారు

నీ చిరు చిరు నవ్వులు ఒక మారు

మూతి విరుపులు ఒక మారు

నువు ముద్దుకు సిద్దం ఒక మారు

నువు ఏ కలనున్నా మా బాగే

ఈ చీర విశేషం అల్లాగే

నువు ఏ కలనున్నా మా బాగే

ఈ చీర విశేషం అల్లాగే


సరికొత్త చీర ఊహించినాను

సరదాల సరిగంచు నేయించినాను

మనసు మమత పడుగూ పేక 

చీరలో చిత్రించినాను

ఇది ఎన్నోకలల  కల నేత

నా వన్నెల రాశికి సిరి జోత

నా వన్నెల రాశికి సిరి జోత


పాటల ధనుస్సు  


22, నవంబర్ 2022, మంగళవారం

హాయి హాయి శ్రీరంగ సాయి | Hayi Hayi Sriranga Sayi | Song Lyrics | Pelli Pustakam (1991)

హాయి హాయి శ్రీరంగ సాయి



చిత్రం: పెళ్లిపుస్తకం (1991)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్. పి. శైలజ, పి. సుశీల


హాయి హాయి శ్రీరంగ సాయి

హాయి హాయి శ్రీరంగ సాయి

మా పెద్ద పాపాయి ఆపదలు కాయి

మా పెద్ద పాపాయి ఆపదలు కాయి

హాయి హాయి శ్రీరంగ సాయి


ఏదీ కాని వేళ ఎడద ఉయ్యాల (2)

కోరి జో కొట్టింది కుసుమ సిరి బాల


హాయి హాయి శ్రీరంగ సాయి

హాయి హాయి శ్రీరంగ సాయి


అజ్ఞాత వాసాన అతివ పాంచాలి

ఆరళ్ళు భీమన్న దూరమ్ము సేయు

ఆవేశ పడరాదు అలసి పోరాదు

అభిమానమే చాలు అనుచుకోన మేలు


హాయి హాయి శ్రీరంగ సాయి

హాయి హాయి శ్రీరంగ సాయి

మా పెద్ద పాపాయి ఆపదలు కాయి

హాయి హాయి శ్రీరంగ సాయి


నిద్రా కన్యకలొచ్చి నిలచి దీవిస్తే

భద్ర కన్యకలేమో పలుకు తధాస్తు

నిద్రా కన్యకలొచ్చి నిలచి దీవిస్తే

భద్ర కన్యకలేమో పలుకు తధాస్తు

మాగన్నులొనైన మరచిపో కక్ష

సిరి కనుల నిద్దురకు శ్రీరామ రక్షా


పాటల ధనుస్సు  


13, నవంబర్ 2022, ఆదివారం

శ్రీరస్తూ శుభమస్తూ | Srirastu Shubamastu | Song Lyrics | Pelli Pustakam (1991)

 శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ 



చిత్రం: పెళ్లిపుస్తకం (1991)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్. పి. బాలు, సుశీల



శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ

శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం


శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ


తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా

తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా

తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా

తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా

సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా

సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా

మనసు మనసు కలపడమే మంత్రం పరమార్దం


శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ

శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం


అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో

తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో

అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో

తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో

ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని

ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని

మసకేయని పున్నమిలా మణికి నింపుకో


శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ

శ్రీకారం చుట్టుకుంది పెళ్లిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

శ్రీరస్తూ శుభమస్తూ శ్రీరస్తూ శుభమస్తూ


పాటల ధనుస్సు  


12, నవంబర్ 2022, శనివారం

అమ్ము కుట్టి అమ్ము కుట్టి | Ammu kutti Ammu kutti | Song Lyrics | Pelli Pustakam (1991)

అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో 



చిత్రం: పెళ్లిపుస్తకం (1991)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్. పి. బాలు, సుశీల


అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో

కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్

అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో

కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్


ఓ అసలే విరహం అయ్యో దూరం ఎల్లాగున్నావు

హా చారెడు పిడికెడు బారెడు పిల్లా ఎల్లాగున్నావు

ఎందా…?

చెంపకు కన్నులు చారెడు

సన్నని నడుము పిడికెడు

దువ్వి దువ్వక పువ్వులు ముడిచిన

నల్లని నీ జడ బారెడు

మనసిలాయో…


అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో

కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్


హా అయ్యో పావం ఆషాంద్ర కార్యం ఎందాయి

అదేవిటి

ఓ గుటకల చిటికెలు కిటుకులు అబ్బో చాలా గడుసు

మ్మ్ గుటకలు చిటికెలు కిటుకులు ఏమిటి సంగతి

ఆ కులుకు చూస్తే గుటకలు

సరసకు రమ్మని చిటికెలు

చక్కని చిన్నది అందం చందం

చేజిక్కాలని కిటుకులు

మనసిలాయో…


కిట్ట మూర్తి కిట్ట మూర్తి మనసిలాయో

మనసిలాయో మనసిలాయో అమ్ము కుట్టి


గుండెల్లోన గుబ గుబలాడే ఊహల ఊరెను ఉవ్విళ్ళు

పరవశమైన మా శ్రీవారికి పగ్గాల్లేని పరవళ్ళు

చుట్టూ చూస్తే అందాలు

లొట్టలు వేస్తూ మా వారు

చుట్టూ చూస్తే అందాలు

లొట్టలు వేస్తూ మా వారు

అక్కడ తమకు ఇక్కడ మనకు

విరహంలోన వెక్కిళ్ళు

మనసిలాయో హొ హొ


అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో

కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్

అమ్ము కుట్టి అమ్ము కుట అమ్ము కుట్టి మనసిలాయో

కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్


పాటల ధనుస్సు  


24, మే 2022, మంగళవారం

సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు | Sinnari Navvu | Song Lyrics | Krishnavatharam (1982)

సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు



చిత్రం: కృష్ణావతారం (1982)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ

నేపధ్య గానం: బాలు, శైలజ 


పల్లవి:


సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు

సెరువంత చీకటిని సుక్కంత వెలుగు

సుక్కంత ఎలుగేమొ సూరీడు గావాల

సిన్నారి సిరునవ్వు బతుకంత పండాల...


చరణం 1:


పువ్వులో పువ్వుంది బంగారు తల్లి

పువ్వులెంటే ముళ్ళు పొంచి ఉన్నాయి

మనసున్న మడిసొకడు ఈడనున్నాడు

ఈడు రాకుండాను తోడుండగలడు


సిన్నారి నవ్వు సిట్టి తామరపువ్వు


చరణం 2:


ఓ కంట కన్నీరు ఉరికేను చూడు

ఓ కంట పన్నీరు కురిసేను నేడు

కన్నతల్లి మనసు మురిపాలవెల్లి

కళ్ళలో మెరిసేను అనురాగవల్లి...

ఒంటిపైన లేని మనసంతవోయి

ఒడిలోని పాపాయి వటపత్ర శాయి


చరణం 3:


హాయి.. హాయి.. హాయి..ఆపదలూ గాయీ

హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ

చిలకల్లే కులికేవు మొలకపాపాయి

హాయి ..హాయి.. హాయి.. ఆపదలూగాయీ


హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ

చిలకల్లే కులికేవు మొలకపాపాయి

హాయి..హాయి..హాయి...ఆపదలూగాయీ

చిలకల్లే కులికేవు మొలకపాపాయి


అత్తరూ లేదురా పన్నీరు లేదు

ఉడుకు నీరే చాలు మనకూ పదివేలు

సాంబ్రాణి పొగమాటు ఓ సందమామ

నీ అగులు సుక్క సోగసు అద్దానికీసు

కన్నతల్లికి కంటి పాపవే గాని

కడవాళ్లకే కంటి నలుసు వయ్యావు

నేలపై పారాడు బాల కిట్టమ్మా

నెమలీకన్నేదిరా నాకు సూపమ్మా

నేలాపై పారాడు బాలా కిట్టమ్మా

నెమలీకన్నేదిరా నాకూ సూపమ్మా


- పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు